• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు: ఎమ్మెల్యే

SKLM: పలాస మున్సిపాలిటిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

February 28, 2026 / 07:30 AM IST

యువకుడిపై గొడ్డలితో దాడి.. కేసు నమోదు

MNCL: వేమనపల్లి శివారులోని చేనులో మేకలు మేపుతున్న రాజన్న, తుమ్మిడి సాయికిరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజన్న, సాయికిరణ్ కాలు మడమపై గొడ్డలితో  దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. నీల్వాయి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 28, 2026 / 07:29 AM IST

పాలకేంద్రాల్లో అధికారుల తనిఖీలు

W.G: భీమవరంలో పలు పాల కేంద్రాలపై శుక్రవారం ఆహార భద్రత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాస్ సెంటర్, డీఎన్ఆర్ కళాశాల రోడ్డులోని కేంద్రాల్లో నిల్వ ఉన్న పాలను పరిశీలించి, నమూనాలను సేకరించారు. ఆహార భద్రతాధికారి సుందరరామిరెడ్డి మాట్లాడుతూ.. సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.

February 28, 2026 / 07:29 AM IST

ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: కలెక్టర్

MDK: రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

February 28, 2026 / 07:28 AM IST

పోలీసుల మెరుపు తనిఖీలు.. 76 వాహనాలు సీజ్..!

GDWL: గద్వాల ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి అయిజ పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో 50 మంది సిబ్బందితో డీఎస్పీ వై. మొగిలయ్య భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 76 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించిన డీఎస్పీ, కాలనీల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

February 28, 2026 / 07:28 AM IST

అందాన్ని డబుల్ చేస్తామని.. మోసం..!

MDCL: అందాన్ని డబులు చేస్తామని ఉప్పల్ పరిధి గణేష్ నగర్ కాలనీకి చెందిన రమ్యకు మెసేజ్ వచ్చింది. నమ్మిన రమ్య కాల్ చేసి అడగగా డైరెక్ట్ ఆన్ లైన్ ద్వారా రూ.4,500 పేమెంట్ చేస్తే, వెంటనే ఇంటికి వస్తామని పేర్కొన్నారు. పేమెంట్ చేసి దాదాపు 15 రోజులు గడుస్తున్నప్పటికీ స్పందన లేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని రమ్య వాపోయారు.

February 28, 2026 / 07:28 AM IST

వీరాసనం వల్ల కలిగే ఉపయోగాలు

వీరాసనం మోకాళ్లు చీలమండలు, తొడలను బలోపేతం చేస్తూ జీర్ణక్రియను మెరుగుపరిచి వెన్నుముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణ అవయవాలకు రక్తప్రసరణను పెంచి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నడుము దిగువ భాగంలో నొప్పిని తగ్గిస్తుంది. ఇది ధ్యానానికి అనుకూలమైన భంగిమ కాబట్టి ఏకాగ్రతను పెంచి ఆందోళనను తగ్గిస్తుంది. దిగువ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

February 28, 2026 / 07:25 AM IST

నేడు రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

BPT: రేపల్లె మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్‌లో జరగనుంది. ఛైర్మన్ కట్ట మంగ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ భేటీలో తాగునీరు, శానిటేషన్, అభివృద్ధి పనులతో సహా మొత్తం 14 అంశాలపై చర్చించనున్నట్లు కమిషనర్ సాంబశివరావు తెలిపారు. ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొనాలని తెలిపారు.

February 28, 2026 / 07:24 AM IST

ఉత్తమ ఫలితాల్లో జిల్లాను ముందు ఉంచాలి: కలెక్టర్

BHPL: జిల్లా ఐడిఓసీ కార్యాలయంలో 10వ తరగతి ఉత్తమ ఫలితాల సాధన పై విద్యాశాఖ ఆధ్వర్యంలో అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, DEO రాజేందర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను ఉత్తమ ఫలితాల్లో ముందంజలో నిలిపేందుకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

February 28, 2026 / 07:22 AM IST

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దందాకు చెక్!

TG: రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు ఎట్టకేలకు సర్కారు సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ.. శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11వేల ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత ఆదాయ, వ్యయాలను సేకరించాలని నిర్ణయించారు.

February 28, 2026 / 07:22 AM IST

ఎంఈవోగా శాంసన్ బాధ్యతలు స్వీకరణ

E.G: కొవ్వూరు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో-1)గా ఉందుర్తి శాంసన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఎండీ ఇమ్రాన్ భాషా, కె. శ్రీనివాసన్, పీవీ రవికుమార్, డి. మహేష్ తదితరులు ఆయనను కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన ఎంఈవోకు శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

February 28, 2026 / 07:20 AM IST

‘ఉద్యమి’ సభ్యత్వ కార్యక్రమంలో మంత్రి

GNTR: తెనాలి 36వ వార్డులో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త ఒక ఉద్యమంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒకరు సభ్యత్వం తీసుకుని రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

February 28, 2026 / 07:20 AM IST

ఆయిల్ ఫామ్ సాగుపై కలెక్టర్ సమీక్ష

SDPT: ఆయిల్ ఫామ్ సాగుపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యానశాఖ, ఆయిల్ ఫామ్ అధికారులతో కలెక్టర్ హైమావతి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫ్రైడ్ అధికారుల పనితీరు మందకోడిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

February 28, 2026 / 07:19 AM IST

పింఛన్లను పంపిణీ చేయనున్న చంద్రబాబు

AP: విజయనగరం జిల్లాలో ఇవాళ CM చంద్రబాబు పర్యటించనున్నారు. రావివలస గ్రామంలో NTR భరోసా పింఛన్లను సీఎం పంపిణీ చేయనున్నారు. రావివలసలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బాలికలతో మాట్లాడనున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం TDP కార్యకర్తలతో సమావేశం కానున్నారు. రాత్రికి అమరావతికి చేరుకోనున్నారు.

February 28, 2026 / 07:18 AM IST

TTD బడ్జెట్ రూ.5,400 కోట్లు.. !

తిరుమల అన్నమయ్య భవన్‌లో నేడు TTD బోర్డు మీటింగ్ జరగనుంది. వార్షిక బడ్జెట్ రూ.5,400 కోట్లు ప్రతిపాదనపై చర్చ జరగనుంది. విద్యా ప్రమాణాలు పెంపు, వకుళామాత ఆలయంలో అక్షరాభ్యాసం, భద్రతా సిబ్బంది నియామకం, లగేజీ తనిఖీ కోసం ఎక్స్ రే బ్యాగేజీ, 51 మంది అర్చకుల ప్రమోషన్ తదితర 87 అంశాలతో మీటింగ్ జరగనుంది. వీటిపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

February 28, 2026 / 07:17 AM IST