MBNR: కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీని అవమానించారని నిరసిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన ఏబీవీపీ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. హన్మగల్ల బాల్ రాజ్, ప్రశాంత్, పవన్, మణికంఠ తదితరులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీసుకున్న ఈ చర్యపై ఏబీవీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, మాలోత్ రమేష్, సర్పంచ్ శేఖర్, చరణ్ సింగ్ సురేష్ గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
KMR: బాన్సువాడ డివిజన్ కేంద్రంలో శనివారం ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం రిలయన్స్ మార్ట్ షో రూమ్‌లో పనిచేస్తున్న ఓ మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడని ఫిర్యాదు చేయడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. మరో వర్గం రాళ్లతో దాడి చేయడంతో ఇరువర్గాలు ఆందోళనకు దిగారు. దీంతో శనివారం హిందూ సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు.
RR: రాజకీయాలకు డబ్బు జబ్బు పట్టుకుందని ఈ ధోరణిలో మార్పు రాకపోతే సామాన్యుడు రాజకీయాల్లోకి రాలేని దుస్థితి ఏర్పడుతుందని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓటు ప్రజలు బాధ్యతగా భావించాలని, కేవలం డబ్బుల కోసం ఓట్లు వేసే ధోరణికి దూరం కావాలని అన్నారు.
HYD: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. శనివారం మెప్మా అధికారులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలకు ప్రత్యేక రుణాలు ఇప్పించడం, వ్యాపార అవకాశాలను వారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
WNP: బంజారా సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపన కోసం వనపర్తి జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని గిరిజనులు జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తామన్నారు. విగ్రహ స్థాపన ద్వారా గిరిజనుల గౌరవం పెరుగుతుందన్నారు.
NZB: విద్యార్థులకు తల్లిదండ్రులే మొదటి గురువులని ధర్పల్లి సర్పంచ్ సీహెచ్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ధర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రుల క్రమశిక్షణ, పాఠశాలలో ఉపాధ్యా యులు బోధించే పాఠ్యాంశాలు విద్యార్థుల్లో జ్ఞాన పరివర్తనకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
MBNR: హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో దెబ్బడి బాలమ్మ, కృష్ణయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలమడ్డాయి. పాలమూరు డిప్యూటీ మేయర్ గణేశ్ సురేందర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియలకు తన వంతుగా రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
BHNG: ఎం తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన కొరిమి నర్సయ్య ఇటీవల మృతి చెందాడు. మృతుని కుటుంబానికి గ్రామ సర్పంచ్ మన్నెపు రజిత-తిరుపతి రెడ్డి రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మెండు నర్సిరెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BDK: డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని కొత్తగూడెం మేయర్ గణేశ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్‌లో శనివారం పర్యటించారు. పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి, స్థానికులతో ముచ్చటించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NGKL: పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలం మేడిపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి శనివారం ఎమ్మెల్యే హాజరై, ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
BDK: అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో సర్పంచ్ కోండ్రు సోమయ్య అధ్యక్షతన గ్రామసభ ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతిలో ఉన్నటువంటి పలు సమస్యలపై చర్చించారు. సర్పంచ్ సోమయ్య మాట్లాడుతూ.. గ్రామంలో మిగిలిపోయినా సీసీ రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ కాలువలు సమస్య విద్యుత్ స్తంభాల సమస్య, వీధి దీపాల సమస్యలను, పారిశుద్ధ్య పనులు పరిష్కరించుకోవాలని తీర్మానించారు.
MLG: జిల్లాలో మాదిగలకు రాజకీయ పార్టీలు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని MRPS రాష్ట్ర నాయకుడు వావిలాల స్వామి మాదిగ మండిపడ్డారు. కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఇవాళ ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా మాదిగలను ఓటర్లుగా మాత్రమే వినియోగిస్తూ పదవులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా నేతలు తదితరులు ఉన్నారు.
JGL: జగిత్యాలలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే 5 నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.నరేష్ తెలిపారు. బ్యాంకింగ్, RRB, SSC తదితర పోటీ పరీక్షలకు ఉచిత వసతి, స్టడీ మెటీరియల్, నోట్బుక్స్, పాకెట్ మనీతో శిక్షణ అందించనున్నారు. అభ్యర్థులు http://tsstudycircle.co.in దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
MHBD: MPPS ఉత్తర తండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హలవత్ శంకర్ గుండెపోటుతో మృతి చేందాడు. శనివారం ఉదయం ఆయన అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హలవత్ శంకర్ విద్యారంగానికి అంకితభావంతో సేవలందిస్తూ, పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా మంచి పేరు సంపాదించారని, ఆయన మరణం తీరని లోటని స్థానికులు విచారం వ్యక్తం చేశారు.