• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రెండు వారాల్లో 134 DD కేసులు :CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.12.10 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే, 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వెల్లడించారు.

February 22, 2026 / 06:16 AM IST

నేటితో ముగియనున్న ఉచిత శిక్షణ గడువు

ADB: SC స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుందని SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ ఆదివారం తెలిపారు. డిగ్రీ పాసైన అభ్యర్థులు http://tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9494149416 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

February 22, 2026 / 06:15 AM IST

CM కప్ బాక్సింగ్ పోటీల్లో కాగజ్ నగర్ బాక్సర్‌లకు పతకాలు

ASF: సీఎం కప్, 2వ ఎడిషన్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో కాగజ్‌నగర్‌కు చెందిన ముత్తు బాక్సింగ్ క్లబ్ క్రీడాకారులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో ముగ్గురు క్రీడాకారులు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. యశ్వంత్ (52–54KGలు), హర్షిత (46-48KG ), శ్రేష్ఠ (44-46KG ) పతకాలు సాధించారు. ప్రతిభ కనబరిచిన విజేతలను కోచ్‌లు, క్రీడాభిమానులు అభిమానించారు.

February 22, 2026 / 06:14 AM IST

నేడు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాక

నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మహబూబాబాద్ జిల్లాకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు రెడ్యాల గ్రామానికి చేరుకుని, అక్కడి నుంచి 3:00 గంటలకు దేవాదుల ప్రాజెక్టు సందర్శించనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

February 22, 2026 / 06:14 AM IST

దివ్యాంగులకు శుభవార్త.. త్వరలోనే పెన్షన్లు

నిర్మల్ జిల్లాలో నూతనంగా సదరం సర్టిఫికెట్లు పొందిన దివ్యాంగులకు త్వరలో పెన్షన్లు మంజూరు కానున్నాయని స్పందన దివ్యాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ తెలిపారు. అర్హులైన వారు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలోని కొత్త దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

February 22, 2026 / 06:10 AM IST

అక్రమంగా ఇసుక రవాణా.. ట్రాక్టర్లు సీజ్..!

BHNG: అడ్డగూడూరు మండల పరిధిలోని డి.రేపాక గ్రామ శివారులోని మూసీ నది నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. గ్రామానికి చెందిన లోడంగి శ్రీకాంత్ (29), ముక్కముల మల్లేష్ (25), కన్నా స్వామి (30) నుంచి మూడు ట్రాక్టర్లను అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

February 22, 2026 / 06:10 AM IST

అనుమానస్పద స్థితిలో పశువుల కాపరి మృతి

MDK: పెద్ద శంకరం పేట మండలం కమలాపూర్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో పశువుల కాపరి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపుర్‌కు చెందిన చాకలి బుచ్చయ్య గ్రామ శివారులో శనివారం పశువుల కాయడానికి వెళ్లి అనుమాదాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 06:09 AM IST

జిల్లా ఇన్‌ఛార్జ్ DHMOగా డా. రవీందర్ గౌడ్

KMR: జిల్లా DMHO(I/C)గా డా. రవీందర్ గౌడ్‌ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డా. రవీందర్ నాయక్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. డా. రవీందర్ గౌడ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి KMRలో RMOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం డా. దుర్గా రామ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, మళ్ళీ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు DPH&F తెలిపారు.

February 22, 2026 / 06:08 AM IST

ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్

JN: జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లకు ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున మొత్తం రూ.2.25 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు పునరావాస పథకం కింద 100 శాతం సబ్సిడీతో అందించినట్లు పేర్కొన్నారు

February 22, 2026 / 06:07 AM IST

పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ విద్యార్థులకు హెచ్చరిక..!

BHPL: జిల్లాలో పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర తెలిపారు. BC, EBC విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే స్కాలర్‌షిప్ జమ కాదని స్పష్టం చేశారు. ఆధార్ సీడింగ్ త్వరగా చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 06:07 AM IST

గద్వాలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాక

GDWL: జిల్లాకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఆదివారం రానున్నట్లు కార్యకర్తలు తెలిపారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ చౌరస్తాలో నిర్వహించే సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్ నాయక్ కూడా హాజరవుతారని జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు.

February 22, 2026 / 06:05 AM IST

వైద్య శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

HNK: భీమదేవరపల్లి మండల ప్రజల కోసం స్థానిక మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగుల నమోదు ప్రక్రియ, ప్రాథమిక పరీక్షల కౌంటర్లు, జనరల్ ఫిజీషియన్ విభాగం, ఎముకల శస్త్ర చికిత్స విభాగాల్లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్లను కోరారు.

February 22, 2026 / 06:03 AM IST

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్

ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సీఎం కప్ 2025-26 రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, పూర్తి ఆత్మవిశ్వాసంతో క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అర్చరీ విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.

February 22, 2026 / 06:02 AM IST

మేయర్ ఆకస్మిక పర్యటన.. అధికారులపై ఆగ్రహం

వరంగల్ పట్టణ కేంద్రంలోని కొత్తవాడ, BT బజార్ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా కాలనీలో పేరుకుపోయిన చెత్త చెదారం చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంత దారుణంగా చెత్త పేరుకుపోతే ఏం చేస్తున్నారు? ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు ఏమీ చేయట్లేదా?” అని మండిపడ్డారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు.

February 22, 2026 / 06:01 AM IST

ప్రజల అంచనాలకు అనుగుణంగా పరిపాలన అందించాలి’

NRPT: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ తమ గ్రామాల్లో మంచి పరిపాలన అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ వినీత్‌తో కలిసి పాల్గొన్నారు.

February 22, 2026 / 05:32 AM IST