ASF: కాగజ్ నగర్ పట్టణంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ సమావేశం వంగరి ప్రవీణ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టాన్ని సమాజంలోని రుక్మతల తొలగించడానికి, సమాజ మార్పు కొరకు ఉపయోగించాలని అన్నారు. సమాచార హక్కు చట్టం సామాన్యుని వజ్రాయుధమని అన్నారు.
KKD: గ్రామంలోని చెరువు పరిసరాల్లో యువకులు సాయంత్రం వేళ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. వర్షాల కారణంగా చెరువులో నీరు నిల్వ ఉండగా, చుట్టూ పచ్చదనం అలరారుతోంది. ప్రకృతి మధ్య ఆటలతో కాలక్షేపం చేస్తున్న యువత ఆనందం వ్యక్తం చేశారు. అయితే చెరువు వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
PPM: అంగన్వాడీ యూనియన్ నాయకుల హౌస్ అరెస్టులను సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఖండించారు. ఆదివారం కొమరాడలో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ మహా ధర్నాకు వెళ్తున్న నాయకులను నిర్బంధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
VZM: RTCలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ఔట్సోర్సింగ్ కార్మికులు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 7300 మంది కార్మికులు ఉన్న థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్ట్రీట్ పబ్లిక్ సెక్రెటరీ అశోక్ కోర...
ASR: మహిళలు ఎక్కడయితే గౌరవించబడతారో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుందని చింతపల్లి ఎస్సైలు వీరబాబు, వెంకటరమణ అన్నారు. మహిళలు సమాజానికి మూల స్తంభాలన్నారు. ఆదివారం చింతపల్లిలో విద్యార్థులతో మహిళల భద్రతపై ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
BHNG: భువనగిరి జిల్లా పర్యటన సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమ కారులతో ఏర్పాటైన తెలంగాణ జన ఫ్రంట్ స్టిరింగ్ కమిటీ సభ్యులు ఆదివారం రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. జన ఫ్రంట్ ఛైర్మన్ వలిగొండ విజయరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
VSP: శివాజీ, లయ జంటగా నటించిన “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని” చిత్రం ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను యూనిట్ వెల్లడించింది. ఇదొక విభిన్నమైన డార్క్ కామెడీ చిత్రమని, ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని హీరో శివాజీ ధీమా వ్యక్తం చేశారు.
సత్యసాయి: లేపాక్షి ఆలయంలో ఈ నేల 3న సంభవించే చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం నిత్యపూజల అనంతరం 8.30 గంటలకు తలుపులు మూయబడతాయి. మరుసటి రోజు 4న ఆలయ శుద్ధి, అభిషేకాల తరువాత ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం ఉంటుంది. ఈ విషయాన్ని కార్యనిర్వాహణాధికారి ఎం.హెచ్ నరసింహమూర్తి తెలియజేశారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. ఛేదనకు పిచ్ అనుకూలంగా ఉంటుందని తెలిపాడు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందని చెప్పాడు.
KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంభళం గ్రామంలో ఇంటి స్థలం దారి విషయంలో జరిగిన వివాదం ఇవాళ దాడికి దారితీసింది. గ్రామానికి చెందిన బోయ హనుమంతు, కడబూరి హరికృష్ణలపై అదే గ్రామానికి చెందిన లింగన్న, మహదేవ, మహేష్‌లు దాడిచేసి గాయపరిచినట్లు బాధితుడు బోయ హనుమంతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు.
NRML: చంద్రగ్రహణం సందర్భంగా సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ దేవస్థానాన్ని ఈనెల 3వ తేదీన మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు (ఒక్క గంట మాత్రమే) భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. తరువాతి రోజు బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, నిర్వహించిన అనంతరం యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు.
SKLM: సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని,మాజీ ఎమ్మెల్సీ అజాశర్మ డిమాండ్ చేశారు. మందస మండలం హరిపురం మార్పు ట్రస్ట్ గ్రంథాలయంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వంశధార ప్రాజెక్టు పనులు దశాబ్దాలు గడుస్తున్న అడుగు ముందుకు పడట్లేదని మండిపడ్డారు.
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2000-01 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తమ పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
E.G: జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు పట్టణ నాయకుడు పోలిశెట్టి శివ ఆదివారం ఇంటింటికీ తిరిగారు. సభ్యత్వాల ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా, పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.