• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

T20 WC: రేపు శ్రీలంక vs పాకిస్తాన్

పల్లేకలె వేదికగా రేపు రాత్రి 7 గంటలకు శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా, పాక్ సెమీస్ ఆశలు ఈరోజు జరుగుతున్న ENG vs NZ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉన్నాయి. న్యూజిలాండ్ గెలిస్తే.. పాకిస్తాన్ ఇంటిదారి పడుతుంది. ఒకవేళ కివీస్ ఓడిపోతే మాత్రం.. లంకతో జరిగే మ్యాచ్‌లో పాక్ భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్‌కు చేరుకుంటుంది.

February 27, 2026 / 09:33 PM IST

మార్చి 2న పలు రైళ్లు రద్దు

VZM: రైల్వే ఆధునీకరణ కారణాల కారణంగా రైలు నంబరు 58532/ 31 విశాఖపట్నం బ్రహ్మపూర్, బ్రహ్మపూర్ విశాఖపట్నం మార్చి 2న, రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం పవన్ కుమార్ శుక్రవారం తెలిపారు. అలాగే రైలు నంబరు 67289/ 290 విశాఖపట్నం పలాస, పలాస విశాఖపట్నం మేము పాసింజర్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో చెప్పారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

February 27, 2026 / 09:30 PM IST

‘సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయండి’

ELR: మాదకద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్తు అంధకారమవుతుందని కలెక్టరు వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు. జిల్లా స్థాయి నిరోధక కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు పిల్లలు బానిసలు కాకుండా తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు. వీటిపై సమాచారం లేదా సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 14446, 1972లను సంప్రదించాలన్నారు.

February 27, 2026 / 09:26 PM IST

బాలీవుడ్ నటుడిని కలిసిన లోకేష్

AP: ముంబైలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను మంత్రి లోకేష్ కలిశారు. రాష్ట్రంలో కొత్త ఫిల్మ్ సిటీ నిర్మాణం, సినిమా షూటింగ్స్ కోసం సింగిల్ విండో అప్రూవల్ ప్రాసెస్ ఏర్పాటుపై సంజయ్ దత్‌తో చర్చించినట్లు లోకేష్ వెల్లడించారు.

February 27, 2026 / 09:25 PM IST

ముగిసిన శిక్షణ.. ధృవీకరణ పత్రాలు అందజేత

RR: తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ (TGIRD) ఆధ్వర్యంలో జిల్లా సర్పంచ్‌ల కోసం నిర్వహించిన ఐదు రోజుల ‘జనరల్ ఓరియంటేషన్’ శిక్షణా కార్యక్రమం ముగిసింది. ముచ్చింతల్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్ వేదికగా జరిగిన ఈ శిక్షణలో షాద్‌నగర్ నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి సర్పంచులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

February 27, 2026 / 09:25 PM IST

వరి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి: అ. కలెక్టర్

VKB: రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకు 129 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 27, 2026 / 09:21 PM IST

జనసేన నేతల మీడియా సమావేశం..!

అన్నమయ్య: రాయచోటి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పై దాడి చేసిన వారిని, వారి వెనుక ఉన్న కుట్రదారులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర పోలీస్ శాఖను జనసేన నాయకుడు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి కోరారు. రాయచోటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 09:20 PM IST

విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన

NGKL: కల్వకుర్తి పట్టణంలోని మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన జిల్లా యువజన అధికారి కోట నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

February 27, 2026 / 09:19 PM IST

FPOకి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు

KNR: జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతు ప్రగతి ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (FPO)కు 2025 సం. గాను NCDC భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం “కోఆపరేటివ్ ఎక్సలెన్స్ & మెరిట్-2025″ అవార్డు లభించింది. ఈ అవార్డును HYDలోని TGCAB కార్యాలయంలో వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి చేతుల మీదుగా తీసుకున్నారు.

February 27, 2026 / 09:09 PM IST

ఉమామహేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం

SDPT: బెజ్జంకి(మం) దాచారంలోని ఉమామహేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్పంచ్ బైరా మానస ఆధ్వర్యంలో దేవతలకు పట్టు వస్త్రాలు, సంప్రదాయ కానుకలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దీటి బాలనర్స్, వార్డ్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 27, 2026 / 09:04 PM IST

గద్వాలలో నూతన కలెక్టర్ సూచనలు

గద్వాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఆదేశించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో జరిగిన సమావేశంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని, శాఖల మధ్య సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

February 27, 2026 / 09:01 PM IST

కంటి పరీక్షలు చేయించిన పోలీసులు

NRML: ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్ సూచించారు. రోడ్డు భద్రతా నియమాల్లో భాగంగా శుక్రవారం ఖానాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని కంటి ఆసుపత్రిలో ఆటో డ్రైవర్లకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాహుల్ గైక్వాడ్ ఉన్నారు.

February 27, 2026 / 09:01 PM IST

591 మంది మావోయిస్టులు లొంగిపోయారు: డీజీపీ

TG: రెండేళ్లలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని DGP శివధర్ రెడ్డి వివరించారు. పోలీసుల సమన్వయం, ప్రభుత్వ పునరావాస విధానాలతో జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని తెలిపారు. మాజీ మావోస్టులకు భద్రత, గౌరవంగా జీవించేలా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.

February 27, 2026 / 09:00 PM IST

పోలీసు కార్యాలయంలో వెల్ఫేర్ డే

PPM: పోలీసు సిబ్బంది యొక్క శాఖాపరమైన, ఆరోగ్య పరమైన పరిష్కారానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విన్నవించారు. వినతులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

February 27, 2026 / 09:00 PM IST

గురుకులం ప్రవేశ పరీక్ష వాయిదా

AKP: గొలుగొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగులు ఖాళీలు భర్తీ చేసేందుకు మార్చి 2న జరగాల్సిన ప్రవేశ పరీక్ష 8వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని ప్రిన్సిపాల్ కోటేశ్వరరావు తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు జరుగుతున్నందున ఈ మార్పు చేశారన్నారు.

February 27, 2026 / 09:00 PM IST