KRNL: నేడు మార్చి 3వ తేదీ (మంగళవారం) పౌర్ణమి రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించనున్నట్లు ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నాయకుడు నాగరాజ్ రావు తెలిపారు. మధ్యాహ్నం 3:19 నుంచి రాత్రి 6:47 వరకు గ్రహణం జరుగుతుందని, గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేవాలయాలను ముందే మూసివేసి, గ్రహణ సమయం తర్వాత సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
NZB: ఐటీఐ మైదానంలో మంగళవారం హోలీ వేడుకలు మిన్నంటాయి. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వాకర్లందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
NLG: జిల్లాలో రబీ సీజన్లో సాగు చేసిన పంటలు నీరందక ఎండిపోతున్న తరుణంలో నీటిపారుదల శాఖ అధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి డీ-25 కాలువ గేట్లను మూసివేయడంతో, కాలువ కింద ఉన్న పొలాలు బీటలు వారుతున్నాయి. రైతుల విజ్ఞప్తులు, పంటల పరిస్థితిని గమనించిన నీటిపారుదల శాఖ అధికారులు, డీ-25 కాలువ ద్వారా రేపటి నుంచి నీటిని వదలనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్ 2’ మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిర్మాత విజయ్ గుడ్‌న్యూస్ చెప్పాడు. ‘సలార్ 2’ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని తెలిపాడు. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించాడు. ఈ విషయం అభిమానులతో పంచుకోవడం ఆనందంగా ఉందన్నాడు. అలాగే, ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరని విజయ్ కితాబిచ్చాడు.
కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లు లోని సీతారామ కళ్యాణ మండపంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందితో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీగా సమాజంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, కుటుంబ సభ్యులు పిల్లల ఎదుగుదలకు, భర్త విజయం వెనుక ఆమె కృషి సాటి లేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
GNTR: మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ‘రథారోహణ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్సవ మూర్తులను దివ్య రథంపై ప్రతిష్ఠించగానే, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో, కోలాహలంగా మారాయి. భక్తుల గోవింద నామస్మరణ స్మరించుకున్నారు.
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్లో ఉన్న పుల్లయ్య హోటల్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. హోటల్లోని సీసీ కెమెరాల హార్డ్ డిస్క్, మానిటర్‌తో పాటు సుమారు రూ.10 వేల నగదును అపహరించినట్లు హోటల్ యజమాని తెలిపారు. మంగళవారం ఉదయం హోటల్ తెరవడానికి వచ్చిన యజమాని దొంగతనాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
TG: గత నెల 23 నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో ఉంటున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన అల్లుడు కళ్యాణ్ శేఖర్‌కు అక్కడి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అల్లుడి ఆరోగ్య పరిస్థితికి తోడు ఈ నెల 6 వరకు భారత్‌కు విమానాలు రద్దు చేసినందున అప్పటి వరకు తుమ్మల అక్కడే ఉండనున్నారు.
VKB: బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం కార్యదర్శి నాగరాజు, తుంకిమెట్ల కార్యదర్శి రాజేష్ బదిలీపై వెళ్లారు. గత నాలుగు సంవత్సరాలుగా గ్రామాలల్లో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. కార్యదర్శి నాగరాజు సూర్యాపేట జిల్లాకు, కార్యదర్శి రాజేష్ నల్లగొండ జిల్లాకు బదిలీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలు వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
గద్వాల జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ బాషా షేక్‌కు సోమవారం సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మోహన్ రావు, రామన్ గౌడ్, కలీమ్ తదితరులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని కలెక్టర్ కోరారు.
E.G: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “SIR” ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కోసం రాష్ట్ర కన్వీనర్‌గా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ అధ్యక్షతన ఢిల్లీలోని బీజేపీ నేషనల్ ఆఫీస్‌లో ఈ నెల 7వ తేదీన జరిగే సమావేశానికి హాజరవుతారు.
NLR: చిన్నపిల్లలందరికీ ఎంతో ఇష్టమైన హోలీ పండుగ ప్రతి సంవత్సరం మార్చి నెలలో వస్తుంది. పిల్లలందరూ ఎంత ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి హోలీ పండుగ చిన్నపిల్లలతో ప్రారంభమైంది. పిల్లలందరూ రంగులు పూసుకుంటూ, బాగా ఆనందోత్సవాల నడుమ ఈ పండుగను జరుపుకుంటున్నారు. అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో హోలీ పండుగ ఘనంగా జరిగింది.
W.G: చంద్రగ్రహణం కారణంగా పెనుమంట్ర శ్రీ నత్త రామేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం మూసివేస్తున్నట్లు ఈవో పులగం వేణుగోపాలరావు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. తిరిగి బుధవారం సంప్రోక్షణ పనులు పూర్తి చేసిన అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.
KMM: ఖమ్మం నగరంలోని శ్రీ భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పరీక్షల సంసిద్ధత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో పదవ తరగతి అత్యంత కీలకమని, విద్యార్థులు భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
JGL: బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కొడిమ్యాల రాజయ్య తన కొడుకులు పట్టించుకోవడం లేదని జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. తన భార్య 2020లో మృతి చెందిందని, ఆమె మరణించిన తర్వాత 6 నెలలు చూసుకుని తన పెద్ద కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడని, చిన్న కొడుకు వద్దకు వెళ్తే కోడలు బూతులు తిడుతుందని తెలిపారు.