• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రీడలు

శిఖర్ ధావన్‌కు బిగ్ రిలీఫ్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు భారీ ఊరట లభించింది. భరణంగా ధావన్ ఇచ్చిన దాదాపు రూ. 5.72 కోట్ల తిరిగి ఇచ్చేయాలని ఆయన మాజీ భార్య ఆయేషా ముఖర్జీని కోర్టు ఆదేశించింది. ప్రాపర్టీ సెటిల్మెంట్ కింద ఆ మొత్తం చెల్లించాలని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అది భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

February 25, 2026 / 10:30 AM IST

టీమిండియా ఓటమి సంతోషమే: రవిశాస్త్రి

T20 WCలో సౌతాఫ్రికాపై భారత్ భారీ తేడాతో ఓటమిపాలవడంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురవడం సహజమని, ఇది జట్టుకు అలర్ట్ లాంటిదని అభిప్రాయపడ్డాడు. సెమీఫైనల్స్ వంటి కీలక స్టేజ్‌లో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నా అని అన్నాడు. ఈ ఓటమితో జట్టు తన గేమ్ ప్లానింగ్ చేసుకుని విజయం సాధించే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నాడు.

February 25, 2026 / 07:16 AM IST

T20 WC: నాలుగు* సెంచరీలు.. ఇదే తొలిసారి

ప్రస్తుత T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి టోర్నీలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆటగాళ్లు సెంచరీలతో రాణిస్తున్నారు. 2010, 2014, 2016 ఎడిషన్స్‌లో అత్యధికంగా రెండేసి సెంచరీలు నమోదు కాగా.. ప్రస్తుత టోర్నీలో ఇప్పటికే 4* నమోదయ్యాయి. ఇంకా 10 మ్యాచులు మిగిలి ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ లేకపోలేదు.

February 25, 2026 / 01:40 AM IST

T20 WC: పాక్ ఓటమి.. సెమీస్‌కు ఇంగ్లండ్

పాక్‌తో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత పాక్ 164 రన్స్ చేయగా.. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ కెప్టెన్ బ్రూక్ సెంచరీ(100)తో రాణించాడు. దీంతో ఇంగ్లీష్ టీమ్ 19.1 ఓవర్లలో విజయాన్ని కైవసం చేసుకోవడంతో పాటు సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అటు పాక్ అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

February 24, 2026 / 10:30 PM IST

ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. రింకూ సింగ్ ఇంటికి

టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ టీ20 ప్రపంచకప్ మధ్యలోనే ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా అతడు ఇంటికి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన టీమిండియా ట్రైనింగ్ సెషన్‌కు అతడు హాజరు కాలేదు. రింకూ తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడు వెంటనే వెళ్లాల్సి వచ్చిందని సమాచారం.

February 24, 2026 / 09:05 PM IST

టీమిండియాలో ఆ ప్లేయర్లపై వేటు..?

అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ స్థానంలో శాంసన్, వాషింగ్టన్ స్థానంలో అక్షర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, వన్ డౌన్‌లో సూర్య, ఆ తర్వాత స్థానంలో తిలక్ బ్యాటింగ్‌కు రావొచ్చు.

February 24, 2026 / 08:44 PM IST

చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. పాక్ స్కోర్ ఎంతంటే?

పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు విజృంభించారు. దీంతో పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్(3), ఓవర్టన్(2), ఆర్చర్(2) పాక్ పతనాన్ని శాసించారు. పాక్ బ్యాటర్లలో ఫర్హాన్(63) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. బాబర్(25), ఫఖర్(25) పర్వాలేదనిపించగా, మిగితా బ్యాటర్లంతా ఘెరంగా విఫలమయ్యారు. టార్గెట్: 165

February 24, 2026 / 08:39 PM IST

రన్‌రేట్ కంటే గెలుపే ముఖ్యం: అశ్విన్

టీమిండియాకు అశ్విన్ కీలక సూచనలు చేశాడు. భారత జట్టు ప్రస్తుతం నెట్ రన్‌రేట్‌ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. రాబోయే మ్యాచుల్లో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లపై విజయం సాధించడంపైనే పూర్తి దృష్టి పెట్టాలని సూచించాడు. అలాగే, బ్యాటర్లు కూడా పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తమ షాట్ల ఎంపికపై శ్రద్ధ వహించాలని అశ్విన్ సూచించాడు.

February 24, 2026 / 08:13 PM IST

PAK vs ENG: హెడ్ టు హెడ్ రికార్డు

T20 క్రికెట్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ రెండు జట్లు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 21 సార్లు గెలవగా, పాక్ కేవలం 9 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఇక T20 WCలో.. ఈ రెండు జట్లు 3 సార్లు తలపడగా, అన్ని సార్లు ఇంగ్లండే విజయం సాధించింది. అదేవిధంగా, ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 టీ20 మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లీష్ జట్టే గెలవడం గమనార్హం.

February 24, 2026 / 06:48 PM IST

PAK vs ENG: ప్లేయింగ్-11

ENG: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(c), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్PAK: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(c), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్(w), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్

February 24, 2026 / 06:38 PM IST

T20 WC:  ఇంగ్లండ్‌పై టాస్ గెలిచిన పాకిస్తాన్

సూపర్-8 భాగంగా పల్లెకెలె వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కావడంతో ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓడితే సెమీస్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు శ్రీలంకపై గెలిచిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది.

February 24, 2026 / 06:35 PM IST

రంజీ ఫైనల్: తొలి రోజే జమ్మూకశ్మీర్ భారీ స్కోరు

కర్ణాటక, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 284/2 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాటర్ ఇక్బాల్(6) త్వరగానే అవుటైనప్పటికీ.. మరో ఓపెనర్ హసన్(88) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్ డౌన్ బ్యాటర్ శుభం పుండిర్(117) సెంచరీతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో డోగ్రా(9), అబ్దుల్ సమద్ (52) ఉన్నారు.

February 24, 2026 / 06:08 PM IST

భారత జట్టులో ‘కోల్డ్ వార్’ నడుస్తోందా..?

పాకిస్తాన్ మాజీ ఆటగాడు అహ్మద్ షెహజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని అతడు ఆరోపించాడు. ఆ కారణంతోనే కుల్దీప్‌ను సూర్య జట్టు నుంచి తొలగించినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వారి మధ్య ఉన్న విభేదాలు మైదానంలో బహిరంగంగానే బయటపడ్డాయని షెహజాద్ వ్యాఖ్యానించాడు.

February 24, 2026 / 05:37 PM IST

BREAKING: టీమిండియా కెప్టెన్‌కు గాయం

భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయపడింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు మోకాలి నొప్పి మళ్ళీ తిరగబెట్టింది. దీంతో హర్మన్ ఫీల్డింగ్‌కు రాలేదు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆమెను వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపింది. అయితే, 36 ఏళ్ల హర్మన్ గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతోంది.

February 24, 2026 / 04:22 PM IST

టీమిండియా ‘150 లోడింగ్’ మీమ్స్.. వైరల్

WCలో టీమిండియా పేలవ ప్రదర్శనపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందు ‘300 రన్స్ లోడింగ్’ అంటూ భారీ అంచనాలు పెట్టుకున్న నెటిజన్లు.. ఇప్పుడు జట్టు తీరుపై సెటైర్లు వేస్తున్నారు. SAతో భారత్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ‘150 లోడింగ్’ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. భారత ఆటతీరుపై నెటిజన్లు ఈ విధంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

February 24, 2026 / 04:03 PM IST