• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే

వనపర్తి: నిరుపేదల సొంత ఇంటి కల నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమవుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తిలోని పలు మండలాల్లో ఆయన పర్యటించి నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారుల గృహప్రవేశాలకు హాజరై నూతన వస్త్రాల అందజేశారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కలలుగన్న కుటుంబాల ఇంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగు నింపిందన్నారు.

February 21, 2026 / 06:08 PM IST

శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

NZB: రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 06:08 PM IST

సంక్షేమ పథకాలు అందేలా కృషి: MLA

ADB: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం బేల మండలంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.

February 21, 2026 / 06:07 PM IST

పెద్దమ్మ టెంపుల్‌లో జరిగిన చోరి కేసులో నిందితుడు అరెస్ట్

మంచిర్యాల పట్టణం హమాలివాడలోని పెద్దమ్మ టెంపుల్‌లో జరిగిన చోరి కేసులో నిందితుడు గుమ్మడి సారయ్యను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. SI తిరుపతి వివరాల ప్రకారం. నిందితుడు సారయ్య టెంపుల్‌లో హుండీ పగలగొట్టి రూ. 3,000 దొంగతనం చేయడం జరిగిందన్నారు. విచారణలో నిందితుడు నిజం ఒప్పుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామన్నారు.

February 21, 2026 / 06:07 PM IST

విగ్రహ ప్రతిష్ట వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

JN: సలాక్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శంభు రామ దేవాలయంలో గత మూడు రోజులుగా దేవతమూర్తుల విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు వేడుకలకు జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజ నిర్వహించారు. సలాక్ పూర్ గ్రామాభివృద్ధికి సహకరిస్తానని, భగవంతుడి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలన్నారు.

February 21, 2026 / 06:06 PM IST

జయంతి వేడుకలకు కలెక్టర్‌కు ఆహ్వానం

NGKL: అచ్చంపేట పట్టణంలో ఈనెల 23న సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు గిరిజన నేతలు తెలిపారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ వేడుకలకు ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో యాదగిరి, డీఎస్పీ పల్లె శ్రీనివాస్ హాజరవుతున్నట్లు వారు తెలిపారు.

February 21, 2026 / 06:05 PM IST

భూ సమస్యలపై ఇంటింటా సర్వే

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో భూ, రెవెన్యూ సమస్యలపై అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి భూములకు సంబంధించిన వివాదాలు, రెవెన్యూ సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను నమోదు చేసి పరిష్కార చర్యల కోసం వివరాలను సేకరించారు.

February 21, 2026 / 06:05 PM IST

కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి

KMM: కల్లూరు మండలంలోని గంగారం గ్రామ శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు శనివారం తెల్లవారుజామున దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.65 వేల నగదు, కోడిపుంజులు, కత్తులు, 6 బైక్లు, 11 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 21, 2026 / 06:05 PM IST

త్రాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ సుజాత

BDK: కరకగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ పోలే బోయిన సుజాత అభివృద్ధి పనులలో భాగంగా ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి సమస్యను శనివారం పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు తాగునీటి సమస్యతో పాటు గ్రామంలోని ఇతర మౌలిక వస్తువుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాన్ని తెలిపారు.

February 21, 2026 / 06:05 PM IST

బాన్సువాడ అల్లర్లు.. 12 మంది అరెస్ట్

KMR: బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రిలియన్స్ మార్ట్ వద్ద జరిగిన గొడవ, కానిస్టేబుల్‌పై దాడికి సంబంధించి ఇప్పటివరకు 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం బృందాలు గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 06:04 PM IST

మున్సిపాలిటీలో వేగంగా రోడ్ల నిర్మాణం

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రూ.7.50 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పలు కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంజనీర్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పనులు నాణ్యతగా జరిగేలా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

February 21, 2026 / 06:02 PM IST

బాలికల విద్యాలయంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

KNR: సైదాపూర్ మండలం ఆకునూర్ కస్తూరిబా బాలికల విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌వో రజిత మాట్లాడుతూ.. ఒక వ్యక్తి తన చిన్నతనంలో కుటుంబ సభ్యుల ద్వారా నేర్చుకునే భాషనే మాతృభాష అంటారని పేర్కొన్నారు. ఇది మనిషికి వ్యక్తిత్వంతో పాటు గుర్తింపునిస్తుందని తెలిపారు.

February 21, 2026 / 06:02 PM IST

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్

SDPT: దుబ్బాక మండలం రామక్కాపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి చదువుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులకు సూచించారు.

February 21, 2026 / 06:02 PM IST

‘దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు’

NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో పోలీస్ సిబ్బందితో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల చేతి వేలి ముద్రలను ప్రత్యేక డివైజ్‌తో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

February 21, 2026 / 06:02 PM IST

‘ఆస్తి పన్ను గడువులోగా చెల్లించాలి’

నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల ప్రజలు ఆస్తి పన్నును గడువులోగా చెల్లించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి రాజు శనివారం ప్రకటనలో తెలిపారు. పన్నుల వసూలుకు 18 బృందావనం ఏర్పాటు చేశామని ఇందుకోసం వార్డు ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారని ఆయా వార్డ్ ఆఫీసర్లకు తమ పన్నులను చెల్లించి అధికారులకు సహకరించాలని తెలిపారు.

February 21, 2026 / 06:02 PM IST