SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన రాంబాబు మృతి చెందడంతో ఆయన వృద్ధ తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు, భార్య దిక్కులేని వారయ్యారు. ఈ విషాద సమయంలో తామున్నామంటూ భరోసా ఇస్తూ మిత్రులందరూ కలిసి ఇవ్వాళ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
KMR: బాన్సువాడ పట్టణంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం పరిశీలించారు. ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలను పరిశీలించి భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఎలాంటి చిన్న ఘటన కూడా చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు.
PDPL: ప్రైవేటు ఆసుపత్రిలో నెలలు నిండక ముందు జన్మించిన నవజాత కవల పిల్లలకు PDPL ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో అత్యుత్తమ చికిత్స అందించి బాగు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీధర్ మంగళవారం తెలిపారు. ఈనెల 6న అడ్మిట్ చేసుకుని డా. వాసుదేవరావు నేతృత్వంలో చికిత్స అందించి ఇవాళ డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డా. శ్రీధర్ వైద్యులను అభినందించారు.
ASF: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో CPI (ML) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కాగజ్ నగర్‌లో మంగళవారం విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి ఎండీ చాంద్ పాషా మాట్లాడుతూ.. భూ, కార్మిక, రైతాంగ పోరాటాల్లో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.
NRPT: మక్తల్-మంథన్ గోడ్ రహదారి అధ్వానంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వర్షం వల్ల గొల్లపల్లి సమీపంలో రోడ్డుపై భారీ నీరు చేరి చెరువును తలపిస్తోంది. గుంతలతో బురద ఏర్పడిన రోడ్డుపై వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులు అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
PDPL: పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు మంగళవారం ఎమ్మెల్యే విజయరమణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా,ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన పేర్కన్నారు.
KMR: విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్ఎస్ పేట్సంగం పీఈటీ, బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు లక్ష్మణ్రాథోడ్కు ఇండియన్ బెస్ట్ ఇన్స్పిరేషన్ అవార్డు వరించింది. న్యూఢిల్లీకి చెందిన గ్యాన్ ఉదయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవార్డును ఆయనకు అందజేసింది.
NZB: భీంగల్ మండలం పల్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలల లాంగ్వేజెస్ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఐ.సీ.టీ టూల్స్, డిజిటల్ టూల్స్, IFP బోర్డు, దీక్ష ఆప్ మొదలైన వాటిని పాఠశాలలో ఏ విధంగా ఉపయోగిస్తునరన్న ఆంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల లాంగ్వేజెస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ బండి సంజయ్‌ను శాలువుతో ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందని ఎంపీ అభినందిచారు. ప్రజలకు నిరంతరం తోడు ఉంటూ.. వార్డు అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి తెలిపారు.
HNK: పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బాల్య వివాహ విముక్తి అవగాహన ప్రచార రథాన్ని నేడు హన్మకొండలో ఎంపీ ప్రారంభించారు. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.
MLG: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై ములుగు జిల్లా బీఆర్ఎస్ దళిత నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా గెలుపును జీర్ణించుకోలేక నిర్బంధాలకు పాల్పడటం హేయమని అన్నారు. కుళ్ళు రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ ప్రవీణ్, కర్రీ శ్రీను, బియ్యం శ్రీను, బోడ ప్రసాద్, పాల్గొన్నారు.
MHBD: జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం తెలంగాణ మలి విడత ఉద్యమకారిణి, రచయిత్రి జలజకు కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. జలజ చిత్రపటానికి డీ పీ ఆర్ ఓ రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణవేణి, కళాకారులు పాల్గొన్నారు.
MBNR: హన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన, సదుపాయాలు, నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం SSC విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
SDPT: కులం పేరుతో రాజకీయం చేస్తూ MP రఘునందన్ రావును విమర్శిస్తే ఊరుకునేది లేదని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీల స్వామి ముదిరాజ్, రాయపోల్ బీజేపీ మండల అధ్యక్షుడు మంకిడి స్వామి హెచ్చరించారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. కులం పేరుతో రాజకీయం చేస్తున్న నీలం మధు చరిత్ర ప్రజలందరికీ తెలుసని ధ్వజమెత్తారు.
KNR: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జేఏసీ పిలుపునిచ్చిన ‘ఛలో సచివాలయం’ కార్యక్రమానికి కరీంనగర్ రీజియన్ టీఎంయూ నాయకులు భారీగా తరలివెళ్లారు. టీజీఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలను ఆపాలని, కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.