సీఎం జగన్ (CM Jagan) ఎప్పటీకీ రాజకీయాల్లోకి రాకుండా ఏపీ ప్రజలు కంకణం కట్టకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్ర(Varahi Vijayatra)లో భాగంగా పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. జగన్ రాజకీయాలకు అనర్హుడు అని పవన్ (Pawan) ఆరోపించారు. జగన్‌పై 30కి పైగా కేసులు ఉన్నాయిని పవన్ అన్నారు.నీపై కేసులు పెడతావంటావేంటి అని పవన్ ఫైరయ్యారు. ఏపీ విభజన జరిగిన సమయంలో మాజీ మంత్రి కొనకళ్ల నారాయణపై దాడి జరిగిందని, దీనిని తాను మరిచిపోలేనన్నారు.
2014లో రాష్ట్రం కోసం టీడీపీ (TDP), బీజేపీ కూటమికి తాను మద్దతు పలికానని, ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా మరోసారి టీడీపీతో కలిసి వస్తున్నామన్నారు.మూడు నెలలు కర్రసాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు ఉంటే రాష్ట్రం కోసం పోరాడకుండా, వచ్చి మాపై దాడులు చేస్తావా? అని ప్రశ్నించారు.
జగన్ దగ్గర పావలా దమ్ము కూడా లేదని, కనీసం పార్లమెంట్లో గళం ఎత్తలేదని, ఆ రోజు సోనియాగాంధీ(Sonia Gandhi)కి కనిపించకుండా మూలకు వెళ్లి ప్లకార్డ్ పట్టుకున్నాడన్నారు. కేంద్రం వద్దకు వెళ్లి కేసులు లేకుండా చేయాలని అక్కడకు వెళ్లి కాళ్లు పట్టుకుంటున్నారన్నారు. జగన్‌ది కుటుంబ పాలన, అందరూ వారి కుటుంబ సభ్యులు, బంధువులే, వారు కాకుండా ఇతర కులస్తులతో తిట్టిస్తారు, కులాల మధ్య గొడవలు సృష్టిస్తారని ఆరోపించారు.