KNR: గర్జనపల్లి గ్రామానికి చెందిన నగరపు ఆశ్రిత జాతీయ స్థాయికి ఎంపికైంది. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న వాలీబాల్ సబ్ జూనియర్ సెలక్షన్లో సెలక్ట్ అయింది. ఈ సందర్భంగా డీవైఎస్‌వో రాందాస్ ఆశ్రితను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
నంద్యాల శక్తి టీం శనివారం పొన్నపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 122 నంబర్, శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. అపరిచితుల వద్ద తినుబండారాలు తీసుకోవద్దని, అసభ్య ప్రవర్తన ఎదురైతే తల్లిదండ్రులు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ పాల్గొన్నారు.
ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ ఈ.వి. రమణబాబు, అర్బన్ సీఐ సురేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
PPM: పార్వతీపురం మండలంలో గిరిజన ప్రాంతాలకు రోడ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు ఆ ప్రాంత గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన గిరిజన నాయకులు, ఆయనను శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఎమ్మెల్యే చొరవతో రోడ్డుకల సహకారం అయింది అన్నారు.
ప్రకాశం: కంభంలో శుక్రవారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. తురిమెళ్ల గ్రామానికి చెందిన ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రూ. 20 వేలు లంచం తీసుకుటుండగా వ్యవసాయ అధికారి మహమ్మద్‌ను పట్టుకున్నారు. అతని ఇంట్లో శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను నెల్లూరు కోర్టుకు తరలించారు.
MDK: టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట ప్రధాన రహదారిపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. పశువుల గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కర్రల సహాయంతో గడ్డిని లారీ నుంచి బయటకు తోసివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
JN: బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్ అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో MLA డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆయనకు రూ.2లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కు మంజూరు చేయించారు. ఈ చెక్కును రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి శనివారం లబ్ధిదారు కుటుంబానికి అందించారు.
HNK: మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. TGOS (మహిళా విభాగం) ఆధ్వర్యంలో క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ సేవల్లో మహిళా గెజిటెడ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, మహిళా సాధికారత, పరిపాలనలో నాయకత్వం, సమాజాభివృద్ధి దిశగా వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
భోజనం చేసిన వెంటనే మనం చేసే కొన్ని తప్పులు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. తిన్న వెంటనే స్నానం చేస్తే రక్తప్రసరణ మారి అజీర్తి కలుగుతుంది. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. టీ, కాఫీలు తాగితే పోషకాలు అందవు. అతిగా నీళ్లు తాగడం వల్ల జీర్ణరసాలు పలచబడతాయి. పండ్లు తింటే కడుపు ఉబ్బరం కలుగుతుంది. ధూమపానం చేస్తే తీవ్ర అనారోగ్యం కలుగుతాయి.
E.G: రుడా ఛైర్మన్, తూ.గో జిల్లా TDP అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి సమక్షంలో సీతానగరం మండలం వంగలపూడికి చెందిన పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కాండ్రేగుల ఫణిబాబు శనివారం YCPకి రాజీనామా చేసి TDPలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు వెంకటరమణ చౌదరి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఫణిబాబు చేరికతో వంగలపూడిలో TDP మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
WNP: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు శనివారం DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల హాల్ టికెట్లను కళాశాలల లాగిన్లలో అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
KMR: జిల్లాలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి రానున్నారు. సాయంత్రం మూడు గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే రమణారెడ్డితో భేటీ కానున్నట్లు సమాచారం. ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను తెలుసుకోనున్నారు.
WGL: నల్లబెల్లి మండలం కొండలైయిపల్లె గ్రామంలో మిరప కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. మిరప పంట కోత తర్వాత సరైన విధానంలో ఎండబెట్టడం, తేమ లేకుండా నిల్వ చేయడం ఎంతో ముఖ్యమని రైతులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన వైస్ ఛైర్మన్ బొంతు సుమలత, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, బండారు శరత్ చంద్ర శనివారం TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తమ గెలుపుకు కృషి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. అనంతరం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన వైస్ ఛైర్మన్, కౌన్సిలర్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
E.G: విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. DRDA – సెర్ప్ శాఖ అమలు చేస్తున్న పథకాలు అమలుపై శనివారం రాజానగరంలో ఆయన సమీక్షి నిర్వహించారు. ఫీల్డ్ సిబ్బంది పై తరచూ పిర్యాదులు వస్తున్నాయని అలా రాకుండా చూసుకోవాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు.