కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చురుకైన అడుగులు వేస్తున్నారు. శుక్రవారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వ్యవసాయ, సాగునీటి రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.
ASF: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు DIEO రాందాస్ శుక్రవారం తెలిపారు. 5,025 మంది మొదటి సంవత్సరంలో, 4,691 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతిరోజూ ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
HYD: ఎండాకాలం వచ్చేస్తోంది.. మార్చి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. దీంతో సిటీలో బయటకు వెళ్లాలంటే భయమేసే పరిస్థితులు నెలకొంటాయి. అందుకే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. నగరంలో దాదాపు 90 ఏసీ బస్సులు సిటీలో తిరుగుతున్నాయి.
WGL: చెన్నారావుపేట మండలంలోని అక్కల్ చేడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, వాటర్ ప్లాంట్‌ను స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందన్నారు.
రామన్నపేట మండలంలో డీలర్ల వద్ద కొన్న యూరియా నకిలీదంటూ కొమ్మాయిగూడెం రైతులు ఆరోపించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న 6 బస్తాలలో 3 తెరిచి చూడగా నల్లటి మట్టి పెళ్లల వంటివి కనిపించాయని, బరువు కూడా తక్కువగా ఉందని నరసింహ, గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే, కల్తీ యూరియాతో మోసం చేస్తున్నారని వాపోయారు.
BDK: మణుగూరు గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల 2026-27 ప్రవేశాల పోస్టర్‌ను ట్రైనీ ఐఏఎస్ సౌరభ్ శర్మ ఆవిష్కరించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలలో ఉచిత విద్య, వసతి, భోజనం వంటి సౌకర్యాలు కల్పించబడతాయి.
MNCL: బెల్లంపల్లి ఏరియా GM కార్యాలయంలో GM స్ట్రక్చర్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశంలో AITUC ప్రతినిధులు కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై GM సానుకూలంగా స్పందించి, నిబంధనల ప్రకారం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తానన్నారు.
WNP: రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు (రోజులు) చేపడుతున్నారు. ప్రార్థనల సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కోరుతూ 8 వ వార్డు కౌన్సిలర్ బుసిరెడ్డి శివప్రసాద్ రెడ్డి విద్యుత్ సబ్ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా సెహ్రీ, ఇఫ్తార్ సమయాల్లో నిరంతర విద్యుత్ అందించాలని కోరారు.
ASF: ఈనెల 17న ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం జరిగిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ హరిత విద్యార్థులను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తమ శారీరక పరిమితులను అధిగమిస్తూ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
SDPT: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై జిల్లా కలెక్టర్ హైమావతి జూమ్ సమావేశంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ దశల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఇల్లు గ్రౌండింగ్ కావాలని ఎంపీడీవోలు ప్రణాళికతో పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమవుతాయని స్పష్టం చేశారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ సంస్థాగత నియామకాలు చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వారికి బాధ్యతలు అప్పగించారు. బీసీ మోర్చా అధ్యక్షులుగా నల్ల రవి, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా ముల్కల్ల కుమార్, బీసీ మోర్చా అధ్యక్షులుగా నాంపల్లి శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్ష కార్యదర్శులుగా బైరం లక్ష్మి, అంకం సంగీత నియమితులయ్యారు.
RR: ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునే విధంగా జలమండలి బస్తీబాట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జలమండలి ఎండి అశోక్ రెడ్డి శేరిలింగంపల్లి వార్డులోని శంకర్ నగర్‌లో పర్యటించారు. నీటి సరఫరా సమయంలో పలు ఇళ్లలో తనిఖీలు చేసి నీటి నాణ్యతను పరిశీలించారు. రూఫ్ వాటర్, వాన నీటిని భూమిలోకి ఇంకించే విధంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు తెలిపారు.
NRPT: జిల్లా టీఎన్జీవో (TNGO) యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి వాకిటి శ్రీహరిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. జిల్లా అధ్యక్షుడు నరసింహరెడ్డి మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో తొలిసారిగా యూనియన్ ఏర్పాటు కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ, కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించారు.
JGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేవాలాల్ బోధనలు గిరిజన సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
MDCL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం అల్వాల్ పట్టణ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. నిజామాబాద్–రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బొల్లారం స్టేషన్‌లో నిలుపుదల కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు విశాఖ ఎక్స్‌ప్రెస్, నాగావళి ఎక్స్‌ప్రెస్, నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా హాల్ట్ ఇవ్వాలని కోరారు.