• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భీంగల్ మున్సిపల్ కమిషనర్‌కు వినతి

NZB: భీంగల్ మున్సిపల్ పట్టణంలో డ్రైనేజీలలో మురికి పేరుకుపోవడం వల్ల దోమల బెడద అధికమవుతోందని, దీనివల్ల ప్రజలు డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలు వార్డుల్లో చెత్త పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

February 20, 2026 / 07:46 PM IST

‘క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు’

HNK: క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ అన్నారు. వాగ్దేవి కళాశాల క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో క్రీడాకారులకు దిలీప్ రాజ్ టీ-షర్టులను అందజేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని దిలీప్ రాజ్ అన్నారు.

February 20, 2026 / 07:43 PM IST

ముగిసిన బీటెక్ సెమిస్టర్ పరీక్షలు

NZB: తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న బీటెక్ మొదటి సెమిస్టరు పరీక్షలు నేటితో ముగిశాయి. శుక్రవారం ఉదయం జరిగిన పరీక్షకు 71 మంది విద్యార్థులకు గాను 71 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో కృషి చేసిన సిబ్బందిని వర్సిటీ ఉన్నతాధికారులు అభినందించారు.

February 20, 2026 / 07:40 PM IST

సేవాలాల్ కృషి చిరస్మరణీయం: మంత్రి

NRPT: సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఊట్కూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో గిరిజనులు నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ రాజు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గిరిజన సమాజ అభ్యున్నతి కోసం సేవాలాల్ చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:38 PM IST

అంత్యక్రియలకు రూ.10 వేలు ఆర్థిక సాయం

RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడ శివారులో నివసిస్తున్న పోచమ్మ గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. పోచమ్మ అంత్యక్రియలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.

February 20, 2026 / 07:35 PM IST

‘నిరంతరాయంగా ఏటీఎం సేవలు’

PDPL: ధర్మారం మండలం నర్సింగాపూర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నిరంతరాయంగా, 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని మేనేజర్ శ్యాం కుమార్ శుక్రవారం తెలిపారు. నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్మెంట్ మొదలైన సేవలను వినియోగదారులు సెలవు దినాలలో కూడా పొందవచ్చని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే బ్యాంకు శాఖలో సంప్రదించాలని ఆయన సూచించారు.

February 20, 2026 / 07:34 PM IST

కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహ ఆవిష్కరణ

TG: చింతపల్లి మండలం గోడుకోండ్ల వెంకటేశ్వర్ నగర్ మాల్ ఉడిపి హోటల్ ఎదురుగా ఉన్న ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలునాయక్ ఆవిష్కరించారు. ఈ మేరకు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ మనవరాలు శోభ హాజరయ్యారు. గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్లు, పద్మశాలి సంఘం గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:33 PM IST

అందుబాటులోకి నాణ్యమైన వైద్యం

SRPT: కోదాడ పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శ్రీ లేఖ హాస్పిటల్‌ను శుక్రవారం కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.

February 20, 2026 / 07:31 PM IST

మంత్రిని కలిసిన కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్

KMR: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధిపై మంత్రితో చర్చించగా, కామారెడ్డిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందించాలని ఛైర్‌పర్సన్ కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా ఆమె సత్కరించారు.

February 20, 2026 / 07:31 PM IST

ఆదర్శ పాఠశాలలో హెల్ప్ కౌంటర్ ఏర్పాటు

PDPL: ధర్మారం ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సహాయార్థం పాఠశాలలో ఆన్లైన్ చేయడానికి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ రాజకుమార్ తెలిపారు. 2026- 27 సంవత్సరంలో 6 నుంచి 10వ తరగతి వరకు చేరే అభ్యర్థులు ఈనెల 28లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.

February 20, 2026 / 07:30 PM IST

చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తే చర్యలు తప్పవు: SP

ADB: చైల్డ్ పోర్న్ వీడియోలు చూసినా, డౌన్‌లోడ్ చేసినా, సోషల్ మీడియాలో షేర్ చేసిన, ఆన్లైన్లో చూసిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం తెలియజేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోక్సో కేసు కూడా నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఒక తీవ్రమైన నేరమని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.

February 20, 2026 / 07:30 PM IST

సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి: సురేందర్

ADB: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ ASI సురేందర్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని కేబీ కాంప్లెక్స్ లో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి వివరించారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ ద్వారా వచ్చే OTP, KYC పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నేరాలకు గురైతే 1930 కు సంప్రదించాలని కోరారు.

February 20, 2026 / 07:28 PM IST

కొలువుదీరిన కొల్లాపూర్ మున్సిపల్ నూతన పాలకవర్గం

NGKL: కొల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్ ఛైర్మన్‌గా షేక్ రహీం పాషా బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది నూతన పాలకవర్గాన్ని ఘనంగా సత్కరించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో కొల్లాపూర్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

February 20, 2026 / 07:26 PM IST

కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్ ఛైర్మన్

SRD: సదాశివపేట మున్సిపల్ ఛైర్మన్ అంజమ్మ ఆధ్వర్యంలో టీజీఐఐసీ నిర్మల రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రావీణ్యను శుక్రవారం కలిశారు. నూతనంగా గెలిచిన కౌన్సిల్ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

February 20, 2026 / 07:26 PM IST

దివ్యాంగ చిన్నారుల విజయాలు స్ఫూర్తిదాయకం: డీఈవో

MNCL: ఈ నెల 17న హైదారాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి దివ్యాంగ విద్యార్థుల క్రీడా పోటీలలో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం భవిత కేంద్రంలో డీఈవో యాదయ్య విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగ చిన్నారుల విజయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అన్నారు.

February 20, 2026 / 07:26 PM IST