• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన, బాధ్యతా రాహిత్యం వహించిన పెద్దాపురం ఆర్డీవో, డీఎస్పీ, జిల్లా కార్మికశాఖ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

March 1, 2026 / 05:55 PM IST

ఫ్యాన్స్‌కు విజయ్-రష్మిక విజ్ఞప్తి

విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం తర్వాత హైదరాబాద్‌లో ఈ నెల 4న గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు కేవలం ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే హాజరుకావాలని వారు కోరారు. సెక్యూరిటీ, పోలీసుల ఆంక్షల దృష్ట్యా అభిమానులు ఎవరూ రావొద్దని, వచ్చి ఇబ్బంది పడొద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యమని, వారి దీవెనలు ఎక్కడున్నా తమకు చేరుతాయని ‘విరోష్’ జంట తెలిపింది.

March 1, 2026 / 05:54 PM IST

ఆరోగ్యశ్రీని పూర్తిగా చంపే కుట్ర: వైఎస్ షర్మిల

AP: కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 2.5 లక్షల ఆరోగ్య బీమా పచ్చి మోసమని అన్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అంతా బూటకమని తెలిపారు. ‘పేదోడి సంజీవనిని ప్రైవేట్ పరం చేసేందుకే UHC అంటూ డ్రామాలు. ప్రైవేట్ బీమా పేరుతో ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీగా మార్చుతున్నారు’ అని మండిపడ్డారు.

March 1, 2026 / 05:52 PM IST

తిరుపతిలో నూతనంగా అనంత హాస్పిటల్స్ ప్రారంభం

TPT: నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అనంత హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తిరుపతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యంగా న్యూరో, స్పైన్ విభాగాల్లో అధునాతన చికిత్సలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

March 1, 2026 / 05:51 PM IST

‘గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి’

SKLM: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆదివారం మంత్రి తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు, అన్ని గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు,తాగునీరు పథకం అమలులో ఎక్కడా ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. ఇందులో ఆర్డీవో కృష్ణ‌మూర్తి, అధికారులు సుదాక‌ర్‌, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:51 PM IST

ధర్పల్లిలో పెద్దిరాజు, పెద్దమ్మతల్లి ఉత్సవాలు

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్దిరాజు సహిత పెద్దమ్మతల్లి ఆలయ 27వ వార్షికోత్సవాలు మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుకలకు ముదిరాజ్ సంఘం సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.

March 1, 2026 / 05:50 PM IST

రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

ATP: రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం రైతులు చేపట్టిన దీక్షకు ఆదివారం ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అసెంబ్లీలో గళం విప్పి 12 చెరువులకు నీరు తెప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అనంతరం రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:49 PM IST

కోటంచలో ప్రత్యేక పూజలు చేసిన జిల్లా అధ్యక్షుడు

BHPL: రేగొండ మండలంలోని ప్రసిద్ధ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆదివారం BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నూతనంగా ఆలయ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు తదితరులు ఉన్నారు.

March 1, 2026 / 05:48 PM IST

‘అసంపూర్తి రోడ్డు పనులు పూర్తి చేయండి’

VKB: దుద్యాల మండల కేంద్రం నుంచి సాగారంతండా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు అసంపూర్తిగా పనులు వదిలివేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కంకర పరిచి వదిలివేయడంతో దుమ్మూధూళి కళ్లల్లో పడి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దీంతో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.

March 1, 2026 / 05:48 PM IST

గ్రామాన్ని సందర్శించిన ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యుడు

NRML: కడెం మండలం ఉడుంపూర్ గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సందర్శించారు. వారికి కడం మండల బీజేపీ అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, గ్రామ పెద్దలు సంప్రదాయ బద్ధంగా గొంగడి వేసి, గొర్రె పిల్లను అందించి ఘన స్వాగతం పలికారు. కడం నుంచి కల్లెడ గ్రామం వరకు ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాన్ని ఉడుంపూర్ వరకు విస్తరించి నీటి సరఫరా కల్పించాలన్నారు.

March 1, 2026 / 05:47 PM IST

యాదవ సంఘం అధ్యక్షుడిగా మల్లేష్ యాదవ్ ఎన్నిక

MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధి పడాలపల్లి (11వ వార్డు) యాదవ సంఘం అధ్యక్షుడిగా పెద్దగొల్ల లంబ మల్లేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పడాలపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎన్నిక కార్యక్రమం చేపట్టారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గండి చిలుక మల్లేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఎన్నిక కార్యక్రమం చేపట్టారు.

March 1, 2026 / 05:46 PM IST

రాయలసీమలో అంతర్జాతీయ పాఠశాల ప్రారంభం

NDL: గోస్పాడు మండలం బాబానగర్ వద్ద 18 ఎకరాల్లో నిర్మించిన ‘శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్’ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం ప్రారంభించారు. 24వ వార్షికోత్సవం ‘ప్రవాహ్’ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో డా. పి.దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే లక్ష్యమన్ని పేర్కొన్నారు.

March 1, 2026 / 05:45 PM IST

IND vs WI: తుది జట్లు (అంచనా)

IND XI: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్, సూర్యకుమార్, దూబే, అక్షర్ పటేల్, హార్దిక్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి. WI XI: బ్రెండన్ కింగ్, హోప్, హెట్‌మయర్, పావెల్, రూథర్‌ఫర్డ్, చేజ్, షెపర్డ్, ఫోర్డ్, హోల్డర్, మోటీ, షామర్ జోసెఫ్.

March 1, 2026 / 05:44 PM IST

పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన హెల్త్ డైరెక్టర్

SKLM: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం శ్రీకాకుళం లో డయేరియా కేసులపై పరిశీలించేందుకు వచ్చిన ఆమె తిరుగు ప్రయాణంలో అకస్మాత్తుగా లావేరు పీహెచ్సీని సందర్శించారు. స్థానిక కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సేవలను మౌలిక వసతులను స్వయంగా పరిశీలించారు. రోగులకు సరైన సమయంలో సేవలు అందించాలన్నారు.

March 1, 2026 / 05:43 PM IST

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా దానియేలు

W.G: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా శృంగవృక్షం గ్రామానికి చెందిన సబ్బతి దానియేలు నియమితులయ్యారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదేశాలతో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని దానియేలు పేర్కొన్నారు.

March 1, 2026 / 05:42 PM IST