RR: మధ్యతరగతి కుటుంబంలో జన్మించి జాతీయ పరీక్షల్లో కేశంపేట(M) తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన హనితేజరెడ్డి సత్తా చాటారు. JEE మెయిన్‌లో 99.63% మార్కులు సాధించి తన ప్రతిభ చాటాడు. మారుమూల ప్రాంతంలో చదువుకుంటూ ఈ విజయాన్ని సాధించడం విశేషం. ఆయన విజయంపై గ్రామస్తులు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
VKB: మున్సిపల్ పరిధిలోని 34వ వార్డు అయ్యప్ప కాలనీలో రోడ్డుపై నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతిరోజు నీరు వెళ్లడంతో ఈ మార్గాన వెళ్లే వాహనాలు ప్రజలు కాలనీవాసులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. సంబంధిత వార్డు కౌన్సిలర్ స్పందించి ఈ సమస్యని తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
KMM: వైరా ప్రాంతంలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించి, ఎకరాకు తగిన పరిహారం ప్రకటించాలి. పంట బీమా వర్తింపజేయడంతో పాటు, పాత రుణాలపై వడ్డీ మాఫీ చేసి, కొత్తగా వడ్డీ లేని రుణాలు అందించాలని కోరారు.
WNP: జిల్లాలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను ఎటువంటి లోటు లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
KMR: కంటి సమస్యలపై నిర్లక్ష్యం వహించకూడదని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. నేడు సదాశివనగర్ TS మోడల్ స్కూల్‌లో కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అద్దాలు వాడాలని తెలిపారు. కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మొబైల్, స్క్రీన్ వినియోగం తగ్గించాలని, విటమిన్లు ఉన్న పోషక పదార్థలను తీసుకోవాలన్నారు.
MDCL: మీడియా ప్రజల గొంతుకగా నిలవాలని తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫోరం ఛైర్ పర్సన్ డా.వ్యాసభట్ శ్రీవాణి చౌదరి అన్నారు. ఉప్పల్ ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ నూతన కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. ఉప్పల్ అభివృద్ధికి మీడియా నిర్మాణాత్మక సహకారం అవసరమని పేర్కొన్నారు.
SRCL: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చెయ్యనున్నట్లు ఇంఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. పరీక్షలకుముందు AM 9 గంటల నుంచి PM 12 గంటల వరకు జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. హాల్ టికెట్లు TGBIE వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.అన్నారు
సిద్దిపేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట మున్సిపాలిటీ అటెండర్ బొమ్మల పృథ్వీరాజ్, తన స్నేహితుడు నవీన్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీరాజ్ అక్కడికక్కడే మృతి చెందగా, నవీన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ADB: ఎక్సైజ్ శాఖ పరిదిలో పలు కేసులలో పట్టుబడిన 15 ద్విచక్రవాహనాలు,1 ఆటోను వేలం పాట నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఎక్సైజ్ సీఐ విజేందర్ పేర్కొన్నారు. ఈ నెల 26న ఆదిలాబాద్ ఎక్సైజ్ ఆవరణలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిని హిమాశ్రి ఆధ్వర్యంలో వేలం పాట ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు ప్రభుత్వం నిర్దేశించిన ధరావత్ సొమ్మును చెల్లించి వేలం పాటలో పాల్గొనాలన్నారు.
NGKL: అచ్చంపేట నియోజకవర్గం పదర గ్రామంలో ఈ నెల 26న శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్ హాజరవనున్నారని చెప్పారు.
MBNR: కౌకుంట్ల మండలం పేరూరు గ్రామ రైల్వే స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచారిస్తుందని స్థానికులు నేడు ఓ ప్రకటనలో వెల్లడించారు. పులి సంచారిస్తుందని తెలిసిన గ్రామస్తులు ఆందోళనకు లోనయ్యారు. తమ పంట పొలాలకు వెళ్లాలంటే భయందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసులోవాలని స్థానికులు కోరారు.
JGL: జగిత్యాల మండలం ధరూర్ ఎస్సారెస్పీ కెనాల్లో దూకి నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన అనూష మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనూష కుటుంబం గత కొన్నేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారు. ఉదయం విజయవాడ నుంచి వచ్చిన కొందరితో డబ్బుల విషయంలో ఘర్షణ జరగడంతో, అవమాన భారంతో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
BHNG: విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీతానగరం గ్రామ ఉప సర్పంచ్ వరికుప్పల ఎల్లయ్య సూచించారు. మంగళవారం మునగాల మండలం సీతానగరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆయన సొంత ఖర్చుతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు.
HYD: బన్సీలాల్‌పేట్ డివిజన్ న్యూ బోయగూడలో సాయి మెడికల్ హాల్ ఎదుట ఉన్న ఓపెన్ చెత్త డంపింగ్ పాయింట్‌ను స్థానికులు, నాయకులు కలిసి ఇవాళ మూసివేశారు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య మెరుగుదల, ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. ఐత చిరంజీవి, సాయి సందీప్, సంజయ్, రవీందర్, గజానంద పాల్గొన్నారు.
PDPL: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన బీమా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని UBI మేనేజర్ శివ బాలు తెలిపారు. మంగళవారం నంది మేడారంలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో CFL కౌన్సిలర్స్ సుజాత, జ్యోతి పాల్గొన్నారు.