W.G: అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఫైర్ అధికారి ఐ. అజయ్‌కుమార్ అన్నారు. తణుకులోని సాయిశ్వేత ఆసుపత్రిలో శనివారం వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు రోగులను అత్యవసర మార్గాల్లో తరలించే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు.
BDK: లక్ష్మీదేవి పల్లి మండలం హమాలీ కాలనీ సర్పంచ్ ప్రేమిందర్ నాయక్ రోజు రోజుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు పంచాయతీలో శనివారం నూతన వీధి దీపాలు ఏర్పాటు చేసి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీలో ఎలాంటి సమస్య ఉన్న ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
సిద్దిపేట: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా డ్రైవర్ల ఆరోగ్య సంరక్షణ కోసం శనివారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ ఎస్. సదానందం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే డ్రైవర్లకు చూపు మందగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, ఈ ప్రత్యేక తనిఖీలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
MLG: మంగపేట మండల కేంద్రంలో శనివారం TSUTF ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు హాజరై, మాట్లాడారు. ఉపాధ్యాయుల వేతనాలపై విద్యా కమిషన్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు విచారకరమని ఆయన పేర్కొన్నారు. విద్యా కమిషన్ సిఫారసులను అమలు చేసే ముందు ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలన్నారు.
MDK: మెదక్ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ శనివారం సచివాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. మెదక్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని, ప్రజా ప్రభుత్వానికి మరింత మంచి పేరు తేవాలని కలెక్టర్‌కు సూచించారు.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు 40* పరుగులు చేయడంతో ఈ రికార్డు నమోదైంది. ఈ క్రమంలో గతంలో 319 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును, ఫర్హాన్ (323*) అధిగమించాడు.
TPT: సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్స్ చేసిన విషయం తెలిసిందే.. పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతుల నుంచి రూ. 40 వేల లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ హేమంత్, జూనియర్ అసిస్టెంట్ సిరాజ్‌లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలో కీలక ఫైల్స్‌ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
SRPT: జిల్లాలో MGNREGA పనులను కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి వచ్చిన బృందం తుంగతుర్తి, నూతనకల్ మండలాల్లో గ్రామ పంచాయతీల్లోని పనులు, రికార్డులను తనిఖీ చేసింది. అనంతరం ఈరోజు సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పరిశీలన వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. కేంద్ర బృందాన్ని కలెక్టర్ సన్మానించారు.
ATP: పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం డి.హీరేహాల్ మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన మంజునాథ్, కాదలూరుకు చెందిన వన్నూరుస్వామి మృతి చెందడంతో వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా అందజేశారు.
MNCL: భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్నిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. తరగతి గదులు, వంటశాల, విద్యా బోధన తీరు, పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. తాజా కూరగాయలు, నిత్యావసర సరుకులను వినియోగించాలని సిబ్బందికి సూచించారు.
VSP: చారిత్రక ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ శనివారం తెలిపారు. శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై వీసీ జీపీ రాజశేఖర్‌తో సమీక్షించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, పూర్వ విద్యార్థులు, ఉత్తరాంధ్ర ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
NLR: సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ చేస్తున్న పోలీసు అధికారులకు ASP సీహెచ్ సౌజన్య ఆత్మీయ ఘన వీడ్కోలు పలికారు. ఎస్సై షేక్ అబ్దుల్ రహిమాన్, కె.మల్లయ్య, ఎస్.పాండురంగా రెడ్డి వారి వారి కుటుంబాల నడుమ ఆనందోత్సవాలతో పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
NZB: క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని జిల్లా జడ్జి భారత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్, XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నిఅందిస్తాయన్నారు. బిజీగా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
VZM: మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు.
SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష పలాస నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, ప్రజారోగ్యం వంటి కీలక అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. వేసవిలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.