• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఈనెల 22న “థింకింగ్ డే” నిర్వహించాలి’

ADB: స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు ‘బెడెన్ పావెల్’ దంపతుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 22న ‘థింకింగ్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి, భారత్ స్కౌట్అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమీషనర్, ఏసీఎల్.బీ ఎస్. రాజేశ్వర్ తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 06:23 AM IST

అక్రమంగా ఇసుక రవణా.. ట్రాక్టర్ల సీజ్

KNR: కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. నారాయణరావుపల్లికి చెందిన కన్నం రమేష్, దుర్షేడ్‌కు చెందిన చేను రాజులను అరెస్టు చేసి, యజమానులపై కేసులు నమోదు చేశారు. నిందితులను తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి రూ. లక్షకు బైండోవర్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

February 21, 2026 / 06:22 AM IST

జాతీయ స్థాయికి వాలీబాల్ ప్లేయర్ తలకొండపల్లి వాసి

RR: తలకొండపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అజయ్ అనే విద్యార్థి సబ్ జూనియర్ U16 వాలీబాల్ గేమ్స్‌లో జాతీయస్థాయికి సెలెక్ట్ అయినట్లు పీడీ పాండు తెలిపారు. వారం రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలోని నేషనల్ క్యాంపులో అజయ్ పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ నెల 23 నుంచి కలకత్తాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

February 21, 2026 / 06:19 AM IST

రోడ్డు ప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు

NGKL: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని వటవర్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, మినీ ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా, లక్ష్మయ్య అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 21, 2026 / 06:19 AM IST

కార్మికుడు అనుమానస్పద మృతి

MDK: తూప్రాన్ పట్టణంలో APకి చెందిన మధుసూదన్ (32) శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. చేగుంట మండలంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న అతను తూప్రాన్ పట్టణంలో అద్దెకు ఉంటున్నాడు. నిన్న కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయకపోవడంతో తెలిసిన వాళ్లకు ఫోన్ చేశారు. రాత్రి అద్దె గది కిటికీలోంచి చూడగా మృతి చెంది ఉన్నట్లు గమనించారు. ఈ ఘటణపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

February 21, 2026 / 06:17 AM IST

జాతీయ మానవ హక్కుల కమిటీ క్యాలెండర్ ఆవిష్కరించిన సీపీ

PDPL: జాతీయ మానవ హక్కుల కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లా మానవ హక్కుల కమిటీ జిల్లా ప్రతినిధులు సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల, కార్మికుల హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా చూసుకుంటామన్నారు. ప్రతినిధులు ఎజ్జ రాజయ్య, సభ్యులు పాల్గొన్నారు.

February 21, 2026 / 06:17 AM IST

కమ్మర్‌పల్లిలో హిందూ రాష్ట్ర జాగృతి సభ

NZB: కమ్మర్‌పల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో ‘హిందూ రాష్ట్ర జాగృతి సభ’ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర సమన్వయకర్త చైతన్య గాడి, శ్రీమతి తేజస్వి వెంకటాపూర్ ప్రసంగిస్తూ.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.ఈ ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

February 21, 2026 / 06:15 AM IST

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేసిన ఎమ్మెల్యే

MBNR: మూసాపేట మండలం ఆచ్చాయిపల్లి గ్రామానికి చెందిన నరేష్, మైబు అనే విద్యార్థులు హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నారు. వారి ఉన్నత చదువులకు లాప్‌టాప్‌లు అవసరముందని బోయిని చంద్రశేఖర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

February 21, 2026 / 06:10 AM IST

‘కళాకారులకు దేవస్థానం ఉద్యోగాలలో అవకాశం కల్పించాలి’

BHNG: తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకు యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్ అన్నారు. ఆలేరులో శుక్రవారం ఆ సంఘం సభ్యుల సమావేశం కిష్టమ్మ అధ్యక్షతన నిర్వహించారు. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా కళాకారులకు అవకాశం కల్పించాలని కోరారు.

February 21, 2026 / 06:10 AM IST

10వ తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: కలెక్టర్

NRPT: జిల్లాలో 10వ తరగతి పరీక్షల సన్నద్ధతపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హెచ్ఎంలతో సమావేశమై చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అన్ని మండలాల్లో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలని ఆమె సూచించారు.

February 21, 2026 / 06:09 AM IST

కత్తి దాడిలో ముగ్గురికి గాయాలు

PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ కుటుంబంలో జరిగిన గొడవలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రామూత్ కొబ్బరికాయలు కొట్టే కత్తితో శుక్రవారం బంధువులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలించారు.

February 21, 2026 / 06:07 AM IST

ఆరోగ్యకరమైన నగర నిర్మాణమే లక్ష్యం: సృజన

HYD: స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నగర నిర్మాణమే లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన సమగ్ర శానిటేషన్ & ఎంటమాలజీ సమీక్ష నిర్వహించారు. అన్ని వార్డుల జోనల్ కమిషనర్లు, డీసీలు, ఎస్ఈడబ్ల్యూఎం ఇంజినీర్లు, ఎస్ఎఫ్ఎలతో సమావేశమై ఉదయం 6 గంటలకు హాజరు నమోదు, 100% డోర్ టూ డోర్ చెత్త సేకరణ, డ్రై డే పాటింపు, యాంటీ లార్వల్ ఆపరేషన్లపై కఠిన ఆదేశాలు జారీ చేశారు.

February 21, 2026 / 06:05 AM IST

‘ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ పనులు చేపట్టాలి’

WGL: ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్పర్సన్ చాహత్ బాజ్ పాయ్ కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

February 21, 2026 / 06:01 AM IST

మహిళా ప్రాంగణంలో మంటలు.. సురక్షితంగా విద్యార్థులు

HNK: కాజీపేట పట్టణం మడికొండలోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మహిళా ప్రాంగణంలో శుక్రవారం చెట్లకు అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో ప్రాంగణంలో ఉన్న సుమారు 100 మంది విద్యార్థినులు సురక్షితంగా బయటపడ్డారు.

February 21, 2026 / 05:47 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

PDPL: రామగుండం MLA MS రాజ్ ఠాకూర్, మనాలి దంపతులు, కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సన్నిధిలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు MLA తెలిపారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. MLA వెంట ఆయన సన్నిహితులు ఉన్నారు.

February 21, 2026 / 05:35 AM IST