SRD: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి కార్యక్రమం నేడు అసెంబ్లీ ఆవరణలో జరిగింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సికిందర్‌తో కలిసి, మాజీ స్పీకర్‌కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
NRPT: జిల్లా కేంద్రంలోని ఓ డిగ్రీ కళాశాలలో SFI ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యమని నాయకులు తెలిపారు. ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నరహరి, భాను ప్రకాశ్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
JGL:హోలీ పండుగ సందర్భంగా మార్చి 2న జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్, కార్యాలయానికి సెలవు ప్రకటించారు. అలాగే కమిషన్ దారులు, ఖరీదారులు, కార్మికుల అభ్యర్థన మేరకు మార్చి 4న కూడా మార్కెట్ యార్డ్‌ను సెలవు ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 5 నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.సెలవు రోజుల్లో రైతులు సరుకులు తీసుకురాకూడదన్నారు.
HYD: మిడిల్ ఈస్ట్ దేశాల్లో కొనసాగుతున్న పరిస్థితులు, గగనతల పరిమితుల కారణంగా HYD శంషాబాద్ విమానాశ్రయం నుంచి నడిచే కొన్ని అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు బయలుదేరే ముందు అధికారిక వెబ్‌సైట్ www.hyderabad.aero, కస్టమర్ కేర్ +914066546370 ద్వారా చెక్ చేసుకోవాలన్నారు.
JGL: మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ వద్ద వరద కాలువలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తి నిరాధారమన్నారు. వేసవి కరువులో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
KNR: పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించనున్న లోక్ అదాలత్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి, సామరస్య వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవడానికి ఇది చక్కని వేదికని తెలిపారు. సత్వర న్యాయం పొందాలనుకునే కక్షీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
HNK: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. 10 రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డికి వారు సర్టిఫికెట్లను అందజేశారు.
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంకర్ల అక్రమ వాడకం బాగా పెరిగింది. ప్రభుత్వం పేదలకు, సామాన్యులకు సరఫరా చేయాల్సిన తాగునీటిని కొందరు ట్యాంకర్ డ్రైవర్లు ప్రైవేటు ఇంటి నిర్మాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
MNCL: జన్నారం మండలంలోని చింతగూడా, పోన్కల్ పీఎసీఎస్‌ల ద్వారా రైతులకు యూరియా బస్తాలను అందజేస్తున్నామని చింతగూడ పీఏసీఎస్ సీఈవో కావేటి రాజయ్య తెలిపారు. చింతగూడ, పోన్కల్ పిఎసిఎస్ లకు 266 చొప్పున యూరియా బస్తాలు వచ్చాయన్నారు. యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు బస్తాలను అందజేస్తున్నామని తెలిపారు. మంగళ, బుధవారాలలో యూరియా బస్తాలు రానున్నాయని తెలిపారు.
NRPT: విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుండుమల్ మండలానికి చెందిన విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు చలో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హతను బట్టి సబ్‌స్టేషన్‌లలో ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని, మీటర్ రీడింగ్ తర్వాత 30 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు.
HYDలో ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త విశ్రాంతి, ప్రశాంతత కోసం కీసర ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పట్టణ యువత జాలిగా గడిపిస్తుంటారు. కీసర కనుచూపు మెరలో పచ్చని పంట పొలాలు, ప్రస్తుతం అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అక్కడికి వెళ్లిన యూత్, రైతులతో మాట్లాడుతూ.. పచ్చని పైరుగాలని ఆస్వాదిస్తూ మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నట్టు తెలిపారు.
MBNR: బాలానగర్ మండలం చింతకుంట తండాలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కార్యకర్తలు స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు.
SRCL: బోయిన్ పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఆదివారం వీధి కుక్కలు దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కావ్య (7)కు చేయి విరగగా, అపర్ణిక (6), తీర్థాల కనకయ్య (55) గాయపడ్డారు. మూడు కుక్కలకు రేబిస్ సోకినట్లు సమాచారం. గ్రామస్తులు చర్యలు తీసుకున్నప్పటికీ, మరో రేబిస్ కుక్క ఇంకా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
KMM: కామేపల్లి మండలం ముచ్చర్లలో అడవి పంది మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముచ్చర్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 8 కిలోల మాంసాన్ని కొనుగోలు చేసి పంచుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శిల్ప, బీట్ ఆఫీసర్ నాగరాజు సోమవారం తెలిపారు.
BDK: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన పేదలకు ఉపాధి పనులు ఇవ్వకుండా అపడాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సోమవారం పాల్వంచలో బి.చిరంజీవి అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముడిపెట్టి పేదల పొట్టకొట్టే విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.