• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విశాఖ, చర్లపల్లి నుంచి కొత్త రైళ్లు

VSP: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రకటించింది. రైలు నం.18501/02 (విశాఖ-కొల్లం) వారాంతపు ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం కొల్లం చేరుకుంటుంది. రైలు నం.17065/66 (చర్లపల్లి-షాలిమార్) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం చర్లపల్లిలో బయలుదేరి బుధవారం షాలిమార్ చేరుకుంటుంది.

February 28, 2026 / 10:00 PM IST

స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల నియోజకవర్గం,గుడివాడలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంను ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన విన్నపాలకు తక్షణ స్పందనతో అర్హులైన వారికి స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయించారు. మాట తప్పని ప్రభుత్వం, ప్రజలకు ఎప్పుడూ అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందన్నారు.

February 28, 2026 / 10:00 PM IST

డయేరియా కట్టడికి ప్రత్యేక అధికారులు నియామకం

SKLM: నగరంలో డయేరియా ను పూర్తిగా అరికట్టేందుకు అన్ని వార్డు సచివాలయా లకు వివిధ శాఖల ‘ప్రత్యేక అధికారులు’గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే తమకు కేటాయించిన వార్డుల్లో రిపోర్ట్ చేయాలని, క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

February 28, 2026 / 10:00 PM IST

వరి పంట పొలాలలో ఏనుగుల గుంపు

PPM: కురుపాం మండలం కిచ్చాడ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శనివారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. వరి పంట పొలాలలో పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

February 28, 2026 / 10:00 PM IST

మార్చి 4న ఉద్యోగ మేళా

KRNL: తిరుపతిలోని ఎపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మార్చి 4న ఉద్యోగ మేళా నిర్వహించబడుతుందని కర్నూలు ఎపీఎస్ డీసీ అధ్యక్షుడు శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ మేళాలో 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కోసం ముఖాముఖి ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని ఆయన పేర్కొన్నారు.

February 28, 2026 / 10:00 PM IST

పేలుడు ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది: అమిత్ షా

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

February 28, 2026 / 09:55 PM IST

‘పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి శుభాలు కలగాలి’

కడప నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష పాల్గొన్నారు.  రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా కడప నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు 30 రోజులపాటు నిష్టతో ఉపవాసం పాటిస్తూ అల్లా మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 09:50 PM IST

పాక్ గెలిస్తే లంకలో.. ఓడితే భారత్‌లో సెమీస్

2026 T20 WCలో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించకపోతే.. రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు భారత్‌లోనే జరుగుతాయి. తొలి సెమీస్ మార్చి 4న ఈడెన్ గార్డెన్స్, రెండో సెమీస్ మార్చి 5న వాంఖడే స్టేడియంలో జరుగుతాయి. మార్చి 8న జరిగే ఫైనల్‌కు మోదీ స్టేడియం వేదిక కానుంది. ఒకవేళ పాక్ సెమీస్, ఫైనల్ చేరితే.. తొలి సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.

February 28, 2026 / 09:48 PM IST

మంత్రి దామోదర రాజనర్సింహాను కలిసిన కలెక్టర్

VKB: ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను కలెక్టర్ దీపక్ తివారి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అనంతగిరి కొండల్లోని హరిత రిసార్ట్‌‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశంకి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిశారు. జిల్లా అభివృద్ధిలో తోడ్పడాలని మంత్రి సూచించారు.

February 28, 2026 / 09:38 PM IST

సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్

TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 8 సైబర్ మోసాల కేసుల్లో 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. 117 కేసుల్లో బాధితులకు 564 రిఫండ్ ఆర్డర్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రూ.1.62 కోట్లకు పైగా రిఫండ్ ప్రక్రియ కొనసాగింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుణెలో కీలక నిందితుడు అర్జున్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

February 28, 2026 / 09:32 PM IST

మార్చి 3న సింహాచలంలో డోలోత్సవం

VSP: ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా మార్చి 3న శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో డోలోత్సవం, వసంతోత్సవం, గ్రామ తిరువీధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం స్వామివారు కొండదిగువ పుష్కరిణి ఉద్యానవన మండపానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది.

February 28, 2026 / 09:31 PM IST

ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి: CM

AP: ఉపాధి కోసమే చాలామంది క్రాకర్స్ ఫ్యాక్టరీలకు వెళ్తున్నారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ నిర్వాహకులు ఎక్కడున్నా పట్టుకొస్తామని, ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 28, 2026 / 09:30 PM IST

గ్రామ కమిటీలతో పార్టీ బలోపేతం చేయాలి: మాజీ ఎమ్మెల్యే

SKLM: పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తన కార్యాలయంలో క్యాంప్ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ కమిటీలు చురుకుగా పనిచేస్తూ గ్రామస్థాయిలో వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేస్తూ ప్రజలకు నిజ పరిస్థితులను తెలియజేయాలన్నారు.

February 28, 2026 / 09:30 PM IST

గొంగివారిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

గొంగివారిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. దివ్యాంగుల లబ్ధిదారుడు రమేష్‌కు ఇంటి వద్దే పింఛన్ అందజేశారు. బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సరఫరాపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గ్రామంలో ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు.

February 28, 2026 / 09:25 PM IST

జమ్మూకశ్మీర్‌ జట్టుకు భారీ న‌జ‌రానా

67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయంపై ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేస్తూ.. జట్టు ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించారు. జట్టు మొత్తానికి రూ. 2 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

February 28, 2026 / 09:16 PM IST