• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఎంపీని కలిసిన జగిత్యాల్ కౌన్సిలర్లు

JGL: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల్, రాయికల్ పట్టణ కౌన్సిలర్లు ఇవాళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. భోగ శ్రావణి, జగిత్యాల్ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 06:41 PM IST

రేపు నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ విస్తృత పర్యటన

SRPT: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు హుజూర్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. రామస్వామిగుట్ట హౌసింగ్ కాలనీని పరిశీలించి, దొండపాడు రాజీవ్ గాంధీ లిఫ్ట్ పథకం, జానపహాడ్ లిఫ్ట్ పథకాల పనులను సమీక్షిస్తారు. అనంతరం నేరేడుచర్ల మండలంలో పలు బీటీ రహదారులను ప్రారంభించనున్నారు. అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

February 23, 2026 / 06:40 PM IST

‘బాధితుల సమస్యలు త్వరగా పరిష్కరించాలి’

MDK: బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఎస్హెచ్ఓ లకు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుంచి సమస్యలు నేరుగా విని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి పైరవులకు తావు లేకుండా సంప్రదించాలని సూచించారు.

February 23, 2026 / 06:32 PM IST

పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

NRML: రానున్న గోదావరి పుష్కరాలు సందర్భంగా జిల్లాలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, పుష్కర ఘాట్‌ల వద్ద భక్తులకు అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 06:32 PM IST

కలెక్టరేట్ ప్రజావాణికి 87 ఫిర్యాదులు

MBNR: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 87 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ విజయేందిర బోయి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని వెల్లడించారు.

February 23, 2026 / 06:30 PM IST

అర్జీలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 06:28 PM IST

శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

KNR: శంకరపట్నం మండలం ఎరడపల్లిలో సర్పంచ్ కొయ్యడ రజిత, గ్రామ స్వరాజ్ సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ పుల్ల సుజాత ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ఒక్క మహిళా కుట్టు మిషన్ శిక్షణను పూర్తి స్థాయిలో నేర్చుకుని స్వంతంగా ఉపాధి పొందుతూ కుటుంబంలో సమాజంలో మంచి వ్యాపారులుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 06:26 PM IST

గెజిటెడ్ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరించిన కలెక్టర్

BHPL: జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన 2026 సంవత్సర డైరీ &క్యాలెండర్‌ను కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం కలెక్టర్ చాంబర్‌లో ఆవిష్కరించారు. సంఘం సభ్యులు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. TGOలు రూపొందించిన ఈ డైరీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ముఖ్య GOలు, అధికారుల సంప్రదింపు వివరాలు సమగ్రంగా ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు.

February 23, 2026 / 06:23 PM IST

భట్టి విక్రమార్కను కలిసిన ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా భారత రాజ్యాంగ పీఠిక ప్రతిని అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం ప్రతి సమస్యను ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.

February 23, 2026 / 06:22 PM IST

ఏఎస్పీ విక్రాంత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

BDK: భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్ జన్మదినం సందర్భంగా ఇవాళ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లక్ష్మీపురం ప్రాంతంలో ఆర్గానిక్ పంటలను సాగుచేస్తూ ఆదర్శ రైతుగా నిలిచిన లక్ష్మీ రెడ్డి పంట యొక్క ప్రాముఖ్యతను ఆయనకు వివరించగా త్వరలోనే పంటలను వీక్షిస్తానని హామీ ఇచ్చారు.

February 23, 2026 / 06:22 PM IST

డ్రైవర్లకు పోలీస్ శాఖ ప్రత్యేక ఆరోగ్య శిబిరం

SRPT పట్టణంలోని టౌన్ హాల్‌లో ఈనెల 25న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నారు. సీఐ చరమందరాజు తెలిపారు. సర్కిల్ పరిధిలోని లారీ, ఆటో, స్కూల్ బస్, క్యాబ్ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ కే. నరసింహ, కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు.

February 23, 2026 / 06:19 PM IST

పోలీస్ క్రీడాకారులను అభినందించిన CP

KMM: రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి, మొత్తం 39 పతకాలు సాధించడం అభినందనీయమని సీపీ సునీల్ దత్ పేర్కొన్నారు. ఇందులో 15 బంగారు, 8 వెండి, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. క్రీడల పట్ల ఆసక్తిని కనబరుస్తూ కమిషనరేట్ పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన క్రీడాకారులను ఆయన అభినందించారు.

February 23, 2026 / 06:19 PM IST

సీఎం కప్‌లో రజతంతో మెరిసిన జట్టు

NRPT: పాలమూరు స్టేడియంలో జరిగిన రెండో రాష్ట్రస్థాయి సీఎం కప్ నెట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించింది. క్రీడాకారుల ప్రతిభను డీవైఎస్వో వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు రమేశ్ శెట్టి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

February 23, 2026 / 06:17 PM IST

మిర్యాలగూడలో సంతు సేవాలాల్ జయంతి ఉత్సవాలు

NLG: అఖిల భారత బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో MLGలో సోమవారం గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుండి బంజారా భవన్ వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఛైర్ పర్సన్ చిలుకూరి సుధ, గిరిజన నేతలు పాల్గొన్నారు.

February 23, 2026 / 06:15 PM IST

తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా సుబ్బయ్య

NGKL: తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ వికాస సమితి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా నాగర్ కర్నూల్‌కు చెందిన ప్రముఖ కవి, ఉద్యమకారుడు సుబ్బయ్య నియమితులయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్ కొనసాగనున్నారు. సుబ్బయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధంగా జరిగే అప్రజాస్వామిక చర్యలను తమ సమితి నిరంతరం ప్రశ్నిస్తుందని అన్నారు.

February 23, 2026 / 06:12 PM IST