»Kuber Group Director Among Injured In High Speed Rolls Royce Crash Near Delhi Cop
Accident: రూ.పదికోట్ల విలువచేసే కారుకి యాక్సిడెంట్.. ప్రముఖ వ్యాపారవేత్త..!
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాపారవేత్త కన్నుమూశారు. ఈ ప్రమాదం హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలోని నూహ్‌లో న్యూఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన రోల్స్ రాయిస్ కారు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టి తుక్కు తుక్కైంది.
ట్రక్కులో ప్రయాణిస్తున్న డ్రైవర్, అసిస్టెంట్ స్పాట్లో చనిపోయారు. రోల్స్ రాయిస్ ఖరీదు రూ.10 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు ప్రముఖ పారిశ్రామిక వేత్త, కుబేర్ గ్రూప్ డైరెక్టర్ వికాస్ మాలుగా పోలీసులు ధృవీకరించారు. రోల్స్ రాయిస్‌లో ప్రయాణిస్తున్న వికాస్ మాలు తీవ్రగాయాలతో గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఆయనతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి చికిత్స అందుతోంది. వికాస్ మాలు ప్రస్తుత పరిస్థితిపై వైద్యులు ధృవీకరించాల్సి ఉంది. ట్యాంకర్ యు టర్న్ తీసుకుంటుండగా రోల్స్ రాయిస్ వేగంగా వచ్చి ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.