• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

చిరుత దాడి.. లేగ దూడలు మృతి

KMR: లింగంపేట్ మండలంలోని గాంధీనగర్లో చిరుతపులి పంజా విసిరింది. రైతు షేక్ రజాక్ పశువుల పాకలో కట్టేసిన రెండు లేగదూడలపై అర్ధరాత్రి చిరుత దాడి చేసి చంపేసింది. శుక్రవారం అటవీశాఖ అధికారులు రామకృష్ణ, వాసుదేవ్ ఘటనాస్థలిని పరిశీలించి చిరుత దాడిని ధృవీకరించారు. వెంటనే బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

February 21, 2026 / 09:03 AM IST

పంట పొలాల్లో కొంగల సందడి

​VKB: దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరగడంతో రైతులు భారీగా వరి సాగు చేశారు. ప్రస్తుతం పచ్చని పొలాల్లో రైతు నేస్తాలుగా పిలువబడే కొంగలు సందడి చేస్తున్నాయి. పంటకు నష్టం కలిగించే పురుగులు, కీటకాలను ఆహారంగా తింటూ ఈ కొంగలు రైతులకు రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రకృతి ఒడిలో ఈ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

February 21, 2026 / 09:03 AM IST

బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎంపికకు మార్చి 25లోపు దరఖాస్తులు

JGL: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో భాగంగా, 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఉత్తమ పాఠశాలల ఎంపికకు, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పథకాల కింద ఎంపికైన పాఠశాలల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని, మార్చి 25 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 09:01 AM IST

అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు Vs కవిత..!

SDPT: హరీశ్ రావుపై కవిత పోటీకి సిద్ధమవుతుందా..? అనే చర్చ సిద్దిపేట రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. BRS నుంచి బయటకు వచ్చిన కవిత, హరీశ్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనను పార్టీకి దూరం చేయడంలో ఆయన పాత్ర ఉందని, సిద్దిపేటపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘సిద్దిపేట ఎవరి అడ్డా కాదు’ అని కవిత చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.

February 21, 2026 / 09:00 AM IST

అభివృద్ధికి ‘2040’ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం: మంత్రి

NZB: రాష్ట్ర అభివృద్ధికి 2040 ప్రణాళికతో ముందుకెళుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపకుండా ఇక్కడి బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు సహకరించాలని కోరారు.

February 21, 2026 / 08:59 AM IST

చందంపేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

NLG: చందంపేట మండలం బీజేపీ నాయకులను శనివారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. AI సమ్మిట్‌లో మన దేశ పరువు పోయేలా అర్ధ నగ్నంగా కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ అరెస్ట్‌లో స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంజి నాయక్ ఉన్నారు.

February 21, 2026 / 08:59 AM IST

నల్లమలలో అరుదైన నక్షత్ర తాబేలు కనిపింపు

GDWL: నల్లమల అటవీ ప్రాంతంలో శుక్రవారం అరుదైన ‘నక్షత్రపు తాబేలు’ వెలుగుచూసింది. ఇటీవల అడవిలో అగ్నిప్రమాదాల కారణంగా వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చాయి. ITDA మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వెళ్తుండగా రోడ్డుపై భారీ తాబేలును గుర్తించారు. ఇంత పెద్ద పరిమాణంలో తాబేలును అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి.

February 21, 2026 / 08:46 AM IST

అగ్ని వీర్ నియామకాలు.. యువతకు 90 రోజుల ఉచిత శిక్షణ

పెద్దపల్లి జిల్లాలో అగ్నివీర్ నియామకాల కోసం యువతకు 90 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు, కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఫిజికల్ ట్రైనింగ్, రాత పరీక్ష కోచింగ్, మెడికల్ అవగాహన, స్టడీ మెటీరియల్ సదుపాయాలు కల్పిస్తారు. 17.5-22 ఏళ్ల మధ్య, 10వ తరగతి ఉత్తీర్ణులైన పురుషులు ఫిబ్రవరి 23లోపు రుద్రమదేవి స్టేడియంలో ఉదయం 6-8 గంటల మధ్య నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 08:45 AM IST

విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

SRD: విదేశాల్లో చదువు కోసం డా. BR.అంబేద్కర్ విదేశీ విద్యానిధి కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని SC అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి ఇవాళ తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను www.telanganaepass.gov.in లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షలు అందిస్తామన్నారు.

February 21, 2026 / 08:45 AM IST

జడ్చర్ల బాలికల గురుకులలో కలెక్టర్ తనిఖీ

MBNR: జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో భోజనం చేసి వసతులను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల మెలకువలు నేర్పించి, సందేహాలు గ్రూప్ డిస్కషన్ ద్వారా పరిష్కరించాలని సూచించారు. పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులను ధైర్యపరిచారు.

February 21, 2026 / 08:44 AM IST

నేరడిగొండ హైవేపై సోలార్ బ్యాటరీలో మంటలు

ADB: నేరడిగొండ మండల కేంద్రలో పోలీస్ స్టేషన్ ఎదుట NH-44పై కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడానికి సోలార్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. ఆకస్మాతుగా ఆ బ్యాటరీలలో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ మొత్తం కాలి బూడిదయింది. సమాచారం తెలుసుకున్న NH-44 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.

February 21, 2026 / 08:42 AM IST

సాగర్ కాలువలో వృద్ధుడి మృతదేహం లభ్యం

KMM: కొద్దిరోజుల క్రితం తప్పిపోయిన గోపాలపురం వాసి షేక్ నాగుల్ మీరా (65) శుక్రవారం సాగర్ కాలువలో మృతి చెంది కనిపించారు. టేకులపల్లి బ్రిడ్జి సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కాలువ నుంచి వెలికితీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 08:42 AM IST

భద్రకాళి బండ్‌లో టెలిస్కోప్ ఏర్పాటు

వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్ ప్రాంతంలో కార్తికేయ పట్టణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక టెలిస్కోప్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి ఈ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలోని గ్రహాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగర కమిషనర్ చావత్ బాజ్‌ పాయ్ గ్రహాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:42 AM IST

రాజకీయ సవాళ్లతో కామారెడ్డిలో హై టెన్షన్..!

KMR: జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 16వ తేదీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, MLA KVRపై అవినీతి ఆరోపణలు చేయగా, దానికి కౌంటర్‌గా షబ్బీర్ అలీపై MLA ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా.. MLA డిగ్రీ కళాశాల ఆస్తులపై నేడు బహిరంగ చర్చకు రావాలని పిలుపునివ్వడంతో నాయకులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

February 21, 2026 / 08:40 AM IST

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

GDWL: ధరూరు మండలం జాంపల్లి శివారులో శుక్రవారం పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎస్సై నందికర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రూ.37 వేల నగదు, 2 బైకులు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మిగతా వారు పరారీలో ఉన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 21, 2026 / 08:36 AM IST