• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల డిమాండ్స్ సమంజసం’

KDP: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల డిమాండ్లు సమంజసమని, వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7,000 మాత్రమే వేతనం ఇవ్వడం అన్యాయమన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.

February 26, 2026 / 12:20 PM IST

‘కార్మికులకు ద్రోహంచేసే నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి’

E.G: రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడి వర్కర్లు & హెల్పర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కొనసాగాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ద్రోహం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యూటీ అమలు చేయాలని, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్ లు ఇవ్వాలన్నారు.

February 26, 2026 / 12:20 PM IST

రూ.4 లక్షలతో పైపు లైన్ పనులకు శంకుస్థాపన

RR: కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో మంచినీటి సమస్యలను పరిష్కరించడానికి కొత్త పైపులైన్ పనులను సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జీపీ నిధుల నుంచి రూ. 4 లక్షలతో వాటర్ పైపు లైన్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

February 26, 2026 / 12:19 PM IST

రేపు ముంబైకి వెళ్లనున్న లోకేష్

AP: మంత్రి నారా లోకేష్ రేపు ముంబైకి వెళ్లనున్నారు. అసెంబ్లీ తర్వాత ముంబైకి బయల్దేరనున్నారు. ముంబై హయత్ రీజెన్సీలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రేపు రాత్రికి విశాఖ వెళ్లనున్నారు. అలాగే ఎల్లుండి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.

February 26, 2026 / 12:19 PM IST

ఎంపీపీ పాఠశాలను సందర్శించిన ఎంఈవో

VZM: వేపాడ మండలం దబ్బిరాజుపేట ఎంపీపీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి పీ బాల భాస్కరరావు గురువారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. ఎఫ్ ఎల్ ఎన్ మెటీరియల్ వినియోగించే తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.

February 26, 2026 / 12:19 PM IST

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

MLG: తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, BRS పార్టీల నేతలు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్తూ రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.

February 26, 2026 / 12:17 PM IST

ఇందిరమ్మ ఇంటిపై సీఎం ఫోటో

VKB: బొంరాస్‌పేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన నందిగామ లక్ష్మీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో నిర్మాణం పూర్తయింది. ఇందిరమ్మ ఇంటిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో వేసి తమ అభిమానాన్ని చాటుకుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో పలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 12:17 PM IST

రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్ట్: బీజేపీ చీఫ్

TG: మూసీ ప్రాజెక్ట్ పేరుతో రూ.4 వేల కోట్ల అప్పు చేశారని BJP చీఫ్ రాంచందర్ రావు మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు లేవు కానీ.. మూసీ ప్రాజెక్ట్‌కు మాత్రం నిధులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీ బాధితులకు BJP అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 26, 2026 / 12:16 PM IST

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

JGL: రాయికల్ పట్టణానికి చెందిన చొప్పదండి నర్సయ్య సోమవారం తెల్లవారుజామున వాకింగ్ చేస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు కావడంతో తోటి వాకర్స్ చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.

February 26, 2026 / 12:16 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారిలోని భాకరాపేట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలై కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 12:14 PM IST

ఉపాధి హామీ పనుల పరిశీలన

KNR: మానకొండూర్ మండలం ఈదెలగట్టపెల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్ పరిశీలించారు. ఆరు వారాలుగా కూలి డబ్బులు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి, 333 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పనిస్థలాల్లో నీరు, టెంట్, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.

February 26, 2026 / 12:11 PM IST

ఆదోని ముస్లిం సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన

KRNL: ఆదోని ముస్లిం మైనార్టీల సమస్యలను ఎమ్మెల్యే పార్థసారథి గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. అరేకల్లు వద్ద రూ.18 కోట్లతో నిర్మించిన బాలికల రెసిడెన్షియల్ స్కూల్, రూ.3.69 కోట్ల ఐటీఐ కాలేజ్ వినియోగం లేకుండా ఉన్నాయన్నారు. ఉర్దూ జూనియర్ బాలికల కళాశాల అర్ధాంతరంగా నిలిచిపోయాయని విమర్శించారు. గత ప్రభుత్వం ఈద్గా కోసం రూ.2.60 కోట్లు తెచ్చామని మోసం చేసిందన్నారు.

February 26, 2026 / 12:10 PM IST

రాంపూర్‌లో కనకదుర్గమ్మ పండుగ వేడుకలు..

HNK: రాంపూర్‌లో కనకదుర్గమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేడుకలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాంపూర్ ప్రాంతం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

February 26, 2026 / 12:10 PM IST

‘జీడిపెక్కలకు మద్దతు ధర కల్పించాలి’

AKP: రావికమతం మండలం కొమిర గిరిజన రైతులు జీడిపిక్కలకు కిలో రూ.200 మద్దతు ధర నిర్ణయించాలని ఇవాళ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సుమారు 200 మంది రైతులు జీడితోటలపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా జీడిపిక్కలను కొనుగోలు చేయడంతో పాటు ఉపాధి పనులు, రోడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.

February 26, 2026 / 12:08 PM IST

‘వీర సావర్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి’

HYD: స్వతంత్ర సమరయోధులు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా గురువారం కాచిగూడలోని ఆయన విగ్రహానికి BJP నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గౌతమ్ రావు, మాజీ కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ పిలుపునిచ్చారు.

February 26, 2026 / 12:08 PM IST