T20 క్రికెట్‌లో భారత్, జింబాబ్వే జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 10 విజయాలతో జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. జింబాబ్వే కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు జరిగే మ్యాచ్‌లోనూ భారత్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే, సంచలన ప్రదర్శనతో S-8కు చేరుకున్న జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 176/8 పరుగులు చేసింది. 10.2 ఓవర్లలో కేవలం 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ విండీస్ జట్టును.. హోల్డర్(49), షెపర్డ్(52*) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్‌కు కేవలం 57 బంతుల్లోనే 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబడ, బాష్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. టార్గెట్: 177.
రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ బాదాడు. స్టార్ ప్లేయర్లు రాహుల్(13), పడిక్కల్(11), కరుణ్ నాయర్(0) విఫలమైనప్పటికీ అగర్వాల్ 110 పరుగులతో ఒంటరీ పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు రంజీల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్(584) తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కర్నాటక(174/5) మరో 410 పరుగులు వెనుకబడి ఉంది.
జింబాబ్వేతో ఇవాళ జరగబోయే కీలక మ్యాచ్‌లో భారత్ జట్టులో మూడు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిలక్ వర్మ స్థానంలో సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. తుది జట్టు అంచనా: అభిషేక, శాంసన్, ఇషాన్, సూర్య, దూబే, పాండ్యా, అక్షర్, కుల్దీప్, చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వెస్టిండీస్ 8.2 ఓవర్లలో కేవలం 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రబడ 2, లుంగి ఎన్గిడి 3 పడగొట్టారు. ప్రస్తుతం హోలర్డ్(9), ఫోర్డ్(1) క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్ల ప్రదర్శనతో భారత అభిమానుల్లో సెమీస్ ఆశలు చిగురిస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. రంజీ ఫైనల్లో నిన్న కర్ణాటక ఫీల్డర్ అనీశ్‌ను పారస్ హెల్మెట్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనపై తాజాగా మ్యాచ్ రిఫరీ నారయణ్ స్పందిస్తూ.. JK సారథి డోగ్రాకు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు తెలిపాడు. కాగా, ఈ మ్యచ్‌లో JK తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో ఉగాండా మాజీ హెడ్ కోచ్ అభయ్ శర్మను LSG నియమించుకుంది. అభయ్ శర్మ 2018లో భారత అండర్-19 జట్టుతో కలిసి పనిచేశాడు. భారత్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 89 మ్యాచ్‌లు ఆడి 4105 పరుగులు చేశాడు.
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించదని అభిప్రాయపడ్డాడు. గ్రూప్-1 నుంచి వెస్టిండీస్, సౌతాఫ్రికా సెమీస్ చేరుకుంటాయని జోస్యం చెప్పాడు. అమీర్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు T20Iల్లో 29 సార్లు తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 15 సార్లు, సౌతాఫ్రికా 14 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లు తలపడ్డ గత చివరి 10 T20Iల్లో వెస్టిండీస్ 7 విజయాలతో సౌతాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం సాధించింది. అయితే, T20 ప్రపంచకప్‌లో విండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా 4 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది.
అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుతోంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ సెమీస్ ఆశలు సౌతాఫ్రికా విజయంపై ఆధారపడి ఉన్నాయి. సౌతాఫ్రికా ఓడితే భారత్ తన చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా సెమీస్ చేరుకోవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే సఫారీలను ఓడించడం జింబాబ్వేకు అంత సులభం కాదు.
కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసింది. 527/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 584 పరుగులకు ఆలౌటైంది. శుభమ్(121) సెంచరీ చేయగా.. హసన్ (88), డోగ్రా (70), సమద్ (61), కన్హయ్య (70), సాహిల్ (72) అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ టీమిండియా, జింబాబ్వే తలపడనున్నాయి. అయితే సూపర్-8లో టీమిండియాకు వెస్టిండీస్‌తో కన్నా.. జింబాబ్వేతోనే ఎక్కువ ముప్పు ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. కాగా సూపర్ -8లో సౌతాఫ్రికాతో భారత్ తలపడగా ఓడిపోయింది. దీంతో వెస్టిండీస్, జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి టీమిండియాది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తెలిపాడు. హిందీ డబ్బింగ్‌లోనూ తాను తెలుగు సినిమాలు చూస్తానని, ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలను అస్సలు మిస్ అవ్వనని పేర్కొన్నాడు. సూపర్ స్టార్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనలోని గ్రేస్ తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు.
క్రికెట్ ప్రేమికులకు మెట్రో రైలు సంస్థ తీపి కబురు చెప్పింది. టీ20 ప్రపంచకప్ -2026లో భాగంగా ఇవాళ భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లు ఉన్నవారు ఒకసారి ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. కాగా ఈ మ్యాచ్ చెన్నై చేపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.