NGKL: కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో మంత్రి జూపాలి కృష్ణారావు గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, ఆర్టీసీ బస్సుల సౌకర్యాం వంటి వసతులపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
JGL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల మండలంలోని హనుమాజీపేట గ్రామంలో బొడ్డు మౌనిక-సురేశ్‌ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. సర్పంచ్ బొడ్డు దామోదర్, అంజా గౌడ్, నక్క సతీశ్ పాల్గొన్నారు.
PDPL: ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం చిన్నారులు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం, కోడిగుడ్లు, బలామృతం పంపిణీని పరిశీలించారు. సర్పంచ్ కాల్వ సుగుణ–మల్లయ్య, ఉపసర్పంచ్ బెజ్జెంకి యమున–రాజేందర్ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
WGL: రసాయన ఎరువులను తగు మోతాదులోనే వాడాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని కొండయిలపల్లి గ్రామంలో మిర్చి రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అధిక రసాయనులు వాడడం వలన పంట దిగుబడి సరిగ్గా రాదని పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులు తగ్గించాలని కోరారు.
జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి తాళ్లపల్లి నరసింహులు వేరికోసిల్ (కాళ్ల నరాల) సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు రూ.2 లక్షల LOCని మంజూరు చేయించి, నేడు అందజేశారు.
కామారెడ్డి: జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగాసనా పోటీలకు ఎంపికయ్యారని జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి శ్రీరంగ వేంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ యోగాసనా పోటీలు నేటి నుంచి 23 వరకు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్నాయని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు స్వర్ణ, రజక పతకాలు తీసుకురావాలని ఆయన కోరారు.
HYD: చంచల్‌గూడ జైలు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ HYDలో ఉగ్ర కుట్రకు మాస్టర్ మైండ్ వ్యవహరించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైలు నిబంధనల ప్రకారం లభించే ‘ములాకత్’ సమయాన్ని ఉపయోగించుకుని, బయట ఉన్న తన అనుచరులకు రహస్యంగా ఆదేశాలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
MDK: చేగుంట మండలంల వడియారం ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మాతృభాషలో చదువుకున్నప్పుడే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం సులువు అవుతుందని, మాతృభాష పట్ల ప్రతి ఒక్కరు మమకారం పెంచుకోవాలని పాఠశాల హెచ్ఎం సిద్ధిరాములు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
BDK: అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి మణుగూరు నుంచి మొరంపల్లి బంజరకు వెళ్తున్న పశువుల వ్యాన్‌ను అడ్డగించి, అక్రమంగా రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున అశ్వాపురం టీడీపీ సెంటర్ వద్ద మణుగూరు నుంచి మొరంపల్లి బంజరకు వాహనమునందు బంధించి తరలిస్తున్న 12 పశువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
KMR: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేయబడుతున్న“టెస్ట్ ఆవేలేబుల్ స్కూల్స్”పథకం కింద 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల నుండి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి. వెంకటేష్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 35 వార్డులలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితోనే సాధ్యం అవుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ పరిధిలోని కేఎల్ఆర్ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు.
SRPT: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఆపవద్దని కోరారు.
NRPT: గుండుమాల్ మండలం భక్తి మల్ల గ్రామంలో ఎస్ఈ నవీన్ కుమార్ శనివారం ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసి, రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. సర్పంచ్ జ్యోతి శ్రీకాంత్, బానోదయ్, అరుణ్, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ASF: కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో గత వారం రోజులుగా జరుగుతున్న ట్రై విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవాల్లో శనివారం MLA హరీష్ బాబు పాల్గొన్నారు. విన్నర్స్‌గా నిలిచిన అందవెల్లి, రన్నర్‌గా నిలిచిన భట్టుపల్లి జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. మాజీ MPTC పిరిసింగుల తిరుపతి, కౌన్సిలర్ చిప్పకుర్తి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో ఆశా కార్యకర్తలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి రమ్య డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌వో రాంబాబుకు వినతిపత్రం అందజేసిన ఆమె.. పీహెచ్‌సీల్లో కొందరికే పారితోషికాలు ఇచ్చి, మిగిలిన వారిని విస్మరించడం సరికాదన్నారు. ఈ నెల 23న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.