అక్రమ డ్రగ్స్ దందాను అపాల్సిన పోలీస్ అధికారి ఏకంగా తానే అక్రమాలకు పాల్పడ్డాడు. ఓ డ్రగ్స్ కేసు(drugs case)లో దొరికిన మాదక ద్రవ్యాలను కోర్టుకు సమర్పించకుండా ఇంట్లో దాచుకున్నాడు. తర్వాత విషయం తెలిసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
తెలంగాణలో సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసు(drugs case)లో ఎస్ఐ రాజేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రాజేందర్ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఇటీవల ఎస్ఐ రాజేందర్ ఓ డ్రగ్స్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆ క్రమంలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను కోర్టులో హాజరుపరచలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజేందర్ ఇంట్లో తనిఖీలు చేయగా..డ్రగ్స్ వెలుగులోకి వచ్చింది. దీంతో డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎస్సై పట్టుకున్న డ్రగ్స్ లో కొంత దాచిపెట్టి అమ్ముకోవాలని చూసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు రాజేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
నార్కొటిక్ బృందంలో పనిచేస్తున్న ఈ ఎస్సై ఇటివల మహారాష్ట్ర(Maharashtra)లో జరిగిన ఓ డ్రగ్స్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఆ క్రమంలో ఓ నైజీరియన్ దగ్గర 80 లక్షల విలువైన 1,750 గ్రాముల మాదక ద్రవ్యాలను రాజేందర్(si rajnedar) పట్టుకున్నారు. ఆ తర్వాత దానిలో కొంత భాగం తన వద్ద ఉంచుకుని..మిగతాది కోర్టులో తక్కువగా సమర్పించారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ నార్కోటిక్ విభాగానికి ఈ సమాచారం తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు(police) అతని ఇంట్లో తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.