MHBD: కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన కాగితోజు స్వర్ణలత గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గోపా డివిజన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ వారి పార్దివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.
NZB: బాల్కొండ మండల కేంద్రంలోని గ్రంథాలయ నూతన కేంద్ర పాలకురాలిగా వరలక్ష్మి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆర్మూర్ నుంచి బదిలీపై ఆమె ఇక్కడికి రాగా, గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన స్వామి ఆర్మూర్ గ్రంథాలయానికి వెళ్లారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యాలయంలోని పుస్తకాలు, రికార్డులు, ఫర్నిచర్‌ను ఆమెకు అప్పగించారు. రీడర్లకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.
NLG: హైదరాబాద్‌లోని నార్ముల్ డెయిరీ ఆర్థిక, పరిపాలనా సమస్యలపై ఇవాళ జరిపిన సమీక్షలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్డీడీబీ ఛైర్మెన్ మీనేష్ షా పాల్గొన్నారు. డెయిరీని గట్టెక్కించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరగా, ఎన్డీడీబీ వారు సానుకూలంగా స్పందించారు. సంస్థ పునరుద్ధరణే లక్ష్యంగా ఈ సమీక్ష జరిగిందని వారు తెలిపారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసి అభివృద్ధి చేసిన పోలీస్ అతిథి గృహాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీస్ శాఖ అధికారుల, అతిథుల వసతి సౌకర్యాలను మెరుగుపరచే దిశగా ఈ అతిథి గృహం పునర్నిర్మాణం చేపట్టినట్లు DGP తెలిపారు. CP సన్ ప్రీత్ సింగ్, తదితరులు ఉన్నారు.
WGL: నర్సంపేట నియోజకవర్గంలో లక్కీ డ్రాలు, గొలుసుకట్టు పేరుతో అక్రమ ఆర్థిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అనుమతి లేకుండానే కొందరు నిర్వాహకులు ఆకర్షణీయ ప్రకటనలతో ప్రజల నుంచి డబ్బులు సేకరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని ప్రజలను మోసగించి లాభం పొందుతున్నట్లు సమాచారం.
NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్లో అనుమానితుల వేలి ముద్రలను ప్రత్యేక పరికరంతో వేలిముద్రలను తనిఖీ చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వేలిముద్రలను తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా వస్తువులు, మనుషులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.
NRML: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఊట్ల కోటన్న, ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. కడెంలో వారు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా లేబర్ ఆఫీసర్ను రెగ్యులర్ అధికారిని నియమించాలని, కార్మికుల పెండింగ్ క్లైమ్‌లను వెంటనే సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో పోలీసులు విస్తృత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద DSP రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో భారీ వాహనాల డ్రైవర్లకు బ్రెతలైజర్ పరీక్షలు చేశారు. మొత్తం 3,150 మంది డ్రైవర్లను తనిఖీ చేయగా, 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.
PDPL: రామగుండంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం ఆదివారం ఎల్బీనగర్లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ.. తలసేమియాతో చిన్నారులకు రక్తం దొరకక ఇబ్బంది గురికావద్దని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థి బడేసాబ్ రాయచూరులో నిర్వహించిన NIC 5K మారథాన్లో బాలుర విభాగంలో మొదటి స్థానం సాధించాడు. ఈ సందర్భంగా వీసీ ప్రో. జీఎన్ శ్రీనివాస్, రిజిస్టార్ ప్రో పి.రమేష్ బాబులు విద్యార్థి ఉన్నత స్థానాలను చేరాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి,పీడీ డా వై శ్రీనివాసులు అభినందించారు.
JGL: పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యుల విజ్ఞాన యాత్ర కొనసాగుతోంది. పాలకవర్గ సభ్యులు ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం జోగులాంబ గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు కర్ణాటకలోని రాయచూర్ మార్కెట్ కమిటీని సందర్శించారు. ఆయా మార్కెట్లలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కొనుగోలు చేస్తున్న పంటలను సభ్యులు పరిశీలించారు.
HNK: శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక బీరన్న గుడి ఆలయ కమిటీ అధ్యక్షులుగా ముజిగిరి వేణు, కురుమ కుల పెద్ద మనిషిగా అమ్మ రాజు ఎన్నికయ్యారు. కురుమ కులస్తులు ఐక్యంగా ఉంటూ కుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకై కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంద దీన ప్రభాకర్, ఉపసర్పంచ్ ఫైండ్ల సునిత చంద్రమౌళి, అమ్మ అశోక్, రవీందర్, శ్రీనివాస్ ఉన్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి దేవస్థానంలో ఆదివారం సెలవు దినం పురస్కరించుకొని భక్తుల రద్దీ జరిగింది. గర్భాలయం, విష్ణు పుష్కరిణి, ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, శీఘ్ర దర్శనం తదితర దేవాలయ ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు ఉదయం నుంచి క్యూ లైన్‌లో బారులు తీరారు.
MDK: రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కమీషనర్ రాహుల్ రాజ్ పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని మాత అమ్మవారి నీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలు అందించారు.
KNR: తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను తొలిసారిగా చిన్న జీయర్ స్వామి సందర్శించారు. నుస్తులాపూర్ క్రాసింగ్ వద్ద భక్తులు ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానించగా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.