WGL: వరంగల్ బల్దియాలో పలు విభాగాల్లో ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేశారు. ఆనంద్‌ను కాశీబుగ్గ సర్కిల్ రెవెన్యూ అధికారిగా నియమించగా, శ్రీనివాస్‌కు 9, 10, 11 డివిజన్ల అదనపు బాధ్యతలు అప్పగించారు. షహజాదీబేగంకు 1-3 డివిజన్లు, హబీబ్ పాషాకు ఇంజినీరింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ బాధ్యతలు, ఉమాదేవేందరుకు హార్టికల్చర్ బాధ్యతలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
‘ఛాంపియన్’ ఫేమ్ రోషన్ తన తర్వాతి ప్రాజెక్టును దర్శకుడు శైలేష్ కొలనుతో చేస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘ఏమో ఏమో ఇది’ అనే టైటిల్ ఖరారైంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా 2026 దసరా కానుకగా రిలీజ్ కానుంది.
శ్రీకాకుళం గుడి వీధిలో ఉన్న శ్రీ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం మూసివేయడం జరుగుతుందని దేవాదాయ శాఖ ఈవో సుకన్య తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలో ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 3 తేదీన చంద్రగ్రహణం సంభవిస్తున్న సందర్భంగా అదే రోజు ఉదయం 10 గంటలకు మూసివేయడం జరుగుతుందన్నారు. తిరిగి 4 తేదీ సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం 6 గంటలకు తెరుస్తామన్నారు.
NGKL : పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోంది. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 447 కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి శనివారం వెల్లడించారు. పెంపుడు కుక్కలకు సైతం వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ సౌకర్యం ఉందని, ఆసక్తి గల వారు 9010262748 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల హామీ మేరకు చిట్యాల 7వ వార్డులో ఉచిత తాగునీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. కౌన్సిలర్ గెలిచిన 15 రోజుల్లోనే పనులు పూర్తి చేయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. త్వరలో ఎమ్మెల్యే దీనిని ప్రారంభిస్తారని కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ తెలిపారు. గతంలో డబ్బులు పెట్టి నీటిని కొన్నవారికి ఇప్పుడు ఉచితంగా నీరు అందుతుంది.
కరీంనగర్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, జగిత్యాల జిల్లా పూడూరు గ్రామంలో వరి పంటలో చీడపీడల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డా. హరికృష్ణ సల్ఫైడ్ ఇంజురీ, చౌడు నేలల జాగ్రత్తలు వివరించగా, డా. రాజేంద్ర ప్రసాద్ అగ్గి తెగులు, మోగి పురుగు, సూడిదోమ నివారణపై సూచనలు ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి జ్యోతి ఆరుతడి,ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలన్నారు.
హనుమకొండలో జరిగిన తాగునీటి శుద్ధికరణ పథక కమిటీల మహాసభలో ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. వితంతువులు, ఒంటరి మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తాను సిఫార్సు చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో తాగునీటి శుద్ధికరణ కేంద్రాలు కీలకమని పేర్కొన్నారు. నీటి నాణ్యతపై కమిటీలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
KDP: దొడియం నుంచి తలమంచిపట్నం వెళ్లే రహదారి గుంతలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్ పైపొర ఊడిపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గాలి ఫ్యాన్ ప్రాంతానికి వెళ్లే భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్ పై పొర ఊడిపోవడంతో రాళ్లు బయటకు వచ్చాయి.
ADB: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు చేసుకోవాలని దిశ కమిటీ ఛైర్మన్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందని, దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
MDK: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 257 నుంచి రూ. 260 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 292 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 20 వరకు పెరిగింది.
VKB: జిల్లాలో యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో సుమారుగా 3,34,627 మంది రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో ఇదివరకు సాధారణ సాగు 75,838 ఎకరాల్లో ఉండేది. ప్రస్తుతం 93,116 ఎకరాలు పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని ప్రస్తుతం 1,45,241 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.
నేడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవన్‌లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు జయంతి ముగింపు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గిరిజన విద్యార్థి సేవా సంఘం అధ్యక్షులు రవి రాథోడ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమాన్ నాయక్ ముఖ్యఅతిథిగా వస్తారన్నారు. నేడు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.
E.G: కొవ్వూరు MEO-1గా బాధ్యతలు చేపట్టిన ఉందుర్తి శాంసన్ శనివారం MLA ముప్పిడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని MLA ఆదేశించారు. మండలం వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ భేటీలో UTF నాయకులు పల్లికొండ, విజయ్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనకు సంబంధించి సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ యూనిట్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. యజమాని అర్జున్‌తో పాటు సోదరుడు వీరబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ, రష్మిక జంట తమ వివాహ వేడుకను వినూత్నంగా, సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ ఆదర్శంగా నిలిచారు. పెళ్లి తర్వాత ఈ జంట దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇవాళ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, యూపీ, అస్సాంలలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదం, మిఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నారు.