వేగంగా వచ్చిన కారు ఒక బైక్‌ను డీకొట్టింది. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరు(Coimbatore)లో చోటుచేసుకుంది. కెనెడీ థియేటర్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ఒక కారు అదుపు తప్పింది. ఎదురుగా వచ్చిన బైక్‌పై వెళ్తున్న వృద్ధుడ్ని (old man)తొలుత ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కగా నడుస్తూ పని కోసం వెళ్తున్న లీలావతి అనే మహిళపైకి దూసుకెళ్లింది. దీంతో ఆమె గాలిలోకి ఎగిరి రోడ్డు (Road) పక్కగా పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.కాగా, కారు (CAR)ను ర్యాష్‌గా, వేగంగా డ్రైవ్ చేసి ఇద్దరిని గాయపర్చిన వ్యక్తిని ఉదమ్ కుమార్‌గా పోలీసులు (Police) గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో ఈ సంఘటన రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.