ఇంటిలిజెన్స్ బ్యూరోకి చెందిన మాజీ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అయితే… ఆయన మృతిపై పలు అనుమానాలుు వ్యక్తమౌతున్నాయి. వాకింగ్ చేస్తుండగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టడంతో ఆయన చనిపోగా…. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేక.. పథకం ప్రకారం హత్య చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంఘటన మైసూరులో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటిలిజెన్స్ బ్యూరీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆర్ఎస్ కులకర్ణి(83) అనే అధికారి చనిపోయారు. వారి ఇంటికి సమీపంలో ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో ఓ వాహనం అతనిని ఢీకొట్టింది. గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఎలా చనిపోయారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించింది. దీంతో… వారు దానిని పరిశీలించగా.. ఓ వాహనం ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అయితే.. అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని… పథకం ప్రకారమే హత్య చేశారనే అనుమానాలు వీడియో చూసినవారికి కలుగుతున్నాయి. ఆయన పక్క నుంచి వెళ్తున్నా.. పనిగట్టుకొని వెళ్లి ఢీ కొట్టినట్లు వీడియోలో కనపడుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.