SRCL: సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన కోనమ్మ శ్రీనివాస్-అమరావతి కూతురు వివాహానికి తన వంతు సహాయంగా ఆ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిని-నరేష్ 50 కిలోల బియ్యం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతి పేదింటి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మోర రవి, కోడం శ్రీనివాస్, సిరిమల్లె సత్యం, రాజయ్య, కృష్ణా హరి, మధు, అభిలాష్ పాల్గొన్నారు.
BHNG: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించే ‘ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.
ASR: అడ్డతీగల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ మహేష్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఇతర వైద్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందించడమే తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.
PPM: ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తుల గడువు మార్చి 9 2026 వరకు పొడిగించారు. అర్హత గల గిరిజన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ వీర్ సింగ్ తెలిపారు. గుమ్మలక్ష్మీపురం ఏకలవ్య పాఠశాలలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు.
VZM: ఏపీ బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో మేళవించిన అద్భుతమైన బడ్జెట్ అని ఎమ్మెల్యే లోకం మాధవి కొనియాడారు. శాసనసభలో బడ్జెట్ పై జరిగిన చర్చలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల కోసం ‘నానో పార్క్స్’ ఏర్పాటు చేయాలని, ఫార్మా రంగంలో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అలాగే, ఉత్తరాంధ్రను బయో-సిమిలర్స్ R&D హబ్‌గా మార్చాలన్నారు.
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ భయంతో యువకుడికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. మృతుడు APలోని పాలకొల్లుకు చెందిన రాజేష్‌గా గుర్తించారు. 8 నెలల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కువైట్‌పై భారీగా మిస్సైల్స్ దాడి జరిగిన సంగతి తెలిసిందే.
SDPT: ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా అక్కన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ‘కనువిప్పు’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాలు ఇతర సామాజిక అంశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రశాంత్ సూచించారు. చట్టాలపై అవగాహన ద్వారానే నేర రహిత సమాజాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు
MBNR: హన్వాడ మండలంలోని లింగన్నపల్లిలో ఈనెల 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌ను గ్రామ పెద్దలు ఆహ్వానించారు. బుధవారం ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేసి, కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
NRML: నిర్మల్ పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో లైన్‌మెన్ దివస్‌ను బుధవారం విద్యుత్ శాఖ అధికారులు నిర్వహించారు. నిర్మల్ పట్టణ సబ్ డివిజన్ పరిధిలో టౌన్, టౌన్ 2, టౌన్ 3 సోన్ సెక్షన్ పరిధిలోగల సిబ్బందిని ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యుత్ శాఖలో వారు చేస్తున్న సేవలను కొనియాడారు.
PLD: రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బొల్లాపల్లి మండలం రెడ్డిపాలేనికి చెందిన మధు, తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పొలాలకు వెళ్తున్న స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన బయటపడింది.
TG: HYDలో సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.1.5 లక్షల విలువ చేసే 12.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన వ్యక్తుల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
SRCL: సిరిసిల్ల విద్యానగర్‌లోని అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ఇందిరమ్మ కాలనీలోని సొంత స్థలానికి తరలించనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నిర్వహించవద్దన్న సర్కార్ ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సొంత భవనం నిర్మించే వరకు తాత్కాలికంగా కంటైనర్‌ను కార్యాలయం కోసం వినియోగించనున్నారు. త్వరలోనే సేవలు అందిస్తారు.
MNCL: భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీని MPDO మధుసూదన్ బుధవారం సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి, నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో APO జీనత్, హౌసింగ్ AE రుచిత, పంచాయతీ కార్యదర్శి వసుంధర తదితరులు పాల్గొన్నారు.
SRPT: పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అన్తెతిక చర్యలకు పాల్పడిన మోతే మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రకటించారు. బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ.. ఇవాళ నుంచి ఆయనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన చర్యల వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని స్పష్టం చేశారు.
KMR: కెమికల్ పరిశ్రమలతో ప్రాణాలు పోతున్నాయని నూతనంగా ఏర్పాటు చేసే పరిశ్రమల అనుమతులు రద్దు చేయాలని మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ సాయ గౌడ్ కోరారు. బుధవారం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి గ్రామ సచివాలయ పాలకవర్గ తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.