HNK: పరకాల పట్టణంలో వ్యవసాయ మార్కెట్‌లో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ నిర్మాణం, 5000 మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. రైతులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
BHPL: నాలుగో వార్డులో ఇలాంటి బాధ్యత లేని కాంగ్రెస్ నాయకులు రవీందర్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయడం సరికాదని 4వ వార్డు కౌన్సిలర్ యుగంధర్ విమర్శించారు. గురువారం సాయంత్రం కౌన్సిలర్ మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పంపిణీ చేయాల్సిన మంజూరు పత్తులను అర్హత లేని నాయకులు పంపిణీ చేయొద్దన్నారు. రవీందర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.
BDK: క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు పోటీ పడుతూ విజయం సాధించేందుకు కృషి చేయాలని మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి అన్నారు. గురువారం జర్నలిస్ట్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పినపాక ప్రజాప్రతినిధులు, కరకగూడెం జర్నలిస్టులకు మధ్య జరిగిన మ్యాచ్‌లో కరకగూడెం జర్నలిస్టులు విజయం సాధించారు.
SRCL: ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలంపాటు అధిక ఆదాయాన్ని పొందవచ్చని పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ సాగు, ఫర్టిలైజర్ యాప్, వ్యవసాయ యాంత్రీకీకరణ, రైతుల వివరాల నమోదు, క్రాప్ బుకింగ్ తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
PDPL: పెద్దపల్లి మార్కెట్ యార్డులో గురువారం పత్తి విక్రయాలు సజావుగా జరిగాయి. కనిష్ట ధర రూ.5501, గరిష్ట ధర రూ.7468, మోడల్ ధర రూ.7121గా నమోదైంది. 1282 బస్తాల్లో 1371.74 క్వింటాళ్లు విక్రయానికి రాగా, 509 మంది రైతులు పాల్గొన్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని అధికారులు తెలిపారు.
BDK: మణుగూరు మండలం కూనవరం లో మజీద్-ఎ-బిలాల్ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సహనం, సేవా భావం, దయ, సౌభ్రాతృత్వానికీ ప్రతీక అని కొనియాడారు.
ADB: బాల్య వివాహ రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను నిలిపేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం పట్టణంలో బాల్య వివాహ నిరోధక అధికారులు నిర్వహించిన అభయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ASF: రెబ్బెన మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు MRO సూర్య ప్రకాశ్ గురువారం తెలిపారు. నారాయణపూర్, కొమురవెల్లి నుంచి మంచిర్యాలకు అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న ఇసుకను అడ్డుకొని ట్రాక్టర్ ఓనర్ కాదబండి ప్రవీణ్ కు రూ.5,000ల జరిమానా విధించినట్లు చెప్పారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని MRO హెచ్చరించారు.
VKB: ధారూర్ మండల కేంద్రంలోని బస్టాండ్‌లో సీసీ ప్లాట్‌పారమ్ పనులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షాలు పడితే బస్టాండ్ ఆవరణ అంతా మురుగునీరు, బురదతో నిండి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అధికార యంత్రాంగం స్పందించి సీసీ పనులు చేపట్టడంతో ఇకపై సౌకర్యంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
SRPT: జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా హుజూర్ నగర్‌కు చెందిన చెన్నగాని బాలకృష్ణ గౌడ్‌ను నియమించారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. బీసీల అభ్యున్నతి, సంఘ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, బీసీల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు.
NLG: దేవరకొండ ఆర్టీసీ డిపోలో ‘సురక్షిత ప్రయాణం’పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకట్ రెడ్డి, డిపో మేనేజర్ విజయకుమారి పాల్గొని మాట్లాడారు. డ్రైవర్లు వాహనం నడిపేటప్పుడు ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
BHPL: రేగొండ మండలం భాగిర్తిపేట గ్రామంలో టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అంబాల నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 20 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. అనుమతులు లేకుండా రేషన్ బియ్యాన్ని రాష్ట్ర బయటకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై అధికారులు హెచ్చరించారు.
NGKL: బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించబోమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కుమ్మెర ఘటన బాధితులను బుధవారం ఆయన పరామర్శించారు. కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ.పాటిల్‌తో సమావేశమై కేసు నమోదు ప్రక్రియ, నిందితులపై తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని తెలిపారు.
BDK: మణుగూరు సింగరేణి గనిలో ట్యాగ్తో కూడిన ఓ రేసింగ్ పావురం పట్టుబడిన చెన్నై పావురాల రేసింగ్ క్లబ్ సొసైటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన పోటీలో భాగంగా దీనిని వదిలారు. గమ్య స్థానానికి వెళ్లే క్రమంలో దాహంతో అది మణుగూరు గనిలో దిగగా, సింగరేణి సిబ్బంది దానిని గుర్తించారు. కాలికి ఉన్న ట్యాగ్ ఆధారంగా అది రేసింగ్ పావురమని గుర్తించారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శివాజీ నగర్ కు చెందిన చొప్పదండి నరసయ్య (67) ఈనెల 23న మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో నరసయ్య కుటుంబ సభ్యులు ఇవాళ అతని లివర్, లంగ్స్ దానం చేశారు.