జనగామ 3వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన బూడిది జ్యోతి గోపి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, నేతలను కలిశారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని జాన్ వెస్లీ కౌన్సిలర్‌కు సూచించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు.
MLG: మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి అని మంత్రి సీతక్క అన్నారు. జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సులో మంత్రి సీతక్క పాల్గొని మహిళా సాధికారతలో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని ఆవిష్కరించారు. మహిళలను ఆర్థికంగా స్థితిమంతులుగా చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
HYD: చంచల్‌గూడ సెంట్రల్ జైలు వేదికగా ఉగ్రకుట్ర జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా వదంతులేనని జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాస్ పేర్కొన్నారు. నిర్ధారణ లేని వార్తలు ప్రసారం చేయవద్దని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని గుర్తు చేశారు. జైలులో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన జాహిద్ అనే ఖైదీ ఒక్కరే ఉన్నాడని డీఐజీ శ్రీనివాస్ తెలిపారు.
MNCL: విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలను జన్నారం మండలంలోని లోతరే గ్రామ సర్పంచ్ బోడ శంకర్ సూచించారు. శనివారం లోతరేలో పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంచి విద్యకు పెట్టింది పేరు ప్రభుత్వ పాఠశాలలని స్పష్టం చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.
NLG: దేవరకొండలోని రాంనగర్ 16వ వార్డుకు చెందిన రెడ్డి కోటేశ్వరరావు నియోజకవర్గ బీసీ సంఘం యువజన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీకాలం రెండు సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
BDK: మద్యం వ్యాపారుల కనుసన్నల్లో నడుస్తున్నా బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ రాజు దొర డిమాండ్ చేశారు. శనివారం నాయకులతో సమావేశమై మాట్లాడుతూ.. అధికారులు స్పందించకుంటే ఆదివాసీ నాయకులకు కలిసి చర్ల మండలంలోని ఏజెన్సీ ఆదివాసీ గ్రామల్లో ఉన్న బెల్ట్ షాపులుపై దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.
HNK: ఒకే వేదికపై కాంగ్రెస్ పార్టీ MLA, BRS మాజీ MLA కనిపించిన దృశ్యం శనివారం చోటు చేసుకుంది. ACP క్రైమ్ వరంగల్ సదయ్య కుమార్తె వివాహ వేడుక నేడు ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఇరువురు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
NGKL: జిల్లాలోని అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ తాగునీటి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బిజినేపల్లి మండలంలోని వట్టెం, రాంరెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్న మిషన్ భగీరథ తాగునీటి ఇంటింటి సర్వేను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.
MDK: నిజాంపేట నూతన మండలంగా ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆధార్ సెంటర్ ఏర్పాటు కాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని 16 గ్రామ పంచాయతీల ప్రజలు ఆధార్ అప్డేట్స్, కొత్త కార్డుల కోసం దుబ్బాక, రామాయంపేట, మెదక్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.
ADB: నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కోరారు. శనివారం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఆరోగ్య ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
NLG: చిట్యాల మండలం వెంబావి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ఇవాళ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఐసీడీఎస్ సూపర్ వైజర్ సునీత తెలిపారు. సర్పంచ్ గుణగంటి అలివేలు వెంకన్న ఛైర్మన్‌గా, వార్డు సభ్యుడు బంగారెక్క ప్రసాద్ వైస్ ఛైర్మన్‌గా, అంగన్‌వాడీ టీచర్ సునీత కన్వీనర్‌గా, హెచ్ఎం అరుణ, ఆశా వర్కర్లు, తల్లులు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
KNR: తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ గ్రామంలో టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖ ఆధ్వర్యంలో రూ. 13 కోట్ల వ్యయంతో డైట్ క్యాంపస్ అభివృద్ధి మరియు డైట్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్‌గ్రేడేషన్ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ హాజరై శంకుస్థాపన చేశారు.
BDK: ఇల్లందులో జామాయిల్ కర్రలు నరకడానికి వెళ్లిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన గిరిజన యువకుడు విద్యుత్ షాక్‌కు గురై శనివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన ఐటీసీ జామాయిల్ సప్లై చేసే ఓ కాంట్రాక్టర్ ఆ మృతికి తనకేమీ సంబంధం లేదని ఎటువంటి అగ్రిమెంట్లు లేవని తీర్చి చెప్పినట్లు స్థానికులు తెలిపారు.
కామారెడ్డి: లింగంపేట మండల సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సక్రు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను మండల సర్పంచులు అభినందించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నా ప్రతి ఒక్కరికి ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SRPT: మట్టపల్లి మండలంలో ఉన్న అయ్యప్ప ఆగ్రో ఏజెన్సీలో నిషేధిత బయో పురుగుమందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు నుండి తెచ్చిన బయో రసాయనాలను స్థానికంగా విక్రయిస్తూ, ముఖ్యంగా వరి పంటలకు విస్తృతంగా పిచికారి చేస్తున్నారనే వాదనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వెంటనే సంబంధిత అధికారులు ఆ షాప్‌పై రైడ్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.