KNR: శంకరపట్నం మండలంలోని తాడికల్ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజులుగా శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఎంపీవో ప్రభాకర్ అధ్యక్షతన జరిగుతున్న ఈ కార్యక్రమంలో కొత్తగట్టు, గొల్లపల్లి, లింగాపూర్‌తో సహా 12 గ్రామాల సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం-2018పై అవగాహన కల్పించారు. నేటితో ఓరియంటేషన్ శిక్షణ ముగియనుంది.
ADB: బోథ్ మండలంలోని కౌట బీ గ్రామంలో గల శ్రీ శబరిమాత ఆశ్రమంలో జరుగుతున్న 14వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో శబరిమాత భక్తులు ఎక్కువగా ఉన్నారని, ప్రజలు ఎల్లప్పుడూ ఇలాగే శాంతి, భక్తి మార్గంలో నడవాలని అన్నారు.
TG: లిక్కర్ స్కాం కేసులో జాగృతి అధ్యక్షురాలు కవితకు సీబీఐ కోర్టు క్లిన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తాను చెప్పిందే నిజమని కోర్టు తీర్పుతో తేలిందని కవిత అన్నారు. తనను 5 నెలలు జైలులో ఉంచి మానసికంగా వేధించారని ఆవేదన చెందారు. తప్పు తేలకుండా నా వ్యక్తిత్వ హననం చేశారని మండిపడ్డారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అన్నదాన సత్రాన్ని శుక్రవారం ఆలయ ఈవో దామోదర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. అన్న ప్రసాదం తయారీ, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. పరిశుభ్రత మరియు నాణ్యత విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్నప్రసాదానికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి తెలిపారు.
KMM: యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ముదిగొండ పోలీస్ సిబ్బంది తెలిపారు. శుక్రవారం మేడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల అనర్ధాలపై విద్యార్థులకు యువత తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సైలు హరిత, అశోక్ రెడ్డి, కృష్ణ ప్రసాద్ సామూహిక ప్రతిజ్ఞ చేయించారు.
E.G: మార్చి 2026లో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఉన్న వివరాల సవరణకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. రేపటి వరకు సవరణలకు అవకాశం ఉందన్నారు. విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 5వ రోజు అయిన శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 455 మంది గైర్హాజరయ్యారు. హిస్టరీ, బాటని, ఒకేషనల్ కోర్సుల్లో 60 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. రెగ్యులర్ కోర్సులకు 1538 మంది హాజరు కావాల్సి ఉండగా 1372 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1500 మంది రాయాల్సి ఉండగా 1377 మంది విద్యార్థులు రాశారు.
MDCL: నేరేడ్మెట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న 9 వైన్స్ దుకాణాపై తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు, మల్కాజ్‌గిరి ఎస్‌హెచ్‌వోకు వినతి పత్రం అందజేశారు. ఈ దుకాణాల వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిలో పేర్కొన్నారు. వినతి ఇచ్చిన వారిలో వీ.ప్రసన్న నాయుడు, కే. గీతామూర్తి, జే.అంజలి దేవిలు ఉన్నారు.
VZM: ప్రపంచ ఎన్జీవో దినోత్సవం సందర్భంగా అయ్యన్నపేట జంక్షన్లో ఉన్న మదర్ థెరిసా కిడ్స్ స్కూల్లో శుక్రవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా పలువురు యువత రక్తదానం చేశారు. ఈసందర్బంగా మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు- త్యాడ ప్రసాద్ పట్నాయక్ నిరంతర రక్తదాత అయిన పోలుబోతు దుర్గాప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.
NRML: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా లోకేశ్వరం పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సిర్గా రవీందర్, బాబు సింగ్‌లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. సూపరింటెండెంట్ విఠల్, డీవో నారాయణ పాల్గొన్నారు.
MDK: నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమా సింగ్‌ను శుక్రవారం జిల్లా ఎస్పీ డీ.వీ. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల్లో పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ యంత్రాంగాలు తదితర అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
MBNR: జర్నలిస్టు నరసింహ కుటుంబానికి అండగా ఉంటామని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నేత సారంగి లక్ష్మీకాంత్ అన్నారు. గత ఆరు నెలల క్రితం అనారోగ్య కారణాలతో జర్నలిస్టు దాసరి నరసింహ మృతిచెందగా, నిన్న ఆయన సతీమణి లలిత కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర నేత మృతురాలి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
GNTR: కంకరగుంట రైల్వే ఫ్లైఓవర్ కింద ఉన్న ‘పీకల వాగు’ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. దీనివల్ల మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోంది. కాలువలో పెరిగిన దోమలు, ఈగల వల్ల స్థానికులు జ్వరాలు, వైరల్ వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కాలువను శుభ్రపరచాలని శుక్రవారం స్థానికులు కోరారు.
KMM: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుని వారి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే నెల 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
HNK: కేయూ మొదటి గేటు ఎదుట యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై కొట్లాడుతున్న జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భానును వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీజేపీ వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు అలువాల కార్తీక్, రాహుల్, వర్ధన్ ఉన్నారు.