MNCL: మందమర్రి చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు రూ. కోటి నిధులు మంజూరు చేసిన మంత్రి వివేక్‌కి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి సదానంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మాట్లాడుతూ గతంలో చెరువు కట్టను పరిశీలించిన మంత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: గన్నవరంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా సమర్థవంతంగా చేపట్టాలని నేతలకు సూచించారు. గ్రామ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్మించనున్న 16 కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్లొన్నారు.
అన్నమయ్య: రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ డేరంగుల అనే వ్యక్తి నూతన దర్శకుడుగా తెలుగు, తమిళ్ భాషలో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలోని హోటల్ బ్లెస్స్‌లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్‌కు తిరుమల దేవస్థానంకు పలువురు ప్రముఖులు విచ్చేశారు.
KRNL: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కార్యకలాపాల కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ – కర్నూలు సిటీ (17435), కాచిగూడ-రాయచూరు (67787) రైళ్లతో పాటు, కర్నూలు సిటీ-కాచిగూడ (17436) రైలును మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు.. 8 రోజులు రద్దు చేశారు. ప్రయాణికులు మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.
MDCL: చెంగిచెర్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల లిస్టును అధికారులు విడుదల చేశారు. 250C చెంగిచెర్ల నుంచి వయా చర్లపల్లి టూ సికింద్రాబాద్, 71A అఫ్జల్ గంజ్, 280 ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్, 18C చెంగిచెర్ల డిపో నుంచి సికింద్రాబాద్, 49M/250 ఈసీఐఎల్ మీదుగా మెహదీపట్నం బస్సు అందుబాటులో ఉందని DM కవిత ప్రకటనలో తెలిపారు.
ELR: ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు ఆదివారం ఏలూరులో మాంసపు దుకాణాలపై తనిఖీలు చేపట్టారు. పాడైపోయిన చికెన్ విక్రయిస్తున్నట్లు గుర్తించి యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కల్తీ మాంసం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, నిబంధనలు పాటించని షాపులకు జరిమానా విధించారు. నగరవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతుండటంతో మాంసం వ్యాపారుల్లో కలకలం రేపింది.
కళ్ల కింద నల్లటి వలయాలను కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఫోన్, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గిస్తే మంచిది. కళ్లపై కీరా ముక్కలు లేదా ఐస్ కంప్రెస్ ఉంచితే ఉపశమనం లభిస్తుంది. శనగపిండి మిశ్రమాన్ని కళ్ల కింద రాసి, ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. కళ్ల దగ్గర ఐస్ కంప్రెస్ చేయాలి.
AP: బీహార్ సీఎం నితీష్‌కుమార్‌కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నితీష్ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. ప్రజసేవలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.
HYDలో ఓవైపు దోమల బెడద, మరోవైపు వాతావరణ పరిస్థితుల మార్పుతో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. కోరంటి ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోగులు పోటేత్తుతున్న పరిస్థితి. గత 20 రోజుల్లోనే దాదాపు 10% పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. నిత్యం చేతులు శుభ్రపరచుకోవడం, పౌష్టికి ఆహారం తీసుకోవడం, అధికంగా నీరు సేవించాలన్నారు.
విశాఖ: ICAR-CMFRI శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3×3 మీటర్ల HDPE తేలియాడే తెప్పలను విశాఖపట్నం తీరంలో మత్స్యకారులు వినియోగంలోకి తెచ్చారు. ఈ తెప్పలు సముద్ర అలలను తట్టుకుంటూ తక్కువ పెట్టుబడితో చేపలు, సముద్ర నాచు సాగుకు అనుకూలంగా ఉంటాయి. దీంతో మత్స్యకారుల ఆదాయం పెరిగి నీలి విప్లవానికి ఊతం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
BDK: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని శ్రీ హేమాచల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని కోరినట్లు తెలిపారు.
MDCL: కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని అక్కడి ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే లక్ష సంతకాల సేకరణ జోరుగా సాగుతోంది. గత నాలుగు రోజులుగా మల్కాజ్‌గిరి బార్డర్ లైన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాల్లో యువత భారీ సంఖ్యలో పాల్గొన్నట్లుగా కార్యనిర్వాహకులు తెలియజేశారు. అందరూ ఇందులో పాల్గొనాలని కోరుతున్నారు.
NTR: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ బ్యారేజ్‌పై నుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని మహాలక్ష్మి (45)గా పోలీసులు గుర్తించారు. ఆమె ఏ ప్రాంతానికి చెందినవారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
NGKL: కల్వకుర్తి మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. టమాటా కిలో కేవలం రూ. 10 పలుకుతుండగా, వంకాయ రూ.30, దోసకాయ, క్యారెట్, దొండకాయ కిలో రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. బెండకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు కిలో రూ.50 ఉండగా, పచ్చిమిర్చి అత్యధికంగా రూ.60కు చేరుకుంది. ధరలు తగ్గడంతో సామాన్యులకు కొంత ఊరట లభించినట్లయింది.