ATP: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాక్షస ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వెంకటేశ్వరుని వేడుకున్నానని తెలిపారు.
MBNR: దేవరకద్ర పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన ఉస్కిల లక్ష్మమ్మ కుమారుడు వంశీ మెడిసిన్‌లో సీటు సాధించి ప్రతిభ చాటుకున్నాడు. ఈ సందర్భంగా అతని ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పాటుగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కష్టపడి చదివడం సంతోషమన్నారు.
W.G: శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానించారని మండిపడ్డారు.
NGKL: బిజినేపల్లి మండలం మంగనూరులో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రం స్వామివారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బండ్లు, బోనాల సమర్పణ చేయనున్నారు. గ్రామం నుంచి బయలుదేరే ఈ బండ్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
SRPT: కోదాడ నుంచి వాయిల సింగారం వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా పెరిగిన కంప చెట్లు వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలు రహదారి పక్కకు తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే అధికారులు చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరి మాత శనివారం విశేష పుష్పలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చన, రుద్రాభిషేకం నిర్వహించారు. యాగంటి ఉమామహేశ్వరస్వామి అమ్మవార్లకు కూడా ఆలయ ఈఓ డి.పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో గణపతి పూజ, జలపాల పంచామృత అభిషేకాలు నిర్వహించారు.
ELR: భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఆన్ లైన్ పెట్టుబడులు, లాభాలు అనే రెండు బూటకపు మాటలను తిప్పి కొట్టాలని ఎస్సై మదీనా భాష సూచించారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. క్రిప్టో కరెన్సీ అనే కుంభకోణంలో ఎంతో మంది కుదేలయ్యారన్నారు. అమాయకులే టార్గెట్గా సైబర్ మోసాలు జరుగుతాయని, మోసానికి గురైతే నం.1930 ఫోన్ చేయాలన్నారు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయొద్దన్నారు.
RR: MLA వీర్లపల్లి శంకర్ వెటర్నరీ డిపార్ట్‌మెంట్ వారిని పిలిచి డిప్యూటేషన్‌పై వెళ్లిన అధికారిని మళ్లీ రప్పించడం కోసం అధికారులతో మాట్లాడటం హర్షించదగ్గ విషయమని RR జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి శివారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల లో వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌కు నిధులు వచ్చేట్టు అధికారులతో నిధులు విడుదల చేయించాలన్నారు.
VSP: GVMC పరిధిలో సర్వేయర్లపై దోపిడీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ భూముల వివరాలు, సర్వే సర్టిఫికెట్లు, వీఎల్టీ, ప్లాన్ మంజూరులు వంటి పనుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. పనిని బట్టి రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
NLG: చండూరు మండల ప్రజల కోసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం (రేపు) మునుగోడు క్యాంపు కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఆపరేషన్లు అవసరమైన వారికి హైదరాబాద్‌లో ఉచితంగా చేయిస్తామని వెల్లడించారు.
‘ధురంధర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో దాని సీక్వెల్‌పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘ధురంధర్ 2’ ట్రైలర్ అప్‌డేట్ వచ్చింది. 2026 మార్చి 5న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీనికోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.
BDK: మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్‌లో నిర్మితమవుతున్న దశావతార శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమానకి హాజరు కావాలని ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కోరారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలో వేంచేసి ఉన్న పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. పాల్గుణ మాసం శుద్ధ చవితి కావడంతో స్వామి వారు ప్రత్యేక పుష్పాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాద ఏర్పాట్లు చేశారు.
PPM: అగ్రిగోల్డ్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని AITUC జిల్లా కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం పార్వతీపురంలోని స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న పార్వతీపురంలో అగ్రిగోల్డ్ బాధితుల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు హాజరవుతారని పేర్కొన్నారు.
NRPT: ధన్వాడ మండలం యంనోనిపల్లి గ్రామంలో పాత విద్యుత్ లైన్లను తొలగించి కొత్త లైన్ల పునర్నిర్మాణం ప్రారంభించారు. సుమారు రూ.3.50 లక్షల వ్యయంతో 25 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సహకారం, సర్పంచ్ బోయ నాగేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరహరి పర్యవేక్షణలో ఈ అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు స్థానికులు తెలిపారు.