• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

MDK: అల్లాదుర్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్పారం గ్రామానికి చెందిన సనుబాల వీరేశం(41) పని నిమిత్తం అల్లాదుర్గం వచ్చి, తిరిగి తన బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.

February 26, 2026 / 08:49 AM IST

‘రహదారి వ్యవస్థను నిర్వీర్యం చేశారు’

E.G: గత వైసీపీ ప్రభుత్వం రహదారి వ్యవస్థను నిర్వీర్యం చేస్తే, కూటమి ప్రభుత్వం దాన్ని గాడిలో పెడుతోందని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుధవారం అసెంబ్లీలో అన్నారు. బడ్జెట్లో రూ.9,014 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ నుంచి కడియం, జొన్నాడ వెళ్లే రోడ్ల పనులు వేగవంతం చేయాలని కోరారు

February 26, 2026 / 08:48 AM IST

ఇజ్రాయిల్ దాడుల వెనుక వారి పాత్ర! HYDలో నిరసనలు

HYD: IPSP, BDS ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రిలయన్స్ ఔట్‌లెట్ వద్ద HYD ప్రజలు ఇజ్రాయిల్ దాడుల విషయంలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసనలు చేశారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడుల విషయంలో రిలయన్స్ అధినేత పాత్ర ఉందని ఆరోపిస్తూ సంస్థపై బహిష్కరణకు పిలుపునిచ్చారు. పోలీసుల పర్యవేక్షణలో ఆందోళన శాంతియుతంగా సాగింది.

February 26, 2026 / 08:47 AM IST

మంచిమాట: మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి

లోకం ఏమనుకుంటుందో అని మీలోని గొప్పతనాన్ని అణచివేయకండి. సగటు మనుషుల కోసం మీ ప్రతిభను తక్కువ చేసుకోకండి, ఎందుకంటే ఈ ప్రపంచం కేవలం అసాధారణ ప్రతిభను మాత్రమే గుర్తిస్తుంది. ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుని వాటి కోసం గట్టిగా ప్రయత్నించండి. మీ ఉనికిని చాటుకుని, ప్రపంచం మిమ్మల్ని గుర్తించేలా ఎదగండి.

February 26, 2026 / 08:47 AM IST

‘విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి’

BHNG: ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయాలని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహణను ఆయన సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.

February 26, 2026 / 08:45 AM IST

మార్కాపురం విద్యార్ధినిని అభినందించిన సీఎం

ప్రకాశం: మార్కాపురంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రం అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు సీఎం చంద్రబాబు వివరించారు.

February 26, 2026 / 08:45 AM IST

ఆడబిడ్డల వివాహానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

MBNR: ఆడబిడ్డల వివాహానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు ప్రభుత్వం లబ్ధి చేస్తుందని పేర్కొన్నారు.

February 26, 2026 / 08:44 AM IST

నేడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలు

ASR: నేడు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11.30 గంటలకు మలికిపురం గాంధీ బొమ్మల సెంటర్ నందు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బొడసకుర్రు BRK రాజు ఫంక్షన్ హాల్ నందు జరుగు పార్లమెంటరీ స్థాయి జనసేన సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవం లో పాల్గొంటారు.

February 26, 2026 / 08:44 AM IST

కాంటోన్మెంట్ సిబ్బంది నిర్లక్ష్యం.. నెలలు తరబడి చెత్త

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాలాలో నెలలు తరబడి చెత్త చెదారంతో నిండి దుర్వాసన వస్తున్నా సంబంధిత సిబ్బంది ఏమీ పట్టనట్లు ఉంటున్నారని ఆశిష్ గార్డెన్ నాలా వద్ద స్థానికులు వాపోతున్నారు. చెత్తసేకరించి జీవించే వాళ్లు కొంత ప్లాస్టిక్ బాటిల్ వంటి పదార్థాలు తీసుకుపోతున్నారు. సిబ్బంది మాత్రం నాలా శుభ్రం చేయడం లేదని, వెంటనే నాలా శుభ్రం చేయాలని కోరుతున్నారు.

February 26, 2026 / 08:43 AM IST

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

HYD: ఉస్మానియా మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ప్రాతిపదికన 8 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. రాజారావు తెలిపారు. దరఖాస్తులను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 5 వరకు ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

February 26, 2026 / 08:42 AM IST

సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలి: కలెక్టర్

NLG: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను పేదల దరి చేర్చాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేర్చడంలో గెజిటెడ్ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు.

February 26, 2026 / 08:42 AM IST

బాపట్లలో పోలీసుల ‘డ్రగ్స్ వద్దు బ్రో’ ప్రచారం

BPT: మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా బాపట్ల పాత బస్టాండ్ వద్ద పోలీసులు బుధవారం సాయంత్రం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాంబాబు ఆటో డ్రైవర్లతో మాట్లాడి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం ఆటోలకు కరపత్రాలు అంటించి ప్రచారం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు.

February 26, 2026 / 08:40 AM IST

ఇద్దరి మరణానికి కారణమైన లారీనీ పట్టుకున్న పోలీసులు

VZM: గత నెల 25న రామభద్రపురం వద్ద ఇద్దరి మరణానికీ కారణమైన లారీని స్దానిక SI ప్రసాదరావు బుధవారం పట్టుకున్నారు. యాత వీధికి చెందిన ఇరువురిని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన వాహనం కోసం గాలిస్తే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన స్వస్తిక్‌ మినరల్స్‌ లారీగా తేలింది. డ్రైవర్‌ ప్రమాదం తర్వాత లారిని కంపెనీకి అప్పగించి పారిపోయాడు. ఈ మేరకు లారీని ఛత్తీస్‌గఢ్‌ నుంచి తీసుకువచ్చారు.

February 26, 2026 / 08:40 AM IST

40 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత

NZB: అక్రమంగా తరలించడానికి నిలువ ఉంచిన 40 క్వింటాళ్ల PDS బియ్యంతో పాటు బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు నిజామాబాద్ CCS CI సాయినాథ్ తెలిపారు. NZB వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి కంపౌండ్, కెనాల్ కట్ట, ఎరుకలవాడలో షేక్ సాహెబ్ హుస్సేన్ ఇంట్లో CCS టీమ్ దాడి చేసినట్లు చెప్పారు. PDS బియ్యంతో పాటు బోలోరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

February 26, 2026 / 08:38 AM IST

కల్తీపాల దందా గుట్టురట్టు

TG: రంగారెడ్డి జిల్లా రాయ్‌చేడ్‌లో కల్తీపాల దందా గుట్టురట్టు అయింది. ఉప్పు, చక్కెర కలిపి గేదె పాలు కల్తీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాచారం మిల్క్ డిపోకు కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందిడుతు శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

February 26, 2026 / 08:38 AM IST