GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. గురువారం రాత్రి శ్రీనివాసరావుపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె 36 మంది లబ్ధిదారులకు రూ. 39,96,998 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.నియోజకవర్గంలో ఇప్పటివరకు 464 మందికి రూ. 6 కోట్ల పైచిలుకు ఆర్ధిక సాయం అందించామన్నారు.
NLG: కట్టంగూరు మండలంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నేడు ఏకాదశ మహా యజ్ఞం వైభవంగా జరగనుంది. తృతీయ ఏకాదశి వార్షికోత్సవం పురస్కరించుకుని ఈరోజు ఉదయం 9 గంటలకు యాగ క్రతువును ప్రారంభించనున్నట్లు పూజారి శ్రీనివాస్ శర్మ తెలిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ADBV: రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్ ఆదివాసీల అభివృద్ధికి సేవలందిస్తున్నారు. 500 మంది పదో తరగతి విద్యార్థులకు ఉచిత పరీక్ష సామగ్రి, 8 మహిళా క్రీడాకారిణులకు ట్రాక్‌సూట్లు పంపిణీ చేశారు. చించుఘాట్ ఆశ్రమ పాఠశాల ఆర్చరీ క్రీడాకారిణులు సిడాం రామకళ, పెందూర్ రూపకు రూ.20 వేల కిట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చేతుల మీదుగా అందజేశారు.
CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపనగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దక్షిణ భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని ఫల పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, కుంకుమ, వెండి కిరీటంతో పాటు వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు దర్శించుకున్నారు.
ASF: కాగజ్‌నగర్ పట్టణంలో లారీ, ట్రక్ డ్రైవర్లకు శుక్రవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు CI ప్రేమ్ కుమార్ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని SPM హెచ్‌ఆర్‌డీ భవనంలో ఉదయం 10 గంటలకు లారీ, ట్రక్ డ్రైవర్లు, క్లీనర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించబడుతుందన్నారు. ముఖ్య అతిథిగా SP నితిక పంత్ హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించనున్నారు.
ADB: జిల్లా పోలీసు కార్యాలయంలో ఉట్నూర్ సబ్ డివిజన్ నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ 2.0, సైబర్ నేరాలపై విద్యార్థులకు ఖాకీ కిడ్స్ ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చాలని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు.
KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో పీహెచ్‌డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు మార్చి 6వ, 7వ తేదీల్లో ఉదయం 10:30 నుంచి విభాగాధిపతి కార్యాలయంలో నిర్వహిస్తామని శాతవాహన విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు డా. మహమ్మద్ జాఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌లో చూడాల్సిందిగా కోరారు.
కోనసీమ: జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా గురువారం బోడసకుర్రు BRK కన్వెన్షన్‌లో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతల సమావేశం జరిగింది. రాజానగరం MLA బలరామకృష్ణ, రాజోలు MLA దేవ వరప్రసాద్, కొత్తపేట ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
సత్యసాయి: బీడుపల్లిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన ‘జనగణన-2027’ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు గురువారంతో ముగిశాయి. ముగింపు సభలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి జనగణనలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన గణాంకాలు సేకరించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.సెమినార్ ఏర్పాట్లలో భాగంగా కళాశాల ప్రవేశ ద్వారం వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టితో చదును చేసి సుందరీకరణ పనులు చేపట్టామన్నారు.
ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి అసెంబ్లీలో CM చంద్రబాబు నాయుడును కలిశారు. నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మిడ్ పెన్నారు దక్షిణ కాలువ ఆధునికీకరణ, నిలిచిపోయిన బైపాస్ కాలువ పనులను త్వరగా ప్రారంభించాలని కోరారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
KKD: బోద్దవరం గ్రామానికి చెందిన అదారి జయశ్రీ వెంకట సత్య సాయి రేణుక (21) అదృశ్యంపై కేసు నమోదైనట్లు SI రామకృష్ణ గురువారం తెలిపారు. మార్చి 7న వివాహం జరగాల్సి ఉండగా.. ఐదు తులాలు బంగారం, వెండి, రూ. 50 వేల నగదుతో ఆమె కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విశాఖలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రేణుక ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందుతున్నారు.
E.G: నిడదవోలు మండలం కంసాలిపాలెంలో శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామని BJP జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు. గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంసాలిపాలెంలో శ్మశాన వాటిక సమస్యను ఎంపీ పురందీశ్వరి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
AP: అన్నమయ్య, శ్రీసత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 37 మండలాల్లో ఉపాధిహామీ పథకం కింద 50 రోజుల అదనపు పనిదినాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ పేదల సంక్షేమం కోసం ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. కాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా 2025 ఖరీఫ్‌లో రాష్ట్రప్రభుత్వం ఈ జిల్లాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది.
KDP: ఇటీవల నిర్వహించిన నాసా (ఎన్ఎస్‌వో) పరీక్షలో పులివెందుల విద్యార్థిని మెహరీన్ అంజు ప్రతిభను చాటుకుంది. రెండో తరగతి చదువుతున్న ఆమె రాష్ట్ర స్థాయిలో 98వ ర్యాంకు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఇంతటి ప్రతిభ కనబరిచిన మెహరీన్ అంజు విజయానికి ఆమె కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకం కీలకంగా మారాయి.