• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

BREAKING: మార్చి 20న బడ్జెట్

TG: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 16 నుంచి 30 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, మార్చి 20న రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదించింది.

February 23, 2026 / 09:02 PM IST

‘GP కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి’

HNK: జిల్లాలోనిలోని GP కార్మికుల పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఇవాళ ప్రగతిశీల GP వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో (HNK) డీపీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు నరసింహారావు మాట్లాడుతూ.. GP అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల వేతనాలు రాక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించాలని కోరారు.

February 23, 2026 / 09:02 PM IST

గీతావాహిని ఆధ్వర్యంలో గీతా పారాయణం

RR: భగవద్గీత బోధనలు మనిషిని ధర్మమార్గంలో నడిపించి జీవితానికి సరైన దిశ చూపిస్తాయని నిర్వాహకురాలు స్వతంత్ర, జీవని, గీత సభ్యులు తెలిపారు. చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని గ్రామ హనుమన్ దేవాలయంలో సోమవారం గీతా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు సమూహంగా గీతా అధ్యాయాలను పారాయణం చేయగా కర్మయోగం, భక్తియోగం, లభిస్తాయని అన్నారు.

February 23, 2026 / 09:01 PM IST

‘BCలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి’

BHPL: కుమ్మెర జాతరలో బీసీ రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం తెలంగాణ చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని BHPL జిల్లా TRP జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అన్నారు. ఇవాళ BHPL జిల్లా కేంద్రంలో కోవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. BCలకు కూడా ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 09:00 PM IST

వైన్ షాపులో కన్నం.. నగదు, మద్యం అపహరణ

SRPT: సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని కేటీ అన్నారం క్రాస్ రోడ్ వద్ద గల జీకే వైన్స్‌లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని దుండగులు షాపు పైకప్పు ఇనుప రేకులు ఊడదీసి లోపలికి చొరబడ్డారు. కౌంటర్‌లో ఉన్న రూ.14,500 నగదుతో పాటు ఐదు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. క్యాషియర్ నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలు తెలిపారు.

February 23, 2026 / 09:00 PM IST

ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్-2026 పోటీలు

VSP: ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు విశాఖలోని గురజాడ కళా క్షేత్రంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో 20 నుంచి 65 సంవత్సరాల వయస్సు కలిగి, 50కేజీల నుంచి 100 కేజీల వరకు బరువు కలిగిన పురుషులు పాల్గొన్నారు. ఇందులో గెలిచిన విజేతలకు గోల్డ్ మెడల్‌తో పాటు నగదును అందించనున్నారు.

February 23, 2026 / 09:00 PM IST

BREAKING: పసికూనపై దంచికొట్టిన విండీస్

జింబాబ్వేతో మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు దుమ్మురేపారు. హెట్మేయర్(85) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా, పావెల్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. రూథర్‌ఫోర్డ్(31), షెపర్డ్(21) కూడా దంచికొట్టడంతో విండీస్ 254/6 పరుగుల భారీ స్కోరు చేసింది. హెట్మేయర్ రెండు క్యాచ్‌లను మిస్ చేసి జింబాబ్వే భారీ మూల్యం చెల్లించుకుంది. ముజారబానీ, రిచర్డ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

February 23, 2026 / 08:58 PM IST

అనూరియా కేసులు.. హైల్ప్‌లైన్ ఏర్పాటు

AP: రాజమహేంద్రవరంలో అనూరియా కేసుల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అనూరియా బాధితుల సహాయం, ఫిర్యాదుల కోసం 9494060060 నెంబర్‌ను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. అధికారులు అండగా ఉన్నారన్నారని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టామని అన్నారు.

February 23, 2026 / 08:57 PM IST

కలెక్టరేట్ ప్రజావాణికి 29 ఫిర్యాదులు

NRPT: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 29 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ కు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

February 23, 2026 / 08:54 PM IST

చేర్యాల ఎస్సైగా అపూర్వరెడ్డి బాధ్యతల స్వీకరణ

SDPT: చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్సైగా అపూర్వరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపుతామన్నారు.

February 23, 2026 / 08:53 PM IST

ఏపీ పోలీసులపై పాట్నాకోర్టు ఆగ్రహం

AP: రాష్ట్ర పోలీసులపై పాట్నా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. IPS సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్‌ను పోలీసులు రిజెక్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. FIR, కేసు డైరీ లేకుండా సీనియర్ ఐపీఎస్‌ను ఎలా అరెస్ట్ చేస్తారని కోర్టు ప్రశ్నించింది. పోలీసుల బలవంతపు అరెస్ట్‌ను కోర్టు తప్పబట్టింది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని హెచ్చరించింది.

February 23, 2026 / 08:50 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

JGL: కోరుట్ల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లూరి నరేష్ అనే యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై నరేష్ డెకరేషన్ పనికి మెట్‌పల్లి వెళ్తుండగా.. కోరుట్ల క్రాస్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని ఢీ కొట్టాడు. దీంతో నరేష్ తలకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

February 23, 2026 / 08:50 PM IST

ఛత్రపతి శివాజీ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట

KMR: మద్నూర్ మండల కేంద్రంలో సార్వజనిక శివ జన్మోత్సవ్ సమితి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేకు గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి శాలువాతో ఘనంగా సత్కరించారు.

February 23, 2026 / 08:49 PM IST

తిరుమలలో నాఖా బందీ

TPT: తిరుమలలో భక్తుల భద్రత దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయి నాఖాబందీ కార్యక్రమం నిర్వహించింది. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారి మురళీ కృష్ణ ఆదేశాల మేరకు బాలాజీ నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. సుమారు 90 మంది సిబ్బంది 6 బృందాలుగా ఏర్పడి బాలాజీ నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి అనుమతి లేని వ్యక్తులపై దృష్టి సారించారు.

February 23, 2026 / 08:48 PM IST

‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు’

VZM: నీతి ఆయోగ్, భారత ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన “సిటీ రీజియన్స్ యాజ్ గ్రోత్ హబ్” ప్రాజెక్టులో భాగంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ కింద అమలు చేసే ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు.

February 23, 2026 / 08:48 PM IST