• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నా స్థలం కూడా పోయింది: మంత్రి

NLR: అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. నేలపాడులో 4,026 ఉద్యోగుల క్వార్టర్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. పనుల్లో జాప్యం జరిగితే నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో తన సొంత 60 సెంట్ల స్థలం కూడా పోయిందని చెప్పారు.

March 2, 2026 / 12:35 PM IST

IND vs AFG: జూన్‌లో భారత్ పర్యటనకు అఫ్గన్

అఫ్గన్ టీమ్ జూన్‌లో భారత్ పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య భారత జట్టుతో ఆఫ్గన్ ఓ టెస్ట్, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. టెస్ట్(న్యూ చండీగఢ్) జూన్ 6న ప్రారంభం కానుండగా.. 14న తొలి వన్డే(ధర్మశాల), 17న రెండో మ్యాచ్(లక్నో), 20న మూడో వన్డే(చెన్నై) జరగనున్నాయి. అఫ్గన్ పర్యటన సందర్భంగా రోహిత్-కోహ్లీ జోడీ మరోసారి ‘మెన్ ఇన్ బ్లూ’ జెర్సీలో అభిమానులను అలరించనున్నారు.

March 2, 2026 / 12:33 PM IST

‘విద్యార్థుల విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం’

MNCL: సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని బాలుర సమీకృత వసతి వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన సరఫరా, త్రాగునీరు, వసతి, వంటశాల ఏర్పాట్లను పరిశీలించారు.

March 2, 2026 / 12:33 PM IST

నిజాలాపూర్‌లో దొంగ పట్టివేత

MBNR: మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామస్థులు సాహసం చేసి ఓ దొంగను పట్టుకున్నారు. అదే గ్రామానికి చెందిన శివ ఖరీదైన ఐఫోన్లు, ల్యాప్టాప్లు, బైక్లు వరుసగా దొంగతనం చేస్తూ జల్సాలు చేస్తున్నాడన్న అనుమానంతో నిలదీశారు. అతని ఇంట్లో సోదాలు చేయగా భారీగా చోరీ సొత్తు లభ్యమైంది. నిందితుడిని, స్వాధీనం చేసిన వస్తువులను పోలీసులకు అప్పగించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

March 2, 2026 / 12:32 PM IST

ప్రజలకు మెరుగైన పాలన అందిస్తాం: ఛైర్పర్సన్

VKB: తాండూరు పట్టణ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాలరాజు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

March 2, 2026 / 12:32 PM IST

136 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్ విడుదల

HYD: మహానగర తాగునీటి సరఫరా బలోపేతానికి HMWSSB ఆధ్వర్యంలో మంజీరా, గండిపేటకు మరో రెండు పైపులైన్లు వేయాలని నిర్ణయించారు. HYDలో 300 వార్డులకు విస్తరించిన వేళ పని భారం మోసేందుకు అధికారులు అవసరం కానున్నారు. దీంతో 136 మేనేజర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.

March 2, 2026 / 12:31 PM IST

జూనియర్ కళాశాల వేడుకలలో ఎమ్మెల్యే

BHNG: వలిగొండ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు అయినా సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ జూనియర్ కళాశాల కట్టించినటువంటి దాత పైళ్ళ మల్లారెడ్డి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ఈ కాలేజీ నిర్మించిన పైళ్ళ మల్లారెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

March 2, 2026 / 12:31 PM IST

రేపు శ్రీవారి ఆలయం మూసివేత

TPT: చంద్రగ్రహణం సందర్భంగా వడమాలపేట మండలం అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయం మూసి వేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 5:45 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ జరుగుతుంది. ఉదయం 6:15–6:45 విశ్వరూప దర్శనం, 8–8:45 సర్వదర్శనం. 9 నుంచి రాత్రి 8 వరకు ఆలయం మూసివేత. అనంతరం శుద్ధి, ఏకాంత సేవ జరగనుంది.

March 2, 2026 / 12:30 PM IST

రంజాన్ సందర్భంగా డీఎస్పీ కీలక సూచనలు

ASF: ఎస్పీ ఆదేశాల మేరకు కాగజ్ నగర్ డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం పెద్దలు, వ్యాపారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ వహీదుద్దీన్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ వేళ నిర్ణీత సమయం వరకే దుకాణాలు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

March 2, 2026 / 12:30 PM IST

మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్ వచ్చేసింది

1965 మోంటే కార్లో ర్యాలీ విజేతకు నివాళిగా ‘మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్’ను భారత్‌లో లాంచ్ చేశారు. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎక్స్‌క్లూజివ్ చిలీ రెడ్ పెయింట్, బోనెట్‌పై వైట్ స్ట్రైప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ స్పెషల్ ఎడిషన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు వింటేజ్ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

March 2, 2026 / 12:30 PM IST

సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఇవే

TG: పశ్చిమాసియాలో దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. CM రేవంత్ ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విదేశాంగ శాఖతో అధికారులు సమన్వయం చేసుకుంటూ.. విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర పౌరుల కోసం హెల్ప్ డెస్క్ సిద్ధం చేశారు. సహాయం కోసం 98719 99044, 99583 22143, 99100 14749, 96437 23157 నంబర్లను సంప్రదించండి.

March 2, 2026 / 12:29 PM IST

వీధిలైట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం

KMM: మధిర మండలం ఇల్లూరు గ్రామంలో ఎల్ఈడి వీధిలైట్ల ఏర్పాటు కార్యక్రమం సోమవారం సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి స్వయంగా పర్యవేక్షించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో అనేక వీధులు చీకటిలో మగ్గిపోతుండగా గ్రామస్తుల సమస్య తెలుసుకొని దగ్గరుండి సర్పంచ్ పరిష్కరించారు. గ్రామ అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ఆదిలక్ష్మి వెల్లడించారు.

March 2, 2026 / 12:29 PM IST

రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన అఖిల్

KMR: పల్వంచ మండలం భవానిపేటకి చెందిన అఖిల్ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాడు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా పీఎం-పోషణ్ పథకం అమలులో ఉత్తమ పురస్కారం అందుకున్నాడు. ఈ సందర్భంగా అఖిల్ తండ్రి, ఉపసర్పంచ్ రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. అఖిల్ రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.

March 2, 2026 / 12:28 PM IST

అమరావతిపై వైసీపీ విమర్శలు అర్ధరహితం: మంత్రి

AP: అమరావతిపై వైసీపీ విమర్శలు అర్ధరహితమని మంత్రి నారాయణ అన్నారు. నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అలాగే, ఉద్యోగులకు నిర్మిస్తున్న 4,026 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. గత 3 నెలల్లో రాజధానిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని చెప్పారు. వచ్చే మూడేళ్లలో పరిపాలన భవనాలు అందుబాటులోకి తెస్తామన్నారు.

March 2, 2026 / 12:28 PM IST

మహిళల భద్రతపై వ్యాసరచన పోటీ

PPM: చిన్నమేరంగిలో జిల్లా పరిషత్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళల భద్రత – సమిష్టి బాధ్యత” అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మహిళల రక్షణ, చట్టాలపై అవగాహన, సమాజ బాధ్యత వంటి అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

March 2, 2026 / 12:27 PM IST