• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎంపీ

NTR: ఏ. కొండూరు మండలానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) నుంచి వైద్య సహాయం అందింది. పెద్ద తండాకు చెందిన లోకేష్‌కు రూ. 1.77 లక్షలు, ఉపేంద్రకు రూ. 2.13 లక్షలు, అలాగే చీమలపాడుకు చెందిన బండి శ్రీలక్ష్మికి రూ. 6 లక్షల విలువైన ఎల్డీసీ (LOC) పత్రాలను ఎంపీ అందజేశారు. ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలవడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

March 6, 2026 / 12:22 PM IST

‘వైసీపీని ఎదుర్కోవాలంటే మనం ఐక్యంగా ఉండాలి’

AP: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 11 వందల మంది ఉన్నట్లు మాట్లాడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘వైసీపీని ఎదుర్కోవాలంటే మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లే కల్తీలు చేసి.. మళ్లీ మనపై నిందలు వేస్తారు. వైసీపీ వాళ్లే బూతులు తిడతారు.. మళ్లీ మనపైనే నిందలు వేస్తారు’ అని పవన్ విమర్శించారు.

March 6, 2026 / 12:21 PM IST

విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి

SRCL: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి సారించగలుగుతారని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్య శిబిరం ప్రారంభించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

March 6, 2026 / 12:20 PM IST

ప్రత్యేక అలంకారంలో విరుపాక్షి మారెమ్మ దర్శనం

CTR: పుంగనూరు శ్రీవిరుపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి పసుపు, కుంకుమ, సింధూరం, గంధం, వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

March 6, 2026 / 12:20 PM IST

‘వీపీఆర్ నేత్ర వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి’

NLR: పేద ప్రజలకు వీపీఆర్ నేత్ర వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు పొలినేని చంద్రబాబు నాయుడు తెలిపారు. చింతలదేవిలోని తూర్పు బ్రాహ్మణపల్లిలో వైద్య సేవలను పరిశీలించి మాట్లడారు. ఇప్పటి వరకు 2,141 మందికి కంటి పరీక్షలు చేశారని, 1034 మందికి అద్దాలు ఇచ్చామన్నారు. కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వీపీఆర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 6, 2026 / 12:20 PM IST

చెట్టుకు ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

BDK: ఆళ్లపల్లి మండలంలోని తిర్లాపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కరకగూడెం మండలం రేగళ్లకు చెందిన ఎం.భద్రయ్య, బీమయ్య ఆళ్లపల్లిలోని ముత్తాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక కూర్చున్న భద్రయ్య అక్కడికక్కడే మృతి చెందగా. బీమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

March 6, 2026 / 12:20 PM IST

ఆర్డీటీ కోసం లక్ష పోస్ట్‌ కార్డుల ఉద్యమం: తలారి రంగయ్య

ATP: ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం వెంటనే FCRA పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ‘లక్ష పోస్ట్‌కార్డుల ఉద్యమం’ చేపడుతున్నట్లు మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గంలో ఉద్యమ కార్డులను ఆయన ఆవిష్కరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దశాబ్దాలుగా కృషి చేస్తున్న ఆర్డీటీకి నిధుల అడ్డంకులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

March 6, 2026 / 12:20 PM IST

విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలి: MEO

MLG: విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలని MEO మల్లయ్య, సర్పంచ్ సరిత అన్నారు. రామన్నగూడెం ZPHS పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ పరీక్ష సామాగ్రిని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చదువు మన తలరాతను మారుస్తుందని, పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు.

March 6, 2026 / 12:18 PM IST

నూతన గృహప్రవేశంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం

WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమం శుక్రవారం జరిగింది. పెద్ది ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంకు మాజీ ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజయ్య పెద్దికి శుభాకాంక్షలు తెలిపి, కాసేపు ముచ్చటించారు. BRS రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కార్యకర్తలు ఉన్నారు.

March 6, 2026 / 12:18 PM IST

91 మంది విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ

BPT: అద్దంకి మండలం ధేనువుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 91 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. విద్యార్థులు చదువులో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

March 6, 2026 / 12:16 PM IST

టమాటా ధర లేక గిరిజన రైతుల నిరాశ

ASR: డుంబ్రిగూడ మండలంలోని అరకులో ఇవాళ జరిగిన వారపు సంతకు రైతులు పెద్ద మొత్తంలో టమాటా నిల్వలు తీసుకొచ్చారు. అయితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పంటకు ఖర్చులు కూడా రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు తీసుకొచ్చిన టమాటాలను తిరిగి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.

March 6, 2026 / 12:15 PM IST

పట్టుబడుతున్న జీవీఎంసీ కార్పొరేటర్‌లు

విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్‌లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని కోరుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనుండటంతో కనీసం ఒకసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్‌ను కోరారు. ఐదేళ్లలో నాలుగేళ్లు మాత్రమే యాత్రలు జరిగాయని, ఈనెల 10 నుంచి 14 వరకు టూర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

March 6, 2026 / 12:14 PM IST

నేత్రపర్వంగా సింహాద్రి అప్పన్న నిత్య కళ్యాణం

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి నిత్య కళ్యాణం ఇవాళ అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శ్రీకారం చుట్టారు. జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ ప్రక్రియలను కమనీయంగా నిర్వహించారు.

March 6, 2026 / 12:14 PM IST

బేగంపేట IMD ఆఫీస్‌కు బాంబు బెదిరింపు

TG: HYDలోని బేగంపేట వాతావరణ శాఖ(IMD) కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఆఫీస్ ఆవరణలో 14 RDX బాంబులను అమర్చినట్లు ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తక్షణమే అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం ఐఎండీ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది.

March 6, 2026 / 12:14 PM IST

క్రీడా పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

NGKL: జిల్లాలోని స్పోర్ట్స్ క్రీడా పాఠశాలలోని 5 తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీటీడీవో ఫిరంగి తెలిపారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పాఠశాల నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో 5 తరగతిలో చేరేందుకు ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఈనెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 6, 2026 / 12:12 PM IST