గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతల కోసం గురువారం నుంచి భోజన పథకం ప్రారంభం కానుంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో, అధికారులు గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక వ్యక్తికి అల్పాహారం, భోజనం కలిపి రూ. 88.25 ధరగా నిర్ణయించారు (టిఫిన్ రూ. 20, భోజనం రూ. 68.25). యార్డు ఛైర్మన్ కుర్రా అప్పారావు, కార్యదర్శి చంద్రికలు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
అనకాపల్లి పట్టణం భీముని గుమ్మం వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అధికారులు హుండీలను తెరచి లెక్కించారు. కానుకల రూపంలో రూ.4,26,767 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి చంద్ర తేజ తెలిపారు. 50 రోజులకు ఈ ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘వృషకర్మ’. నిధి అన్వేషకుడైన ‘అర్జున్’ పాత్రలో చైతూ కనిపిస్తాడని సమాచారం. మార్చి 5న ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
SRCL: వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్ధోగంలో బుధవారం రాత్రి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగుండాలని, ఎల్లమ్మ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు.
KMR: జిల్లా IDOC సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, PMAY-U, అమృత్ పనుల పురోగతి, ఆస్తి పన్ను వసూళ్లు, విపత్తు నిర్వహణ చర్యలపై చర్చించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కార్యాచరణ ప్రణాళిక, శానిటేషన్, ప్లాంటేషన్, తొలగింపుపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.
VSP: ఫిజియోథెరపీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాజువాక ఉడా కాలనీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైడా రజిని (21) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్లో వెల్లడించింది. న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
PDPL: మీ ప్రవచనం వినడం ఎంతో ఆనందం కలిగించిందని, ఎందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం శ్రీ మణికంఠ ప్రాంగణంలో నిర్వహించిన గరికపాటి నరసింహారావు ప్రవచనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముక్కు సూటిగా మాట్లాడే తత్వం కలిగిన గరికపాటి ప్రవచనం చెప్పేవారు ఈ దేశంలో మరి ఎవరు లేరని అన్నారు.
KRNL: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 7వ తేదీన కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో జిల్లాస్థాయి బాలికల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంటు డా.ఎస్. ముంతాజ్బేగం ఇవాళ తెలిపారు. 7- 9 ఏళ్లు, 10- 13 ఏళ్లు, 14- 18 ఏళ్ల విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. వివరాలకు 7981515467 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
SDPT: చౌదర్‌పల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పార్వతీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు, వంశపారంపర్య ధర్మకర్త, ఆధ్యాత్మిక సేవకుడు దుబ్బరాజం పంతులు బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మరణవార్తతో గ్రామంలో విషాదం నెలకొంది. ఎన్నో దశాబ్దాలుగా ఆలయ సేవలో నిమగ్నమై భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా నిలిచిన దుబ్బరాజాం పంతులు భక్తి,సేవాభావానికి ప్రతీకగా నిలిచారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి విజయవాడలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. మార్కెట్ యార్డులో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రికి వివరించి, వాటి పరిష్కారంపై చర్చించారు. యార్డును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రావాలని కోరగా, త్వరలోనే సందర్శిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
AP: దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మార్చి 7న అనకాపల్లి జిల్లాలో శంకుస్థాపన చేస్తున్నట్లు AMNS యాజమాన్యం ‘X’లో ప్రకటించింది. ఇది చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆనందకరమైన విషయమంటూ పేర్కొంది. కంపెనీ చిత్రం, సమగ్ర వివరాలను పోస్టుకు జత చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, CM చంద్రబాబు, కేంద్ర, రాష్ట్రమంత్రులు వస్తారనే సమాచారంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
E.G: మాజీ మంత్రి అంబటి రాంబాబును YCP నేత మేడపాటి షర్మిల రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, పార్టీ అంతర్గత విషయాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, ఎస్సీ నాయకుడు కాటం సంజయ్ కాంత్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.
WNP: జిల్లాలోని కీర్యా తండాకు చెందిన గణేశ్ నాయక్(21) అన్నారం తండాకు చెందిన వసంత(18) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. HYDలో గణేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వసంత బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతుంది. ఇటీవల వసంతను వివాహం చేసుకోవాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన గణేష్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనతో ఆమె సూసైడ్ చేసుకుంది.
SS: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను జాప్యం లేకుండా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలను మంజూరు చేశారు. ఎంఎస్ఎంఈ పనులను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు.
తిరుపతిలోని APSPDCL సీఎండీ కార్యాలయంలో “వెంకటపతి విద్యా దీవెన” పేరుతో పేద, వెనుకబడిన వర్గాల యువతకు రాష్ట్ర, కేంద్ర సివిల్ సర్వీసుల కోసం మూడేళ్లపాటు ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్, కోచింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 200 మందికి ఈ అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాలురకు వినుకొండలో, బాలికలకు కేతనకొండ (విజయవాడ)లో ప్రవేశ పరీక్షలు ఉంటాయన్నారు.