• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తెలంగాణ సాయుధ పోరాట అమరులకు నివాళులు

SRCL వేములవాడ లో తెలంగాణ రైతాంగ సాయుధపోరాట అమరులకు సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నేత కడారి రాములు మాట్లాడుతూ.. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, నిజాం నిరంకుశ పాలన వల్ల ఈ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి సీపీఐ ఆధ్వర్యంలో బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొయినొద్దీన్, రావి నారాయణరెడ్డి పిలుపుతో ప్రజలు పోరాటంలో చేరారన్నారు

March 14, 2026 / 01:27 PM IST

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో

SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్థుల పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. ఎటువంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఆయన వెంట పరీక్ష కేంద్రం సిబ్బంది ఉన్నారు.

March 14, 2026 / 01:26 PM IST

ప్రశాంతంగా ముగిసిన ‘పది’ మొదటి పరీక్ష

వనపర్తి జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో అబ్దుల్ ఘని తెలిపారు. తొలిరోజు పరీక్షకు రెగ్యులర్, ప్రైవేటు కలిపి 7,208 మంది విద్యార్థులు హాజరు కాగా, 14 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లతో జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా సాగాయని ఆయన వెల్లడించారు.

March 14, 2026 / 01:26 PM IST

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన.. జిల్లా కలెక్టర్

BHPL: జంగేడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా సందర్శించారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరుగుతున్న తీరు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలు లేకుండా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

March 14, 2026 / 01:26 PM IST

సాహితీ కళా సేవా పురస్కారంకు ఎంపికైన రాజు

SRCL: కవి, రచయిత పెరుక రాజు సాహిత్యంలో చేస్తున్న విశిష్ట కృషికి గాను ప్రతిష్ఠాత్మకమైన “సాహితీ కళా సేవా పురస్కారం2026” కు ఎంపికయ్యారు. తెలుగు భాషతో పాటు సామాజిక చైతన్యంతో కూడిన శక్తివంతమైన కలంతో అన్ని భారతీయ భాషల్లో ఆయన చేస్తున్న అసాధారణ సాహిత్య సేవలకు గుర్తింపుగా ఎంపిక చేసినట్లు సాహితీ కళా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు స్వప్న కిషోర్ తెలిపారు.

March 14, 2026 / 01:26 PM IST

GMPS జిల్లా అధ్యక్షుడిగా.. దేవేందర్

JN: జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (GMPS) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన జిల్లా గౌరవ అధ్యక్షుడిగా సాదం రమేష్, అధ్యక్షుడిగా దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులుగా జీగారి యాదగిరి, గుండా వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాలరాజు, జిల్లా సహాయ కార్యదర్శిలుగా ఆవుల ప్రభాకర్, స్వరూపను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

March 14, 2026 / 01:25 PM IST

సుతారిపల్లిలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామంలో ‘ప్రజాపాలన-ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బాలరాజ్, గ్రామ సర్పంచ్ సునీల్ పాల్గొని మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, పిల్లల రక్షణ పట్ల తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 14, 2026 / 01:22 PM IST

మోత్కూర్‌లో క్యాష్ వినియోగదారుల తిప్పలు..!

BHNG: మోత్కూర్‌లో గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు శనివారం ఉదయం నుంచే గ్యాస్ గోదాం వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచే భారీ క్యూ లైన్లు కనిపించాయి. గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సిలిండర్ కోసం ముందుగానే వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తోందని తెలిపారు.

March 14, 2026 / 01:21 PM IST

మోత్కూర్‌లో గ్యాస్ వినియోగదారుల తిప్పలు..!

BHNG: మోత్కూర్‌లో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు శనివారం ఉదయం నుంచే గ్యాస్ గోదాం వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల నుంచే భారీ క్యూ లైన్లు కనిపించాయి. గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో మహిళలు, వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. సిలిండర్ల కోసం ముందుగానే వచ్చి క్యూలో నిలబడాల్సి వస్తోందని వారు తెలిపారు.

March 14, 2026 / 01:21 PM IST

ఎస్సీ యువతకు స్వయం ఉపాధి పథకాలు: కలెక్టర్

GDWL: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పలు స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. జిల్లా ఎస్సీ సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఈ పథకాలు అమలు కానున్నాయి. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

March 14, 2026 / 01:18 PM IST

నర్సరీని పరిశీలించిన అధికారులు

MBNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాజాపూర్ మండల కేంద్రంలోని నర్సరీని అధికారులు, సర్పంచ్ కావలి రామకృష్ణ శనివారం పరిశీలించారు. మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవి ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 14, 2026 / 01:17 PM IST

భారత ప్రభుత్వ టెలికం కమిటీ సభ్యుడిగా నీరజ్

NRPT: భారత ప్రభుత్వ టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులైన అడ్వకేట్ పసుల నీరజ్‌ను శనివారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో ఈ పదవి దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లంకాల డిప్యూటీ సర్పంచ్ విజయ్, వెంకటేశ్వర రెడ్డి, బొజ్జన్న తదితరులు పాల్గొన్నారు.

March 14, 2026 / 01:14 PM IST

నరకప్రాయంగా అన్నసాగర్-సల్బత్తాపూర్ ప్రయాణం

VKB: కోట్‌పల్లి మండలంలోని అన్నసాగర్ నుంచి సల్బత్తాపూర్ వెళ్లే రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డుపై మోకాళ్ల లోతు గుంతలు పడటంతో అటుగా వెళ్లే రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ మార్గంలో ప్రయాణం ‘కత్తి మీద సామే’ అని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

March 14, 2026 / 01:14 PM IST

ఆ పార్టీకి భవిష్యత్ లేదని గ్రహించే ఈ వలసలు

HYD: నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో RR జిల్లాకు చెందిన 50 మందికి పైగా BRS నాయకులు BJPలోకి చేరారు. వారికి BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRS అస్తిత్వం కోల్పోయిందని, ఆపార్టీకి భవిష్యత్ లేదని గ్రహించే BJPలోకి చేరుతున్నారన్నారు.

March 14, 2026 / 01:11 PM IST

ఎన్నికల హామీ.. ‘వివాహ కానుక’ అందజేత

KNR: సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామానికి చెందిన ఏలూరు మధుకర్ రెడ్డి కుమార్తె సంగీత వివాహానికి గ్రామ సర్పంచ్ వేముల శ్రీకాంత్ శనివారం రూ.2,000 వివాహ కానుకను అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఈ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అశోక్, రాజు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

March 14, 2026 / 01:04 PM IST