• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణ పనులు

SRPT: మునగాల మండలం ముకుందాపురం వద్ద జాతీయ రహదారి 65పై నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పునరుద్ధరణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. గత కొన్ని రోజులుగా లైట్లు వెలగకపోవడంతో వాహనదారులు, రోడ్డు దాటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్థులు అథారిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు సిబ్బందిని పంపి మరమ్మతులు చేపట్టారు.

March 1, 2026 / 12:05 PM IST

యుద్ధం ఎవరికీ ఏమీ మిగల్చదు!

పూర్వకాలపు దాడులకు, నేటి క్షిపణి దాడులకు తేడా ఏముంది? అప్పుడు కత్తులు, ఇప్పుడు బాంబులు. ప్రాణాలు కోల్పోతున్నది మాత్రం అమాయక పసిపిల్లలు, వృద్ధులే. అభివృద్ధి చెందిన దేశాల స్వార్థం వల్ల మానవత్వం మంటగలుస్తోంది. ఆయుధాల దాడిలో సామాన్యుల ఆర్తనాదాలు అరణ్య రోదనలుగా మారుతున్నాయి. మానవత్వం గురించి గొప్పగా చెప్పుకుంటున్న ఈ ఆధునిక కాలంలో, ఇలాంటి హింసాకాండ నాగరిక సమాజానికి తీరని మచ్చ.

March 1, 2026 / 12:05 PM IST

చికెన్ ధరల వివరాలు..!

కడప: జిల్లాలో రంజాన్ మాసం సందర్భంగా చికెన్ ధరలు పెరిగాయి. గత వారం రూ. 220గా ఉన్న కిలో చికెన్ ధర ప్రస్తుతం రూ. 250కు చేరింది. స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ. 270గా విక్రయిస్తున్నారు. డిమాండ్ అధికమవడంతో దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ కనిపిస్తోంది. రంజాన్ కాలంలో వినియోగం పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.

March 1, 2026 / 12:03 PM IST

సికింద్రాబాద్ నుంచి హోలీ కోసం ప్రత్యేక రైళ్లు

HYD: హోలీ పండుగ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక రైళ్లలో ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నుంచి నహరిగన్ సహా ఇతర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఉన్నాయని Rail One యాప్ ద్వారా చూసుకునే వెసులుబాటు కల్పించినట్లుగా పేర్కొన్నారు.

March 1, 2026 / 12:02 PM IST

కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్‌వో

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

March 1, 2026 / 12:02 PM IST

దారప్ప చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీలో వాడే దారప్పచెరువును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈరోజు స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఆ చెరువు మరమ్మతులు చేయాలని రైతులు కోరగా ఆ చెరువు నిండా గుర్రపు డెక్కఆకుతో నిండిపోయి ఉంది. దీంతో కింద ఉన్న వరి పొలాలకు రెండు పంటలకు నీరు అందే విధంగా సహకరించాలని స్థానిక రైతు కారం శ్రీరాములు ఎమ్మెల్యేకు వివరించారు.

March 1, 2026 / 12:00 PM IST

రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన

ప్రకాశం: కంభంలో SI శివకృష్ణారెడ్డి శనివారం రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

March 1, 2026 / 11:59 AM IST

జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక..!

KRNL: ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలి ఉండే వెబ్‌సైట్లను సృష్టించి, భారీ డిస్కౌంట్ల పేరుతో ముందస్తు చెల్లింపులు తీసుకుని వస్తువులు పంపకుండా కేటుగాళ్లు మోసం చేస్తున్నారన్నారు.

March 1, 2026 / 11:59 AM IST

వర్సిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తాం: పొన్నం

TG: విద్యాకమిషన్ నివేదికను రాజకీయం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలన్న నివేదికను స్వాగతిస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీల్లో ఎన్నికలు నిర్వహించేలా అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

March 1, 2026 / 11:58 AM IST

మావోయిస్టులకు బిగ్ షాక్

TG: మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ మహాసముంద్ జిల్లాలో బలంగిరి – బర్‌గఢ్-మహాసముంద్ డివిజన్‌కు చెందిన కీలక మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్‍తో పాటు మరో 14 మంది సరెండర్ అయ్యారు. ఈ క్రమంలో AK-47 రైఫిళ్లు, 2 SLRలు, మూడు 12-బోర్ గన్లు, 14 మస్కెట్లు పోలీసులకు అందజేశారు.

March 1, 2026 / 11:58 AM IST

అప్‌కమింగ్ ప్రాజెక్టులపై నిఖిల్ UPDATE

హీరో నిఖిల్ తన అప్‌కమింగ్ ప్రాజెక్టులపై క్రేజీ అప్‌డేట్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం చేస్తున్న ‘స్వయంభు’తో పాటు, రామ్ చరణ్ నిర్మాణంలో ‘ఇండియా హౌస్’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు వెల్లడించాడు. వీటితో పాటు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కార్తికేయ-3’ కూడా లైన్‌లో ఉందని చెప్పి అభిమానుల్లో...

March 1, 2026 / 11:58 AM IST

యావపూర్‌లో స్వచ్ఛభారత్

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం యావపూర్ సర్పంచ్ యంజాల స్వామి ఆధ్వర్యంలో యువకులు చీపుర్లు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. వీధులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామని సర్పంచ్ స్వామి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.

March 1, 2026 / 11:57 AM IST

నిరాటంకంగా ఇసుక అక్రమ రవాణా

JGL: జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గతంలో ట్రాక్టర్లకే పరిమితమైన ఈ దందా,ఇప్పుడు లారీలు, టిప్పర్లలో బహిరంగంగానే సాగుతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రకృతి సంపదను తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.తనిఖీల్లో వాహనాలు పట్టుబడుతున్నా అక్రమార్కుల తీరు మారడం లేదని, అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలన్నరు.

March 1, 2026 / 11:56 AM IST

జిమ్ లో లవ్.. పెళ్లికి నిరాకరణ!

SRD: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్‌కు చెందిన యువతికి, మయూరినగర్ నివాసి అరవింద్‌కు జిమ్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతి వివాహం చేసుకోవాలని కోరగా అతను నిరాకరించి దూరం పెడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

March 1, 2026 / 11:55 AM IST

‘అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలి’

KMM: అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రాము, వెంకట్రామయ్య అన్నారు. బుధవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఖమ్మం పాత బస్టాండ్ వద్ద అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. మాదిగల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని పేర్కొన్నారు.

March 1, 2026 / 11:54 AM IST