• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎమ్మెల్యేను కలిసిన నూతన మున్సిపల్ పాలకవర్గం

NGKL: మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం హిందూ, మైనారిటీ, క్రిస్టియన్ మత పెద్దల ఆశీర్వాదంతో భాధ్యతలు స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కుచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి గారి సమక్షంలో మున్సిపల్ ఛైర్మన్‌గా తీగల సునేంద్ర కుమార్, వైస్ ఛైర్మన్‌గా బాదం రమేష్ గారు బాధ్యతల స్వీకారం చేశారు.

February 26, 2026 / 02:15 PM IST

గురుకులాల పాఠశాల ప్రవేశ పరీక్ష వాయిదా

NLR: గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

February 26, 2026 / 02:15 PM IST

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

VZM: గజపతినగరంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో జరిగింది. సభ్యత్వంతో జనసేన కుటుంబాలకు అండగా ఉంటూ బీమా చెల్లించడం జరుగుతుందన్నారు. ఇందులో నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రపు సురేష్, మండల పార్టీ అధ్యక్షులు మునకాల జగన్నాధరావు, నీటి సంఘం నాయకులు తాళ్లపూడి సౌమిత్రి త్రివేది, కృష్ణ పాల్గొన్నారు.

February 26, 2026 / 02:14 PM IST

షీటీం మద్దతుతో కుటుంబ సమస్యలు పరిష్కారం

NRML: ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షణలో షీటీం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ వివాదాలతో బాధపడుతున్న వారికి షీటీం సిబ్బంది ప్రత్యేక కౌన్సిలింగ్ అందించి విడిపోయిన వారిని మళ్లీ కలిపారు. నిర్మల్ వరకు వెళ్లాల్సిన భారం లేకుండా భైంసాలోనే సౌకర్యం కల్పించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

February 26, 2026 / 02:13 PM IST

బ్రాహ్మణచెరువులో NCD సర్వే

W.G: పెనుమంట్ర(మం) బ్రాహ్మణచెరువులో గురువారం ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు ముమ్మరంగా NCD సర్వే నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ.. గ్రామస్థులకు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల పరీక్షలు నిర్వహించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.

February 26, 2026 / 02:13 PM IST

APRCETలో చిలుకూరికి 14వ ర్యాంక్

E.G: ఏపీ విద్యాశాఖ నిర్వహించిన APRCETలో కడియంకి చెందిన ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా 14వ ర్యాంక్ సాధించాడు. రాష్ట్రంలో 17 విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీహెచ్డీ సీట్లు భర్తీ చేసేందుకు 2025 నవంబర్‌లో APRCET పరీక్షలు జరిగాయి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించి గురువారం ఫలితాలు వెల్లడించింది.

February 26, 2026 / 02:13 PM IST

‘ప్రజా ప్రతినిధుల సామాజిక సేవ అభినందనీయం’

KNR: గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో ప్రజా ప్రతినిధుల బాధ్యతాయుతమైన సామాజిక సేవ అభినందనీయమని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆకయన సమక్షంలో వార్డు సభ్యులు ఆడెపు రాజు (అంబులెన్స్), తాడేపల్లి శ్రీనివాస్ (బాడీ ఫ్రీజర్), ఉపసర్పంచ్ ఐలయ్య (వైకుంఠ రథం) పంచాయతీకి విరాళంగా అందజేశారు. దీంతో వారిని MLA అభినందించారు.

February 26, 2026 / 02:13 PM IST

MBU కిడ్నాప్ కేసులో కీలక మలుపు..!

TPT: తిరుపతి విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీ ముగిసింది. పీఆర్వో సతీష్, బౌన్సర్ల నుంచి పోలీసులు కీలక సమాచారం, కాల్ డేటా సేకరించారు. ఎవరి ఆదేశాల మేరకు కిడ్నాప్ జరిగిందనే కోణంలో విచారణ సాగింది. నోటీసులు ఇచ్చినా మంచు విష్ణు ఇంకా విచారణకు రాలేదు. మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మార్చి 3కి వాయిదా పడటంతో ఉత్కంఠ నెలకొంది.

February 26, 2026 / 02:12 PM IST

రెండువ రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

VKB: కుల్కచర్లలో ఇంటర్మీడియట్ పరీక్షల రెండవ రోజు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల పరిశీలకులు తెలిపారు. రామలింగేశ్వర డిగ్రీ కాలేజీలో 186 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ప్రిన్సిపల్ కామేశ్వరి వెల్లడించారు. వివేకానంద జూనియర్ కాలేజీలో 206 మందికి గాను 199 మంది హాజరు కాగా, 7మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు పేర్కొన్నారు.

February 26, 2026 / 02:12 PM IST

మంత్రులను కలిసిన ఏఎంసీ ఛైర్మన్..!

CTR: సోమల ఏఎంసీ ఛైర్మన్ శ్రీనివాసులు నాయుడు అమరావతిలో పలువురు మంత్రులను కలిశారు. హోం మంత్రి అనిత, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్‌ను కలిసి మండలంలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. భూ వివాదాలు, భద్రతా సంబంధిత అంశాలను వారి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. వీటిపై చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు.

February 26, 2026 / 02:12 PM IST

మధ్యాహ్నం పెరుగు తింటున్నారా?

మధ్యాహ్న భోజనంలో పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఎండ వేడి నుంచి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, కాల్షియం శరీరానికి అంది ఎముకలు బలంగా ఉంటాయి. ఇది కడుపు నిండిన భావనను కలిగించి అతిగా తినకుండా చేస్తుంది. అయితే జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు మాత్రం పెరుగుకు దూరంగా ఉండటం మంచిది. 

February 26, 2026 / 02:12 PM IST

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్వో

PPM: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆమె స్థానిక ఆర్‌.కె.జూనియర్‌ కళాశాల, పి.ఎస్‌.ఎం.వాసవి జూనియర్‌ కళాశాలలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు. పరీక్షల సరళిని, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

February 26, 2026 / 02:11 PM IST

డొనేకల్ శివారులో వ్యక్తి దారుణ హత్య

ATP: విడపనకల్లు మండలం డొనేకల్ శివారులో గురువారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని రాళ్లతో కొట్టి చంపినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 02:10 PM IST

రాయలసీమను రతనాల సీమను చేశాం: చంద్రబాబు

AP: రాయలసీమను రతనాల సీమను చేశామని CM చంద్రబాబు అన్నారు. ’14 వారాలు వెలిగొండకు డెడ్‌లైన్ పెట్టాం. ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులు ఈ టర్మ్‌లో పూర్తి చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా..నేనే పూర్తి చేయబోతున్నా. జూలైలో వెలిగొండ ఫేజ్-1 నుంచి నీళ్లు ఇవ్వబోతున్నాం. 2,500 కోట్ల పనులు పెండింగ్ పెట్టి జాతికి అంకితం అంటూ గత పాలకులు హడావుడి చేశారు’అని అన్నారు.

February 26, 2026 / 02:10 PM IST

హవేలీ ఘనపూర్‌లో యాక్సిడెంట్

MDK: హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి వద్ద ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో తిమ్మాయిపల్లికి చెందిన మమత, ఆర్యాన్, పరమేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ప్రవీణ్ కుమార్, కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 02:08 PM IST