ఇటీవల కాలంలో కొంతమంది ఈజీ డబ్బు కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. స్మగ్లింగ్, చైన్ స్నాచింగ్, డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం లాంటి దందాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. గత కొంత కాలంగా చెన్నై నగరంలో ఇద్దరు కేటుగాళ్ళు జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచార కేంద్రాన్ని గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తూ వచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వ్యభిచారం గుట్టు రట్టు చేశారు. ఏపీకీ చెందిన సినీ ఆర్టిస్ట్(Movie artist)లను చైన్నె తీసుకువచ్చి వేలచ్చేరిలోని నివాస ప్రాంతంలో వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు.
చైన్నె వేలచ్చేరి (Velachery) కరుమారియమ్మనగర్ గోల్డెన్ అవెన్యూ ప్రధాన రహదారిలో ఉన్న ఓ బిల్డింగ్లో వ్యభిచారం (Adultery) జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వ్యభిచార నిరోధకపు విభాగం సహాయ కమిషనర్ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ సెల్వరాణి నేతృత్వంలో పోలీసులు (Police) నిఘా పెట్టారు. ఆ సమయంలో ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించి వ్యభిచారం నడుపుతున్న బ్రోకర్లు తిరునల్వేలి జిల్లాకు చెందిన సుమియోన్ జార్జ్ (26), కాంచీపురానికి చెందిన కాళిదాసు (Kalidasa) (28)ను అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు సహాయ నటీమణులను విడిపించారు. వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.