SDPT: చిన్నకోడూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా మీసం మహేందర్ యాదవ్ నియమితులయ్యారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఈ నియామకం ద్వారా స్పష్టమైందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మంత్రి వివేక్ వెంకటస్వామిలకు మహేందర్ కృతజ్ఞతలు తెలిపారు.