• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రామయ్య నిత్య కళ్యాణం వైభవంగా

BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి బేడ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి, విశ్వక్సేన పూజ, కంకణధారణ తదితర కార్యక్రమాల మధ్య అర్చకులు నిత్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

February 28, 2026 / 12:53 PM IST

FLASH: GHMC చట్టం స్థానంలో రానున్న కొత్త కోర్ అర్బన్ చట్టం

HYD: ORR పరిధి మూడు కార్పొరేషన్లకు వర్తించేలా GHMC చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ, వాటర్ హార్వెస్టింగ్, చెరువుల అభివృద్ధి పనులను 99 రోజుల కార్యాచరణలో ప్రాధాన్యంగా చేపట్టాలని సూచించారు.

February 28, 2026 / 12:50 PM IST

క్లిక్ చేసే ముందు ఆలోచించండి

RR: షాద్ నగర్ పట్టణంలోని కుంటపడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సింబయాసిస్ ఇంటర్‌నేషనల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నరసింహులు మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులను క్లిక్ చేయడం మూలంగా నష్టపోవడం తప్ప ఏది ఉండదని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. క్లిక్ చేసే ముందు ఆలోచించాలని తెలిపారు.

February 28, 2026 / 12:49 PM IST

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: సబ్ కలెక్టర్

KMR: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకాంక్షించారు. జుక్కల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారి చదువుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించాలని, త్వరలో జరగనున్న వార్షిక పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్నారు.

February 28, 2026 / 12:49 PM IST

MPDOకు డిప్యూటీ సీవోగా పదోన్నతి

RR: మొయినాబాద్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సంధ్యకు పదోన్నతి లభించింది. గత నాలుగేళ్లుగా మొయినాబాద్‌లో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఆమె కృషి, నిబద్ధత, పారదర్శకతకు గుర్తింపుగా డిప్యూటీ సీవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.

February 28, 2026 / 12:49 PM IST

ఖండ శాఖల సంగమం విజయవంతం చేయాలి: రాంరెడ్డి

NRPT: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఊట్కూర్ ఖండలో నిర్వహించనున్న ఖండ శాఖల సంగమాన్ని విజయవంతం చేయాలని ఖండ సంఘచాలక్ శ్రీ రాంరెడ్డి కోరారు. ఖండ పరిధిలోని 56 గ్రామాలకు చెందిన స్వయం సేవకులు ఉదయం 7 గంటలకు జాజాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఒకే వేదికపై సమావేశమవుతారని తెలిపారు.

February 28, 2026 / 12:48 PM IST

రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి చేయించుకోవాలి: ఏడీఏ

KMM: పీఎం కిసాన్, కేంద్ర పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఖమ్మం ఏడీఏ కొంగర వెంకటేశ్వర రావు అన్నారు. శనివారం కామేపల్లి మండలంలో మద్దులపల్లి గోవింద్రాల నెమలిపురి గ్రామాల్లో పర్యటించి ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ శ్రేణిలో నిలిచిందన్నారు.

February 28, 2026 / 12:48 PM IST

అంబులెన్స్ వాహనాలు సరిపోక కష్టంగా చివరి మజిలీ..!

HYDలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో చివరి మజిలీ చాలా కష్టంగా మారిందని బాధితులు లబోదిబోమంటున్నారు. రోజు దాదాపుగా 50 కి పైగా కేసుల్లో మృతదేహాలకు పైగా పోస్టుమార్టం జరుగుతుంది. కానీ.. మృతదేహాలను తరలించేందుకు సరైన సంఖ్యలో అంబులెన్సులు లేకపోవడంతో, ప్రైవేటు అంబులెన్స్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

February 28, 2026 / 12:46 PM IST

కర్విరాల గ్రామంలో గంగమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన

SRPT: నడిగూడెం మండలం కర్విరాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తి మార్గం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.

February 28, 2026 / 12:43 PM IST

ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు నిర్మల్ విద్యార్థులు

NRML: నిర్మల్ సోమవారపేట ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఎస్. వైష్ణవి, ఎం.చరణ్య ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు పరమేశ్వర్ శనివారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు సంవత్సరానికి రూ. 12,000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారు అభినందించారు.

February 28, 2026 / 12:40 PM IST

అక్రమ ఇసుక రవాణా.. రెండు టిప్పర్లు పట్టివేత

NZB: నవీపేట్ మండల పరిధిలోని ఫకీరాబాద్ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని గంజిగావ్ నుంచి నిజామాబాద్‌కు ఇసుక తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి వాహనాలను పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

February 28, 2026 / 12:40 PM IST

పట్టణం క్లీన్ గ్రీన్ లక్ష్యం: కమిషనర్

VKB: పట్టణాన్ని క్లీన్ & గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం మున్సిపల్లో శానిటేషన్ పనులను కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఏసుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎక్కడా చెత్తాచెదారం ఉంచకుండా పరిశుభ్ర వాతావరణం కల్పించాలన్నారు.

February 28, 2026 / 12:36 PM IST

రేపటి నుంచి పాలేరు స్థాయి క్రికెట్ పోటీలు

KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరిలో రేపటి నుంచి పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. కరుణగిరి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ టోర్నీ వాల్‌పోస్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు.

February 28, 2026 / 12:36 PM IST

‘పనులు చెల్లించి… అభివృద్ధికి సహకరించాలి’

SDPT: హుస్నాబాద్ పట్టణ ప్రజలకు, దుకాణ యజమానులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ కోరారు. ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్సులు మార్చి 31వ తేదీలోపు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. పన్నులు వసూలు చేయడానికి వచ్చే సిబ్బందికి సహకరించాలని తెలిపారు.

February 28, 2026 / 12:34 PM IST

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

BDK: భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కంబపాటి శ్రీనివాస్ తనయుడు కంబపాటి జశ్వంత్ ఈరోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 12:32 PM IST