KMM: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో కార్యచరణలో భాగంగా శనివారం కల్లూరు మున్సిపాలిటీ నాలుగో వార్డులో మున్సిపల్ ఛైర్మన్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. ఈ పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి పర్యవేక్షించారు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించారు.
NZB: సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో డా .రాజశ్రీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పాత భవనాన్ని, రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ రాజ్కుమార్ పాల్గొన్నారు.
WGL: ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత పై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. CP మాట్లాడుతూ.. వేసవి తాపం పెరుగుతున్నందున పిల్లలు ఈత కోసం చెరువులు, కుంటలకు వెళ్లే అవకాశం ఉందని, అటువంటి సందర్భాల్లో వారి పై నిరంతరం నిఘా ఉంచాలని కోరారు.
HNK: తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయించాలని వరంగల్ MP కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు MPకి లేఖ ద్వారా “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రైతుల పంటల రవాణా సులభతరం కావడానికి ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని MP అన్నారు.
NLG: చిట్యాల పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్షకు 415 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 417 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా.. ఒకరు గైర్హాజరుకాగా, మరొకరికి తెలుగు పరీక్ష నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు వెల్లడించారు.
NLG: చిట్యాల పట్టణంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు జరిగిన పదవ తరగతి తెలుగు పరీక్షకు 415 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 417 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా.. ఒకరు గైర్హాజరుకాగా, మరొకరికి తెలుగు పరీక్ష నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు వెల్లడించారు.
BHPL: రేగొండ మండల నూతన SIగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుధాకర్ను శనివారం దుంపిల్లపల్లి గ్రామ సర్పంచ్ అజ్మీర రాజేందర్, వార్డు మెంబర్లు రవి, బిక్షపతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజు అజ్మీర్, ప్రవీణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి షాబిర్ తదితరులు ఉన్నారు.
వనపర్తి పట్టణంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మిడిదొడ్డి మాధవి తెలిపారు. శనివారం 33వ వార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన బోరును కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తామని హామీ ఇచ్చారు.
MLG: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో ఇవాళ అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ వంశావతి-రమేష్ హాజరై, మాట్లాడుతూ.. “అడవిలో నిప్పు.. పర్యావరణానికి ముప్పు.. అడవి సంరక్షణ సమస్త జీవకోటి పరిరక్షణ” అనే నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. అటవీ శాఖ అధికారులు, వార్డు మెంబర్లు ఉన్నారు.
MHBD: తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని శనివారం MRO శ్రీనివాస్ స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా MRO పరీక్షల నిర్వహణ తీరు, ఇన్విజిలేషన్ విధానం, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు ఏ రకమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చూడాలని తాహసీల్దార్ అధికారులకు సూచించారు.
KMM: ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్-స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ సభ్యుడిగా ఎంపీని లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ప్రస్తుత 18వ లోక్‌సభ కాలానికి సంబంధించి భారత్-స్విట్జర్లాండ్ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.
JN: ఉప్పుగల్ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఉప్పుగల్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 30ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నానని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.
HNK: కాకతీయ యూనివర్సిటీలో శనివారం పూర్వ హిందూ వాహిని రాష్ట్ర కార్యదర్శి, గోపా జిల్లా సహాయ కార్యదర్శి మార్క సునీల్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాటను విడుదల చేశారు. కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహుజన హిందూ వికాస్ పరిషత్ సభ్యులు రఘురాం నాయక్, అనురామ్ చౌదరి ఉన్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం తీవ్ర పని భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెలాఖరులోగా పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలనే ఆదేశాలు ఒకవైపు ఉండగా, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలు మరోవైపు భారంగా మారింది. పని భారం పెరిగి పన్నుల వసూళ్లు చేయడం కష్టమవుతోందని కార్యదర్శులు వాపోతున్నారు.
VKB: దౌల్తాబాద్ మండల నూతన ఎస్సైగా వేణు కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎస్సై బంగారు రాజు వికారాబాద్ వీఆర్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నూతన ఎస్సైకి సిబ్బంది స్వాగతం పలికారు.