• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శిశు మరణాలపై సమీక్ష సమావేశం…

BHNG: మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ హేమంత్ ఆధ్వర్యంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రామకృష్ణ ఐదు సంవత్సరాలలోపు గల శిశు మరణాలపైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల మరణాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, ఏ వయసుకు వేయించాల్సిన టీకాలను ఆ వయసులోనా వేయించాలని అన్నారు. గుండాల ఆత్మకూర్ వేములకొండ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

March 21, 2026 / 08:44 AM IST

ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు: కలెక్టర్

WNP: ప్రభుత్వ స్థలాల్లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినా, కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. నాగరాలలో ఓ సామాజిక వర్గం వారి కుల దైవం ఆలయాన్ని ప్రభుత్వ స్థలంలో నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు సందర్శించి నిర్మాణం కూల్చివేశారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమన్నారు.

March 21, 2026 / 08:42 AM IST

ఓటర్ల జాబితా సవరణపై ఖమ్మం కమిషనర్ సమీక్ష

KMM: ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆధ్వర్యంలో 112-ఖమ్మం నియోజకవర్గ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR-2026) పై బూత్ లెవల్ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులు దొర్లకుండా క్షేత్రస్థాయిలో అత్యంత పారదర్శకంగా ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

March 21, 2026 / 08:42 AM IST

అక్రమ విలువలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి

KMM: గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం నేరమని, అక్రమ నిల్వలపై తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 39 ఎల్పీజీ సిలిండర్లను శుక్రవారం పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రఘునాథపాలెం మీసేవా కేంద్రంలో 32, 2 హోటళ్లలో 7 సిలిండర్లను పట్టుకొని నిర్వాహకులపై 6A కేసులు నమోదు చేశారు.

March 21, 2026 / 08:40 AM IST

నగరంలో పలు చోట్ల వర్షం

HYD: నగరంలోని తిరుమలగిరి, లాల్‌బజార్, బొల్లారం, హకీంపేట్, షామీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఉదయం చిరుజల్లులు కురిశాయి. నగరం అంతటా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల రోడ్లు తడవడంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.

March 21, 2026 / 08:40 AM IST

పోలీస్ స్టేషన్‌లో బ్యారక్ ప్రారంభం

KNR: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన మెన్, ఆఫీసర్స్ బ్యారక్‌ను సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది సేవలను గుర్తు చేస్తూ ఆయన అభినందించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసినందుకు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డితో పాటు సిబ్బందిని ప్రశంసించారు.

March 21, 2026 / 08:39 AM IST

భూ వివాదం.. 144 సెక్షన్ విధింపు

JGL: బీర్పూర్ మండల కేంద్రంలో భూ వివాదాల నేపథ్యంలో అధికారులు సెక్షన్ 144ను అమలు చేశారు. ఈ ఆదేశాల ప్రకారం నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడరాదు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మండలంలో ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని SI రాజు తెలిపారు.

March 21, 2026 / 08:38 AM IST

రంజాన్ ఈద్గా వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు

NRPT: నారాయణపేట పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. ముస్లిం సోదరులకు ప్రార్థనల సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

March 21, 2026 / 08:36 AM IST

యువతకు సబ్సిడీ రుణాలు త్వరగా అందించాలి: కలెక్టర్

VKB: బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రుణాల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్సీ యాక్షన్ ప్లాన్, షెడ్యూల్ కులాల సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ రుణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. యువత వ్యాపార అభివృద్ధి కోసం రూ. లక్ష రుణాలను 90 శాతం సబ్సిడీతో సకాలంలో అందించాలని సూచించారు.

March 21, 2026 / 08:34 AM IST

స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్

WGL: అర్హులైన SC నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సత్య శారద తెలిపారు. 2 వీలర్, ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాల కోసం సబ్సిడీతో రుణాలు అందిస్తామని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 24లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. వివరాల కోసం SC కార్పొరేషన్ ED ని సంప్రదించాలన్నారు.

March 21, 2026 / 08:34 AM IST

ఏఎంసీ చైర్మన్‌గా మహేందర్ యాదవ్ నియామకం

SDPT: చిన్నకోడూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా మీసం మహేందర్ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఈ నియామకం ద్వారా స్పష్టమైందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మంత్రి వివేక్ వెంకటస్వామిలకు మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

March 21, 2026 / 08:33 AM IST

ఈద్గా వద్ద భద్రతా తనిఖీలు

NRML: రంజాన్ సందర్భంగా నిర్మల్ ఈద్గా వద్ద జిల్లా ఎస్పీ జానకి షర్మిల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈద్గా చౌరస్తా, బైంసా-మంచిర్యాల మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై అధికారులకు సూచనలిచ్చారు. ప్రార్థనా స్థలాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశామని, భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

March 21, 2026 / 08:30 AM IST

నిధుల కేటాయింపులపై స్పష్టత కరువు: MLA

ASF: రాష్ట్ర బడ్జెట్ నిధుల కేటాయింపులపై స్పష్టత లేదని సిర్పూర్ MLA హరీష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఇందిర గిరి జలవికాసం, సోలార్ నిధులు పంపు సెట్లపై బడ్జెట్లో కేటాయించినట్లు ప్రకటించి ఇవ్వలేదు. మళ్లీ ఈ బడ్జెట్‌లో కూడా ప్రకటించారన్నారు. రాష్ట్ర పద్దులపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. అలాగే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభిస్తే స్వాగతిస్తామన్నారు.

March 21, 2026 / 08:30 AM IST

ఈద్గా వైపు ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ

ADB: ఆదిలాబాద్ ఈద్గా మైదానంలో రంజాన్ ప్రార్థనల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వాహనదారులు పట్టణంలోని అంతర్గత రోడ్లు, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

March 21, 2026 / 08:30 AM IST

జాతీయ స్థాయి పోటీలకు PD ఎంపిక

MNCL: ఢిల్లీలో ఈనెల 26 వరకు జరిగే అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్‌కు దండేపల్లి మండలం రిబ్బనపల్లి పాఠశాల పీడీ గాజుల శ్రీనివాస్ ఎంపికైనట్లు DYSO హనుమంత రెడ్డి ప్రకటనలో తెలిపారు. అతను రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి, జాతీయస్థాయికి ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా పీడీ శ్రీనివాస్‌ను DYSO, వాలీబాల్ సంఘం సభ్యులు అభినందించారు.

March 21, 2026 / 08:30 AM IST